26, నవంబర్ 2010, శుక్రవారం
కిరణం వాడి వేడి....
మన ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు తన వాడి వేడి కిరణాల ప్రతాపం ప్రతిపక్షానికి చూపించినట్లు రాష్ట్ర అభివృద్దిలో కుడా చూపించి అంధకారాన్ని పారద్రోలతారో లేక అమ్మగారి కి సలాములు, గులాములు చేస్తూ చప్పగా చల్లారి పోతారో.....అది కాక పొతే ఇంకా ఎంత మంది అనుకోని అదృష్టం పట్టబోయే ముఖ్యమంత్రులు అమ్మగారి లిస్టులో వున్నారో మరి!! జస్ట్ వెయిట్ అండ్ సీ !!
వర్గము
కబుర్లు
ఊసులాడే ఒక జాబిలట.......
ఇళయరాజా గారు స్వరపరచిన మధుర మనోహరమైన పాట ఇది. హృదయం లోని ఈ పాట... తన ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన అమ్మాయికి చెప్పలేక..... పాటగా చెప్పిన తీరు ప్రతి ఒక్కటి మనసును కదిలిస్తుంది. సినిమా కుడా చాలా చాలా బావుంటుంది. మురళి ఇప్పుడు మనమద్యన లేక పోయినా ఈ పాటతో మన అందరి హృదయాలలోనూ ఎప్పటికీ మిగిలిపోతారు....మీకోసం పాట లింక్ ఇక్కడ....
http://www.youtube.com/watch?v=3MizZdc-u1Y
ఊసులాడే ఒక జాబిలట సిరిమువ్వలుగా నను తాకెనట 2
చూపులతో బాణమేసెనట చెలి నా ఎదలో సెగ రేపెనట
మాటే వేదం తానే నా లోకం ప్రేమే యోగం *ఊసులాడే *
అందాలే చిందే చెలి రూపం నా కోసం
ఆనందం నిలిపేటి ధ్యానం చెలి ధ్యానం
అదే పేరు నేను జపించేను రోజూ
ననే చూసేటి వేళ అలై పొంగుతాను
మౌనం సగమై మొహం సగమై
నేనే నాలో రగిలెను *ఊసులాడే *
నాలోన రేగేనే పాట చెలి పాట
నీడల్లే సాగే నీ వెంట తన వెంట
స్వరాలై పొంగేనా వరాలే కోరేనా
ఇలా ఊహల్లోనా సదా ఉండిపోనా
ఒకటై ఆడు ఒకటై పాడు
పండగ నాకు ఏనాడు *ఊసులాడే *

పాటలు
24, నవంబర్ 2010, బుధవారం
అంధకారం లో ఆంధ్ర దేశం
మన మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు చని పోయిన తరువాత జరిగిన జరుగుతున్న ఆధిపత్యపు పోరు చూస్తూ వుంటే ముఖ్యమంత్రి గా వున్న రోశయ్యగారే సమర్ధవంతమైన నాయకుడు అనిపించింది నాకు ఇప్పటికి. మొత్తానికి అన్ని వైపుల నుంచి ఒత్తిడితో రోశయ్యగారి రాజీనామా కార్యక్రమం ఈ రోజుతో ముగిసింది. ఇష్టం లేక పోయినా కష్టంగానే ముఖ్యమంత్రి పదవిని త్యజించిన త్యాగశీలి. ఇప్పటి వరకు అధిష్టానం ఎలా చెప్తే అలా తల ఆడించిన రోశయ్యగారు వయోభారంతో అలసి, సంవత్సరం నుంచి...ఇంటా బయటా సమస్యలతో సహవాసం చేసి "మింగమంటే కప్పకు కోపం వదలమంటే పాముకు కోపం" చందాన అందరితో వేగ లేక చేతులెత్తేశారు. ఇంకేముంది ఎప్పటినుంచో దీనికోసమే ఎదురు చూస్తున్న ఎందరో మహానాయకులం అనుకునే వారు అందరూ నేనంటే నేనని...ముఖ్యమంత్రి పదవి నాదంటే నాదని సామ, దాన, బేధ, దండోపాద్యాయాలను అలుపెరుగని పోరాట పటిమను వారి వారి రీతులలో ప్రదర్శిస్తూ అమ్మగారి సేవలో తలమునకలు అవుతున్నారు.
"వారసత్వ,కుల,వర్గ,ప్రాంత,ధన రాజకియాల తో విసిగి రోషం తో రాజీనామా సమర్పించిన రోశయ్య
రోషంలేని రోశయ్య అని వ్యంగ్యం చేసిన ప్రతి ఒక్కరికి రానున్న ఆర్ధిక మాంథ్యాన్నే గుణపాఠం గా వదిలి వెళ్తున్న ఆర్ధిక మేధావి"
మరి అధిష్టానం దేవత ఎవరి పై కరుణ చూపుతారో పట్టం ఎవరికీ కడతారో....మళ్ళి ఏ పేరు ఎలా మారిపోతుందో చూడాలంటే కొంత కాలం...కొంత కాలం ఎదురు చూడాల్సిందే....అప్పటి వరకు తెలుగు ప్రజానీకం అమ్మగారి ఆజ్ఞా ఏంటా అని బిత్తర చూపులు చూస్తూ అంధకారంలో మగ్గాల్సిందే!!

23, నవంబర్ 2010, మంగళవారం
మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు....
ఇళయరాజా గారు స్వరపరచిన ఓ పాపా లాలి చిత్రంలోని ఓ చక్కటి పాట ఇది. బాలు గారి గాన మాధుర్యానికి మాత్రమే కాకుండా వారి అసమాన ప్రతిభకు తార్కాణం ఈ పాట..పల్లవి, చరణాలు ఆపకుండా పాడటం ఈ పాట ప్రత్యేకత. మీరు వినండి చూడండి. లింక్ మీకోసం ఇక్కడ......
http://www.oonly.com/video/ASh2neJpH_M/Maate_Raani_Chinnadani
మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలూ
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా
రేగే మూగ తలపే వలపు పంటరా
వెన్నెలల్లే పూలు విరిసి తేనెలు చిలికెను
చెంత చేరి ఆదమరచి ప్రేమను కొసరెను
చందనాలు జల్లు కురిసే చూపులు కలిసెను
చందమామ పట్టపగలే నింగిని పొడిచెను
కన్నెపిల్ల కలలే నాకిక లోకం
సన్నజాజి కళలే మోహన రాగం
చిలకల పలుకులు అలకల ఉలుకులు నా చెలి సొగసులు నన్నే మరిపించే!
మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలూ
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా
రేగే మూగ తలపే వలపు పంటరా
ముద్దబంతి లేత నవ్వులు చిందెను మధువులు
ఊసులాడు మేని వగలు వన్నెల జిలుగులు
హరివిల్లు లోని రంగులు నా చెలి సొగసులు
వేకువల మేలు కొలుపే నా చెలి పిలుపులు
సందెవేళ పలికే నాలో పల్లవి
సంతసాల సిరులే నావే అన్నవి
ముసి ముసి తలపులు తరగని వలపులు నా చెలి సొగసులు అన్నీ ఇక నావే !!

22, నవంబర్ 2010, సోమవారం
మూలకారణం......???
నాకు తెలిసిన ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ళ తో ఒక అమ్మాయి కలిసి వుండే వాళ్ళు. ముందు చాలా మందే కలిసి వుండే వాళ్ళు. అమెరికాలో మాస్టర్స్ అంటే అది మామూలే లెండి. అందరు కలిసిమెలిసి చాలా బావుండేవాళ్ళు. మేమున్న ఊరిలో రెండు యూనివర్సిటీలు ఉండేవి. స్టూడెంట్స్ బాగా ఎక్కువ గానే వుండేవాళ్ళు. మొదట్లో మాకు బాగానే హెల్ప్ చేసారు, తమ్ముడు కాదులెండి అన్న. తరువాత ఇంట్లో పిల్లలానే వుండేవాళ్ళు అందరును. తమ్ముడికి, అన్నకి గొడవ వచ్చి తమ్ముడు మా ఇంట్లో కొన్ని రోజులు వున్నాడు. తర్వాత వేరే ఊరు వెళ్ళిపోయాడు ఏదో జాబు, బిజినెస్ అని. వెళ్ళే ముందురోజు అన్నతో, ఆ అమ్మాయి తో చెప్పిరా అంటే వెళ్లి...మొత్తానికి వాళ్ళ మద్యలో గొడవ పోయి మాములుగా అయిపోయారు. ఇక తరువాత మాతో మాట్లాడటం మానేశారు. అప్పటికి ముగ్గురికి పెళ్ళిళ్ళు కాలేదు. కొన్ని రోజులకి అమ్మాయి కి కుదిరింది. నేను వేరే ఊరిలో వుంటే ఫోన్ చేసి చెప్పింది. తరువాత పెళ్లి ఐనంక కుడా ఒకటి రెండు సార్లు ఇంటికి వచ్చి వెళ్ళింది కాని ఈ అన్నదమ్ములు మాత్రం ఒక్క మాట కుడా చెప్పకుండా పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అందరు నన్ను నవ్వే వాళ్ళు "నీకు నలుగురు కొడుకులు" అని. ఇదండీ నా కొడుకులు కాని కొడుకుల ఇద్దరి సంగతి సూక్ష్మంగా.. ఎక్కువగా రాశాననుకోండి మళ్ళి ఇప్పటికే కోపంగా వున్న వాళ్లకి ఇంకా కోపం ఎక్కువ అవుతుంది తట్టుకోలేను. అస్సలే ఈ మద్య రాసిన తల్లిని చూడని కొడుకు సంగతికి కొంతమంది నా మీద బోల్డు కోపంగా వున్నారు, కారాలు మిరియాలు నూరుతున్నారు. మరి తప్పుని తప్పు అనకుండా వుండటం ఎలా? చెప్పండి.
అదే ఊరిలో ఇంకొక ఫ్యామిలి వుండేవాళ్ళు మా ఇంటికి దగ్గరలోనే. ఆమె,వాళ్ళ బాబు వచ్చిన కొత్తలో నుంచి మేము ఇండియా వచ్చే ఒక ఐదు, ఆరు నెలల ముందు వరకు మాతో చాలా చాలా బావుండే వాళ్ళు. మరి ఏమైందో తెలియదు నాకు ఇప్పటికి కుడా, ఎంతో బావుండే వాళ్ళు కుడా సడన్ గా రావడం, మాట్లాడటం మానేశారు.
ఇంకొక ఆవిడ కుడా అంతే. ఇండియా వచ్చే వరకు బానే వుంది మరి ఏమైందో తెలియదు ఒకటి రెండు సార్లు ఫోన్ చేస్తే పెడసరంగా మాట్లాడింది. మరి ఆవిడ బాదేంటో!!
మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలి ఒక రెండు మూడు నెలలు మా ఇంట్లోనే వున్నారు తనకి జాబ్ లేక పొతే. తరువాత వేరే ఇల్లు తీసుకుని అక్కడే వున్నారు కొన్ని రోజులు. మా ఫ్రెండ్ జాబు కి వేరే ఊరు వెళ్ళినా తను మాదగ్గరలోనే వుండేది పిల్లలతో. చాలా మార్పులు ఆ తర్వాతే వచ్చినట్లు అనిపించింది నాకు. అయినా చెప్పే వాళ్ళు ఎప్పుడూ వుంటారు వినే వాళ్ళదే తప్పు నా దృష్టిలో.
ఏంటి ఈ సోది ఎందుకు చెప్తున్నాను అంటారా !! అక్కడికే వస్తున్నా అన్నిటికి మూలకారణం ఈ పాటికి మీకు అర్ధం ఇయ్యే వుండాలి కదా!! అదేనండి బాబు అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ.... చెప్పుడు మాటలు వినడం, వినడమే కాకుండా నమ్మడం.

21, నవంబర్ 2010, ఆదివారం
బ్లాగ్ వనభోజనాల స్పెవల్ - సొరకాయ కోఫ్తా
సొరకాయ కోఫ్తా కి ఏమి కావాలో ముందుగా చెప్తాను అందరూ వింటున్నారా!!( చదువుతున్నారా!!) అయితే సరే!!
కొద్దిగా లేత సొరకాయ, కూరకి సరిపడినంత మంచినూనె, కొద్దిగా కారం, సరిపడినంత ఉప్పు, చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద కొద్దిగా కొద్దిగా గరం మసాలా, సెనగపిండి కోఫ్తాలకు సరిపడినంత ఇంకా కొత్తిమిర, కరివేపాకు, చాలా కొంచం చింతపండు, ఉల్లిపాయముక్కలు, కొన్ని పర్చిమిరపకాయ ముక్కలు సన్నగా తరిగినవి, టమాట ముక్కలు కుడా బాగా చిన్నగా తగిగినవి... తాలింపుదినుసులు, జీడిపప్పు పొడి కొంచం గుర్తు ఉన్నంత వరకు ఇవేనండి
ఇక కూర చేయడం ఎలా??
ముందుగా సోరకాయను పైపెచ్చు(తోలు) తీసి కొబ్బరి తగినట్లుగా సొరకాయ కోరు తీసి పెట్టుకోవాలి. ఒక పళ్ళెం లో కాని లేదా చిల్లుల ప్లేట్ లో కాని కొద్ది సేపు ఉంచితే సొరకాయ లోని నీరు బయటకు వచ్చేస్తుంది. ఒక్కసారి బాగా పిండితే మిగిలిన నీరు ఏమైనా వుంటే అది కుడా వచ్చేస్తుంది. అప్పుడు దీనిలో ఉప్పు, కారం, పసుపు, అల్లంవెల్లుల్లి ముద్ద, గరం మసాలా, కొద్దిగా జీలకర్ర, కోఫ్తాలకు సరిపడినంత సెనగపిండి వేసి బాగా కలుపు కోవాలి. ఇప్పుడు చిన్న చిన్న కోఫ్తాలుగా చేసుకుని పొయ్యి వెలిగించి, స్టౌవ్ మీద పాన్ పెట్టి పాన్లో నూనె ఎక్కువగా పోసి కోఫ్తాలను బాగా వేయించి తీసి పక్కన పెట్టుకుని, వేరే పాన్ స్టవ్ పై పెట్టి పాన్ లో కొద్దిగా నూనె వేసి తాలింపు పెట్టి పర్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయముక్కలు, టమాటో ముక్కలు, కరివేపాకు వేసి బాగా మగ్గిన తరువాత కొద్దిగా చింతపండు వేసి కొన్ని నీళ్ళు పోసి వుడకనివ్వాలి. కాస్త వుడికిన తరువాత వేయించి పక్కన పెట్టుకున్న సొరకాయ కోఫ్తాలు వేసి, జీడిపప్పుల పొడి చల్లి కొద్ది సేపు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక బౌల్ లోకి కూర తీసుకుని పైన కొత్తిమీర చల్లితే వనభోజనాలకి వడ్డించడానికి సొరకాయ కోఫ్తా కూర రడీ అయిపోయినట్లే.
మరి రుచి చూసి చెప్పండి ఎలా వుందో!!

వంటలు
19, నవంబర్ 2010, శుక్రవారం
అనుకోనిది.....
ప్రేమలో ప్రాణంగా
కోపంలో అలుకలా
మౌనంలో మాటగా
ఉహలో ఊసులా
బాధలో కన్నీరుగా
ఆనందంలో చిరునవ్వులా
నీ గుప్పెడంత గుండెలో చోటు చేసుకున్న
నా జ్ఞాపకం నాకెంతో ఇష్టం!!
కోపంలో అలుకలా
మౌనంలో మాటగా
ఉహలో ఊసులా
బాధలో కన్నీరుగా
ఆనందంలో చిరునవ్వులా
నీ గుప్పెడంత గుండెలో చోటు చేసుకున్న
నా జ్ఞాపకం నాకెంతో ఇష్టం!!
వర్గము
కవితలు
18, నవంబర్ 2010, గురువారం
అందమైన ప్రేమలేఖ....
గుణ సినిమా లోని వెన్నెలకంటి గారు రాసిన ఈ పాటని ఇళయరాజా గారి స్వరకల్పనలో బాలు శైలజ మాట్లాడుతూ పాడిన మధురగీతం. నాకు చాలా చాలా నచ్చిన పాటల్లో ఇది ఒకటి. కమల్ నటన చెప్పడానికి మాటలు చాలవు. అమాయకమైన మాటలతో ప్రేమను ప్రియురాలికి చెప్పే విధానం అందరికి ఎంతో నచ్చుతుంది....
మీ కోసం విడియో లింక్ ఇక్కడ http://www.youtube.com/watch?v=x7pFz4E8Vso
అబ్బాయి : రాయి
అమ్మాయి : ఏం రాయాలి
అబ్బాయి : లెటర్
అమ్మాయి : ఎవరికీ
అబ్బాయి : నీకు
అమ్మాయి : నాకా..?
అబ్బాయి : ఊ..
అబ్బాయి : నాకు వ్రాయటం రాదూ, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా..
అమ్మాయి : వెయిట్, వెయిట్.....
అమ్మాయి : నాకు నువ్వు రాసే ఉత్తరం, నేను రాసి...
అబ్బాయి : నాకు చదివి వినిపించి తరువాత నువ్వు.. చదువుకో
అమ్మాయి : ఐ లైక్ ఇట్ ..ఊ.. చెప్పు
అమ్మాయి : ఊ....
అబ్బాయి: ఆఆ..
అబ్బాయి : నా ప్రియా...ప్రేమతో.. నీకు
అమ్మాయి : నీకు
అబ్బాయి: నే..
అమ్మాయి : రాసే..
అబ్బాయి : నేను
అమ్మాయి : ఊ....
అబ్బాయి : రాసే
అమ్మాయి : ఉత్తరం.
అబ్బాయి: ఉత్తరం..లెటర్..చ...లేక..ఊ... కాదు..ఉత్తరమే అని రాయి
అమ్మాయి : ఊ..అదీ
అబ్బాయి : చదువు..
అమ్మాయి : కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే
అబ్బాయి : పాటలో మర్చి రాసావా..అప్పుడు నేను కూడా మారుస్తా..
అబ్బాయి : మొదట నా ప్రియా అన్నాను కదా , అక్కడ ప్రియతమా అని మార్చుకో..
అబ్బాయి: ప్రియతమా నీవింట్లో క్షేమేమా.. నేను ఇక్కడ క్షేమం
అమ్మాయి: ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే
అబ్బాయి : ఆహా....ఒహో.. నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది
అబ్బాయి : కానీ అదంతా రాయాలని కూర్చుంటే, అక్షరాలే..మాటలే...!
అమ్మాయి: ఉహలన్ని పాటలే కనుల తోటలో..
అబ్బాయి : అదీ...
అమ్మాయి : తొలి కలల కవితలే మాట మాటలో....
అబ్బాయి : అదీ...ఆహా..భ్రమ్మాండం...కవిత..కవిత..ఊ...పాడు...
కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే
ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే
ఉహలన్ని పాటలే కనుల తోటలో..
తొలి కలల కవితలే మాట మాటలో....
ఓ హో...
కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే
లాల ల ల ల లా ల ల...
ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే
లాల ల ల ల లా ల ల...
అబ్బాయి: ఊ...
అబ్బాయి : నాకు తగలిన గాయం అదీ చల్లగా మానిపోతుంది..
అబ్బాయి : అదేమిటో నాకు తెలీదు, ఏమి మాయో తెలీదు నాకు ఏమి కధసలు..
అబ్బాయి : ఇది కూడా రాసుకో...
అబ్బాయి : అక్కడక్కడ పువ్వు, నవ్వు, ప్రేమ అలాంటివి వేసుకోవాలి ఆ......
అబ్బాయి : ఇదిగో చూడు నాకు ఏ గాయం అయ్యినప్పటికి ఒళ్ళు తట్టుకుంటుంది
అబ్బాయి : నీ వొళ్ళు తట్టుకుంటుందా..?
అబ్బాయి : ఉమా దేవి....దేవి ఉమా దేవి...
అమ్మాయి : అది కూడా ర్యాల..?
అబ్బాయి : ఆహా..హా....
అబ్బాయి : అది ప్రేమా....
అబ్బాయి : నా ప్రేమ ఎలా చెప్పాలో తెలీక ఇదవుతుంటే
అబ్బాయి :ఏడుపు వస్తోంది...
అబ్బాయి : కానీ నేను ఏడ్చి.. నా శోకం నిన్ను కూడా బాధ పెడుతుంది అనుకున్నపుడు
అబ్బాయి : వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది.
అబ్బాయి : మనుషులు అర్ధం చేసుకునేందుకు ఇది మాములు ప్రేమ కాదు..
అబ్బాయి : అగ్ని లాగ స్వచ్చమైనది...
గుండెల్లో గాయమేమో చల్లంగా మానిపోయే,
మాయ చేసే ఆ మాయే ప్రేమాయే.....
ఎంత గాయమైన గాని నా మేనికేమిగాదు,
పువ్వు సోకి నీ సోకు కన్దేనే...
వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధార లోన కరుగుతున్నది....
నాడు సోకమోపలేక నీ గుండె బాధ పడితే తాళనన్నది...
మనుషులేరుగా లేరు,
మామూలు ప్రేమ కాదు,
అగ్ని కంటే స్వచ్చమైనది...
మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా...
ఉమాదేవి గా శివుని అర్ధ భాగమై నా లోన నిలువుమా..
సుభ లాలీ లాలి జో
లాలి లాలి జో...
ఉమా దేవి లాలి జో..
లాలీ లాలి జో
మమకారమే....ఈ లాలి పాట గా
రాసేది హృదయమా....
నా హృదయమా.....

17, నవంబర్ 2010, బుధవారం
16, నవంబర్ 2010, మంగళవారం
ఎవరో ఒకరు...ఎపుడో అపుడు
అంకురం లోని ఈ ఆణిముత్యం లాంటి పాటలో ప్రతి ఒక్కరికి ఎంతో కొంత స్పూర్తిని, ఓ క్షణం ఐనా సమాజం గురించి ఆలోచించేటట్లు చేసే ఈ పాట చాలా చాలా ఇష్టం. ఈ సినిమా కుడా చాలా బాగుంటుంది. ఓ మహిళ న్యాయం కోసం, నమ్మిన నిజం కోసం చేసే పోరాటమే...అంకురం. రేవతి నటన అద్భుతం. సీతారామశాస్త్రి గారి కలం నుంచి జాలువారిన మరో అద్భుతమైన పాట. హంసలేఖ స్వరపరచిన ఈ స్వర మధురం అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ మధురమైన ఆణిముత్యమే.....
ఎవరో ఒకరు...ఎపుడో అపుడు
ఎవరో ఒకరు....ఎపుడో అపుడు
నడవరా ముందుగా..అటో ఇటో ఎటో వైపు....!
అటో ఇటో ఎటో వైపు...
ఆఆ.ఆఆ...మొదటి వాడు ఎప్పుడు ఒక్కడే మరి
మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరి
వెనుకవచ్చు వాళ్ళకు బాట అయినది
ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు..అటో ఇటో ఎటో వైపు...
కదలరు ఎవ్వరు వేకువ వచ్చినా...
అనుకుని కోడి కూత నిదరపోదుగా...
జగతికి మేలుకొల్పు మానుకోదుగా
మొదటి చినుకు సూటిగా దూకి రానిదే
మబ్బు కొంగు చాటుగా ఒదిగి దాగితే
వాన ధార రాదుగా నెల దారికి
ప్రాణమంటూ లేదుగా బ్రతకడానికి
ఎవరో ఒకరు...ఎపుడో అపుడు
ఎవరో ఒకరు....ఎపుడో అపుడు
నడవరా ముందుగా..అటో ఇటో ఎటో వైపు....!
అటో ఇటో ఎటో వైపు...
చెదరక పోదుగా చిక్కని చీకటి
మిణుగురు రెక్క చాటు చిన్ని కాంతికి
దానికి లెక్క లేదు కాల రాతిరి
పెదవి ప్రమిద నిలపని నవ్వు జ్యోతిని
రెప్ప వెనక ఆపని కాంతి నీటిని
సాగలేక ఆగితే దారి తరుగునా..
జాలి చూపి తీరమే దరికి చేరునా
ఎవరో ఒకరు...ఎపుడో అపుడు
ఎవరో ఒకరు....ఎపుడో అపుడు
నడవరా ముందుగా..అటో ఇటో ఎటో వైపు....!
అటో ఇటో ఎటో వైపు...
యుగములు సాగిన నింగిని తాకక..
ఎగసిన అలల ఆశ అలిసిపోదుగా..
ఒటమి ఒప్పుకుంటూ ఆగిపోదుగా
ఎంత వేడి ఎండతో ఒళ్ళు మండితే
అంత వాడి ఆవిరై వెళ్లి చేరదా
అంత గొప్ప సూర్యుడు కళ్ళు మూయడా
నల్ల మబ్బు కమ్మితే చల్ల బారడా

నీతో నువ్వు నిజాయితీ గా వుండు
అప్పుడప్పుడు అనిపిస్తూ వుంటుంది కొంతమందిని చూస్తూ వుంటే....ఎప్పుడూ నటిస్తూనే వుంటే మనతోనే కాకుండా వాళ్ళతో వాళ్ళు కుడా నటిస్తూనే వుంటారేమో అని. నటనే నిజమనే భ్రమలోనే బతుకుతున్నారేమో అని. పోనీ అందరితో గొడవలు ఎందుకులే సర్దుకు పోయే మనస్తత్వమా అంటే అదీ కాదు. ఎక్కడి మాటలు అక్కడ చెప్పి పబ్బం గడుపునే నైజం అని అనిపిస్తోంది..తప్పుని ధైర్యం గా తప్పు అని చెప్తే అదీ తప్పే ఇలాంటి వాళ్ళ దృష్టిలో. అందరికి చెప్తారు "వాళ్ళతో చాలా జాగ్రత్తగా మాట్లాడండి, మోహమాటం లేకుండా మాట మోఖానే అడుగుతారు". దూరంగా వుండండి అని ఇలా చాలా జాగ్రత్తలు చెప్తారు. మరి వీళ్ళు మాత్రం అందరితో బానే నటిస్తారు. ఇంట్లోను, బయట కుడా నటించాల్సి రావడమంత దురదృష్టం మరోటి లేదు. పాపం వాళ్ళు అనుకుంటారు అబ్బో మనకు అందరి దగ్గర చాలా మంచివాళ్ళమని పేరు వుంది అని, కాని నటిస్తే ఎన్ని రోజులు నిజాన్ని దాచగలం చెప్పండి? ఏదో ఒక రోజు బయట పడక తప్పదు కదా! ఒక్కో సారి చెప్పాలనిపిస్తుంది "కనీసం రోజులో ఓ క్షణం ఐనా నీతో నువ్వు నిజాయితీ గా వుండు" అని.
మనకు నచ్చినట్లు మనం వుంటే అది నచ్చిన వాళ్ళే మనకు దగ్గరగా వస్తారు. ఇష్టం లేని వాళ్ళు మనతో ఇష్టం వున్నట్లు నటిస్తే మనకు ఒరిగేదేం లేదు కదా!! ఎవరికైనా కోపం వస్తే తిట్టుకోకండి....-:)
మనకు నచ్చినట్లు మనం వుంటే అది నచ్చిన వాళ్ళే మనకు దగ్గరగా వస్తారు. ఇష్టం లేని వాళ్ళు మనతో ఇష్టం వున్నట్లు నటిస్తే మనకు ఒరిగేదేం లేదు కదా!! ఎవరికైనా కోపం వస్తే తిట్టుకోకండి....-:)
వర్గము
కబుర్లు
15, నవంబర్ 2010, సోమవారం
ఈ నాటి పిల్లలు కాదు కాదు పిడుగులు
నిన్న ఇంట్లో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పాలి మీకు...
నిన్న రాత్రి ఏడు ఎనిమిది మద్యలో ఇంట్లో అందరం టి.వి చూస్తూ వున్నాము. మా చిన్నాడు సౌర్య కి రెండు రోజుల నుంచి గుర్తు రాని హోంవర్క్ చెయ్యాలని అప్పుడే గుర్తు వచ్చి పుస్తకాలు ముందేసుకుని డైరి లో చూసి... అమ్మా చెప్పు ఏమి చెయ్యాలో అంటే డైరీ లో చుస్తే నాకు అర్ధం కాలేదు వాడు రాసిన Q1,2 ని క్విజ్ గా అనుకుని చెప్పాను. అందరికి చూపించాడు ఓ పది, పదిహేను నిముషాల సేపు. మాకు ఎవరికీ సరిగా అర్ధం కాలేదు. పెద్దవాడు మౌర్య ని చూడరా వాడి డైరి లో ఏమి రాసారో అంటే వాడు రాసింది నాకేం తెలుస్తుంది అన్నాడు. ఈ లోపల సౌర్య నాకు చేతికి పాడ్ ఇస్తే పట్టుకున్నాను, బుక్స్ తీసుకుంటాడేమో రాసుకోవడానికి అనుకుంటుంటే ఇంగ్లిష్ బుక్ ఇచ్చి రాసిపెట్టు ఒక్కటే అమ్మా అంటే సరే అని మొదలు పెడితే వాడి రాత కొన్ని అర్ధం కాలేదు చెప్పరా అంటే "నువ్వు ఫస్ట్ క్లాసు ఎలా చదివావు?" అన్ని నన్ను అడుగుతున్నాడు. వాడు చదివి మళ్ళి దానికి మీనింగ్ చెప్పి ఇది కుడా రాకుండా ఎలా చదివావు? అని అనడం ఇంట్లో అందరు వాడి మాటలకు నవ్వడం. ఇలా మొత్తం హోంవర్క్ అంతా నాతోనే చేయించాడు. ఇంతకు ముందు ఓసారి కుడా ఇలానే అప్పుడు తెలుగు. ఓ బుక్ ఇచ్చి అమ్మా "అ" ఎలా రాస్తావో రాయి అంటే రాసాను వెంటనే వాడు కుడా రాసి నేను ఇలా రాస్తాను నేను రాసినట్లు నాకు హోంవర్క్ లో రాయి అని బుక్ ఇచ్చి రాయిన్చుకున్నాడు. ఇలా ఉన్నారండి ఈ రోజుల్లో పిల్లలు కాదు కాదు పిడుగులు.

12, నవంబర్ 2010, శుక్రవారం
కార్తీకం సందడి...
కార్తీక మాసం అంటేనే ముందుగా గుర్తు వచ్చేది తెల్లవారుఝామున రేవులోనో, కాలువల్లోనో, ఏటిలోనో చేసే స్నానాలు, కార్తీక సోమవారం, పౌర్ణమికి వుండే ఉపవాసాలు, శివాలయంలో వెలిగించే తాతయ్య, అమ్మమ్మ చేసిన మూడువందల అరవైఐదు వత్తులు...పూజ ఐపోయి ఇంటికి వచ్చి పీట మీద పసుపు, కుంకం,పిండి తో ముగ్గులు వేసి గౌరీ దేవిని చేసి పూజ చేయడం, పులిహోర,పాయసం,నేతిబీరకాయ పచ్చడి, చలిమిడి, వడపప్పు, కొబ్బరి ముక్కల ప్రసాదాలు, నైవేద్యం పెట్టి తొందరగా చంద్రుడు వస్తే బావుండు బాగా ఆకలి వేస్తోంది అని పున్నమి చంద్రుని కోసం ఎదురు చూడటం, చుట్టుపక్కల వాళ్ళు అందరు కలిసి పెద్దఉసిరి చెట్టు వున్న ఇంటి దగ్గర పూజ, భోజనం చేయడం, దీపావళికి కాల్చగా తాతయ్య దాచిన కొన్ని టపాకాయలు, కాకరపువ్వొత్తులు, చిచ్చుబుడ్లు కాల్చడం...ఇలా ఎన్నో మధురమైన జ్ఞాపకాలు చుట్టుముడుతున్నాయి కదు....!!
నాకైతే ముందుగా గుర్తు వచ్చేది స్కూలు పెట్టగానే అడిగిన మొదటి మాట వన భోజనాలు ఎప్పుడూ? అని. భలే ఇష్టంగా వుండేది. అందరు తలొక వంటకం చేసుకు వస్తామని పంచుకోవడం, పులిహోర,పాయసం, లడ్లు, కారప్పూస, సాంబారు, పచ్చళ్ళు, ఉసిరికాయలు, చిన్న చిన్న మామిడి పిందెలు కొన్ని, వాక్కాయలు, జామకాయలు ఇలా ఎన్నో...కాని ఏమాటకామాటే చెప్పుకోవాలి పులిహోర, సాంబారు భలే రుచిగా ఉండేవి....మీకు నోరూరుతోందా ఐతే మరెందుకాలస్యం తొందరగా వనభోజనాలకు రడి ఐపోండి మరి.
ఇక ఆటలైతే సీతారాముడు, కోతికోమ్మచి, మోనో యాక్షన్ అదేనండి చిట్టి తీసి ఎవరి కి ఏది వస్తే అది చేసి చూపించాలి, ఇంకా పాటలు భలే బావుడేది ఆ రోజు.

11, నవంబర్ 2010, గురువారం
చల్ల చల్లని ...కూల్ కూల్ గా...చలిలో....
అబ్బో అప్పుడే చలి చంపేస్తోంది ఇక్కడ. అదేనండి బాబూ ఇంట్లోను, ఆఫీసులోను. అదేంటి ఆఫీసులో కూడానా అనుకుంటున్నారా!! ఆ విషయానికే వస్తున్నా, ఆగండి మరీ అంత తొందరైతే ఎలా!! మాది అదేనండి ఆఫీసు బానే పెద్దగా వుంటుంది. కాబిన్లో మూడు ఏ.సి లు వుంటాయి, కాని అక్కడే ఇబ్బంది వచ్చి పడింది. మద్యలో వాళ్లకు బాగా చల్లగా కావాలి అంటే అందరికి కాదు ఒక్కళ్ళకి మాత్రమే బాగా చల్లగా కావాలి. మళ్ళి ఏ.సి కి దగ్గర గా కూర్చోరు వారు. వాళ్ళది మాత్రం 23/24 పెట్టి మిగిలినవి అన్ని 16 /20 మద్యలో పెడితే ఎలా వుంటుంది చెప్పండి!!
నిజంగానే కొంత మందికి ఎక్కువ గా చల్లదనం కావాలి, కాని కొంత మంది అస్సలు భలే చేస్తారు చల్లదనం పడదు అంటారు కాని తెలివిగా అటు ఇటు వెళ్ళినట్లు వెళ్లి ఏ.సి ఆన్ చేసి ఏమి తెలియనట్లు యాక్షన్ చేస్తారు. చల్లగా వుండాలి కాని అందరిని ఇబ్బంది పెట్టేటట్లు ఉండకూడదు కదా!! మరి ఈ నటనాగ్రేసరులు ఇంటికి వెళ్లి ఏం చేస్తారో తెలియదు అంటే ఇంట్లో ఏ.సి వుండదు కదా!! అసలే చలి కాలం మళ్ళి ఈ ఏ.సి గొడవొకటి మా ప్రాణాలకు...ఏంటో ఈ ఏ.సి గోల..... !!-:)

10, నవంబర్ 2010, బుధవారం
గుర్తున్నానా??
ఎప్పుడో చిన్నప్పుడు ఐదు, ఆరు ఏళ్ళు కలిసి చదువుకున్న అప్పటి వాళ్ళు చాలా వరకు నాకు గుర్తు వున్నారు. వాళ్ళు నాకు గుర్తు వుండటం కాదు ఇక్కడ విష్యం నేను కుడా అందరికి గుర్తున్నాను. ఈ మద్యన చాలా మంది చిన్నప్పటి స్నేహితులు కలిసారు. కొంతమందితో ఫోన్ లో మాట్లాడాను, కొంత మందిని కలిసాను. రెండు నుంచి ఆరు వరకు మాత్రమే వాళ్ళతో కలిసి చదివింది. ఐనా టీచర్స్ కి కుడా గుర్తు వుండటం ఎందుకో తెలియదు కాని బావుంది.
చాలా రోజుల క్రిందట పేపర్ లో హెల్త్ బాలేదు సాయం చేయమని చూసి నాకు తోచిన డబ్బులు పంపితే అది వార్త పేపర్ లో వచ్చింది. అది చూసి నా ఇంటి పేరుతో కూడా నన్ను గుర్తు ఉంచుకున్న నా చిన్నప్పటి నేస్తాలను ఈ మద్యనే గుర్తున్నానా అని పలకరిస్తే ఆ పేపర్లో సంగతి చెప్పి మర్చిపోయామా!! అంటే భలే అనిపించింది. ఇంకొకళ్ళని ఇంకా గుర్తున్నానా అంటే నీ మెయిల్ ఐడి కోసం ఎప్పటినుంచో వెదుకుతున్నా ఇప్పటికి దొరికావు అన్నారు... ఈ వేసవిలో అప్పటి స్కూల్లో అందరమూ కలుద్దామనుకుంటున్నాము. చూడాలి మరి ఎంత వరకు వీలవుతుందో.

9, నవంబర్ 2010, మంగళవారం
ప్రియతమా నా హృదయమా
అజరామరమైన గీతాలలో బాలు చిత్ర ల గాన మాధుర్యానికి ఇది ఒక మచ్చు తునక. వేటూరి కలం నుంచి జాలువారిన అద్భుతమైన మధుర గీతాలలో మరపు రాని ఆణిముత్యం. ఇళయరాజా స్వర కల్పనలో అద్భుత సృష్టి.
తన ప్రాణంలో ప్రాణమైన ప్రియురాలు చనిపోతుందని తెలిసి తనని గొప్ప వ్యక్తి గా చూడాలనుకుంటోందని తన మనసునే కానుకగా చేసి ఆ ప్రేమికుడిచ్చిన వెల కట్టలేని ప్రేమ కానుక ఇదిగో....మీకోసం....!!!
*******
ప్రియతమా నా హృదయమా
ప్రియతమా నా హృదయమా
ప్రేమకే ప్రతి రూపమా
ప్రేమకే ప్రతి రూపమా
నా గుండెలో నిండినా గానమా
నను మనిషిగా చేసిన త్యాగమా ...... [ప్రియతమా]
శిలలాంటి నాకు జీవాన్ని పోసి
కల లాంటి బ్రతుకు కలతోటి నింపి
వలపన్న తీపి తోలి సారి చూపి
ఎద లోని సెగలు అడుగంట మాపి
నులివేచ్చనైన ఓదార్పు నీవై
శృతి లయ లాగా జత చేరినావు
నువులేని నన్ను ఊహించలేను నా వేదనంతా నివేదిన్చలేను
అమరం......అఖిలం.....మన ప్రేమా ...... [ప్రియతమా]
లా లాల లా ల ల ..
ల లా ల ల ల ల లా ల లా...
లా ల లా ల..
ల ల ల లా లా....
నీ పెదవి పైనా వెలుగారనీకు,
నీ కనులలోనా తడి చేరనీకు...
నీ కన్నీటి చుక్కే,మున్నీరు నాకు
అది వెల్లువల్లే నను ముంచనీకు...
ఏ కారు మబ్బు ఎటు కమ్ముకున్నా,
మహా సాగరాలే నిను మింగుతున్నా,
ఈ జన్మ లోనా ఎడబాటులేదు...
పది జన్మలైనా ముడేవీడిపోదు..

3, నవంబర్ 2010, బుధవారం
కలల్లో తేలిపోతున్నా.....
కలల్లో తేలి పోవడమన్నా, భ్రమల్లో బతకడమన్నా కొంత మందికి చాలా ఇష్టం. ఎంత అంటే ఆ భ్రమలే వాస్తవం అనుకొని బతికేస్తున్నారు. తన చుట్టూ అందరు తనని చూసి నవ్వుతున్నా...నన్ను చూసి కాదులే అని సరిపెట్టుకుంటున్నారు.
కనపడిన ప్రతి అమ్మాయి తనని ఇష్టపడుతోందని, సిగ్గుతో పక్క వాళ్ళ దగ్గర మెలికలు తిరుగుతూ వాగడం, పెద్ద పెద్ద సంస్థలలో గొప్ప గొప్ప ఉద్యోగాలన్నీ తనకే పిలిచి ఇస్తున్నట్లు చెప్పడం, తన పైఅధికారులు తిట్టినా నా అంత పనితనమున్న వాడు మూడు లోకాల్లో వెదికినా దొరకడన్నారు...అస్సలు నేను ఇక్కడ వుండటం మీరు చేసుకున్న అదృష్టం అంటూ... ఇలా ఒకటేమిటి చెప్పుకుంటూ పొతే చాట భారతమే అవుతుంది, చదివేవాళ్ళు నన్ను తిట్టుకుంటారు.
తనని చుస్తే చాలు అందరు తప్పుకుని వెళ్లి పోతారు, టైము బాలేని మాలాంటి వాళ్ళం దొరికి పోతూ ఉంటాము. ఏం చేయాలో తెలియక ఇలా నా బాధల గాధలు వెళ్లగక్కుతూ వుంటాను అప్పుడప్పుడు...విని(చదివి) తరించండి భరించండి....-:)

2, నవంబర్ 2010, మంగళవారం
సడిచేయకో గాలి.....
రాజమకుటం లోని ఈ పాట పి. లీల గారి గళం నుంచి జాలువారిన ఆణిముత్యాలలోని ఓ మరపు రాని అద్భుతమైన పాట. మాస్టర్ వేణు గారు సంగీతమందించిన అందరి మనసులు దోచిన పాట. అప్పటికి ఇప్పటికి ఎప్పటికి నిలిచి వుండే మధుర గీతాలలో నాకిష్టమైన ఈ పాట మీకోసం......"బడలిక ఒడిలో అలసి సేదదీరుతున్న రారాజుకి లాలి పాట... "
చూడాలంటే ఈ లింక్ నొక్కండి
సడిచేయకో గాలి సడిచేయబోకే
సడిచేయకో గాలి సడిచేయబోకే
బడలి ఒడిలో రాజు పవళించేనే * సడిచేయకో గాలి *
రత్న పీఠిక లేని రారాజు నా స్వామి
మణి కిరీటం లేని మహారాజు గాకేమి
చిలిపి పరుగున మాని కొలిచి పోరాదే * సడిచేయకో గాలి *
ఏటి గలగలలకే ఎగసి లేచేనే
ఆకు కదలికలకేలే అదరి చూసేనే
నిదుర చెదరిందంటే నేనూరుకోనే * సడిచేయకో గాలి *
పండు వెన్నెలలడిగి పానుపు తేరాదే
నీడ మబ్బుల దాగు నిదుర తేరాదే
విరుల వీవను పూని విసిరి పోరాదే * సడిచేయకో గాలి *
చూడాలంటే ఈ లింక్ నొక్కండి
http://www.youtube.com/watch?v=ljBKuXCKl1s
సడిచేయకో గాలి సడిచేయబోకే
సడిచేయకో గాలి సడిచేయబోకే
బడలి ఒడిలో రాజు పవళించేనే * సడిచేయకో గాలి *
రత్న పీఠిక లేని రారాజు నా స్వామి
మణి కిరీటం లేని మహారాజు గాకేమి
చిలిపి పరుగున మాని కొలిచి పోరాదే * సడిచేయకో గాలి *
ఏటి గలగలలకే ఎగసి లేచేనే
ఆకు కదలికలకేలే అదరి చూసేనే
నిదుర చెదరిందంటే నేనూరుకోనే * సడిచేయకో గాలి *
పండు వెన్నెలలడిగి పానుపు తేరాదే
నీడ మబ్బుల దాగు నిదుర తేరాదే
విరుల వీవను పూని విసిరి పోరాదే * సడిచేయకో గాలి *
వర్గము
పాటలు
1, నవంబర్ 2010, సోమవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)