2008 నుండి ఇప్పటి వరకు అంటే గత 18 సంవత్సరాలుగా మా ఉప్పల రాజ్యలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ నుండి మాకు చాతనయినంత ప్రతి సంవత్సరం దాదాపుగా 60/70 వేలకు ఒక్కోసారి లక్ష ఆపైన కూడా చదువుకునే పిల్లలకు ఇస్తూనే వున్నాము. చాలామంది పిల్లలు చదువు అయిపోయి ఉద్యోగాలు కూడా చేస్తున్నారు.
మనం ఇచ్చే 5/10 వేలతో వారి చదువులు అయిపోలేదు. ఇలాగే మరికొందరు వారికి సాయం చేసారు. గతాన్ని మర్చిపోతే మనం మానవత్వమున్న మనుష్యులం అనిపించుకోము. మనం పొందిన సాయం గుర్తుంచుకుని, మనం కూడా మరొకరికి సాయపడాలని అనుకోకపోవడం చాలా బాధ కలిగిస్తోంది.
మేము అందరిలానే రూపాయి దాచుకుని మా అవసరాలకు ఖర్చుపెట్టుకోగలం. మాకు జీవితాన్ని ఎంజాయ్ చేయడం వచ్చు. పదిమందికి సాయం చేసే అవకాశం మనకి భగవంతుడు ఇచ్చినప్పుడు కనీసం ఒక్కరికైనా చేయకపోవడం అన్నది ఎవరి విజ్ఞతకు వారికే వదిలేస్తున్నా.
మీరు సంపాదించుకుని బావుండటం మంచిదే. పొందిన సాయాన్ని కాస్తయినా తిరిగి మరొకరికి చేయాలన్న మంచిమనసు ఈ 18 సంవత్సరాలలో సాయం పొందిన వారిలో ఒక్కరికి కూడా లేనందుకు చాలా బాధపడుతున్నాను. మన పెంపకాలు ఎంత బావున్నాయన్నది ఇలాంటి సంఘటనలను బట్టే తెలుస్తుంది.
“తీసుకోవడం మాత్రమే తెలిస్తే సరిపోదు, కాస్తయినా తిరిగివ్వడం కూడా తెలియాలి. చదువుకుంటే సరిపోదు, కనీస విలువలు కాస్తయినా నేర్చుకోండి”.

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి