1. శుభాలకు అక్కర్లేని
చుట్టరికం
అశుభాలకు
అవసరమా..!
లెక్కలు
సరిజేయబడును..!!
2. జీవితమంటే
పోరాటమే
బంధాలన్నీ
బహుదూరమే
అలల
కలలే అన్నీ..!!
3. పున్నమి
వెన్నెల
జామాకుల
సోయగాలు
చీకటి
చిత్రాలు..!!
4. పదులు
వేలు
సమానం
కాదు
లెక్కలు
నేర్చుకోవాలి..!!
5. బతుకుతున్నది
అబద్ధంలో
అభద్రతా భావంలో
మనసు
వెలుతురు చూడలేని
చీకటి..!!
6. మనం
చేసిందే
మనకి
తిరిగి వస్తుంది
కాలానికి
గుర్తెక్కువ..!!
7. మనకు
ఇవ్వడమూ చేతకాదు
ఇచ్చినా
తీసుకునే సుగుణమూ లేదు
అర్హత
కాలం నిర్ణయిస్తుంది..!!
8. భజన చేసేది
మనమే
భోక్తలమూ
మనమే
భుక్తి కోసమే
కుయుక్తులు..!!
9. రికార్డుల వేట
ఒకరిది
ఆకలి ఆట
మరొకరిది
కళా నైపుణ్యం
అద్భుతమే..!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి