22, జనవరి 2025, బుధవారం

కొన్ని సంతోషాలు..!!






    




   నిన్నటి పుట్టినరోజు చాలా సంతోషాన్ని అందించింది. డా కత్తిమండ ప్రతాప్ గారి శ్రీ శ్రీ కళావేదిక వారి ఆహ్వానం మేరకు కౌతు పూర్ణానంద కళావేదికలో జరిగిన ప్రతాప్ గారి పుట్టినరోజు వేడుకలు, కవులకు పురస్కారాల సంబరంలో బోలెడుమంది ఆత్మీయులను కలవడం చాలా సంతోషమనిపించింది. 

     విత్తనం మెుక్క కావడం అది చెట్టై మహా వృక్షమై విశ్వవ్యాప్తంగా తన ఉనికిని చాటుకోవడం చూసి చాలా చాలా సంతోషమనిపించింది. మన తెలుగు మన సంస్కృతిలో కవితల న్యాయనిర్ణేతగా పరిచయమై, నాతో ఎన్నో సమీక్షలు గోదావరి పత్రికలో రాయించి, నా పుస్తకాలకు ముందు మాటలు, సమీక్షలు రాసి, శ్రీ శ్రీ కళావేదిక తరపున ప్రత్యేక పురస్కారాన్ని అందించిన డా కత్తిమండ ప్రతాప్ గారికి మనఃపూర్వక ధన్యవాదాలు 🙏. ఆత్మీయంగా ఆహ్వానించిన రమావత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner