21, నవంబర్ 2010, ఆదివారం

బ్లాగ్ వనభోజనాల స్పెవల్ - సొరకాయ కోఫ్తా

సొరకాయ కోఫ్తా కి ఏమి కావాలో ముందుగా చెప్తాను అందరూ వింటున్నారా!!( చదువుతున్నారా!!) అయితే సరే!!
కొద్దిగా లేత సొరకాయ, కూరకి సరిపడినంత మంచినూనె, కొద్దిగా కారం, సరిపడినంత ఉప్పు, చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద కొద్దిగా కొద్దిగా గరం మసాలా, సెనగపిండి కోఫ్తాలకు సరిపడినంత ఇంకా కొత్తిమిర, కరివేపాకు, చాలా కొంచం చింతపండు, ఉల్లిపాయముక్కలు, కొన్ని పర్చిమిరపకాయ ముక్కలు సన్నగా తరిగినవి, టమాట ముక్కలు కుడా బాగా చిన్నగా తగిగినవి... తాలింపుదినుసులు, జీడిపప్పు పొడి కొంచం గుర్తు ఉన్నంత వరకు ఇవేనండి
ఇక కూర చేయడం ఎలా??
ముందుగా సోరకాయను పైపెచ్చు(తోలు) తీసి కొబ్బరి తగినట్లుగా సొరకాయ కోరు తీసి పెట్టుకోవాలి. ఒక పళ్ళెం లో కాని లేదా చిల్లుల ప్లేట్ లో కాని కొద్ది సేపు ఉంచితే సొరకాయ లోని నీరు బయటకు వచ్చేస్తుంది. ఒక్కసారి బాగా పిండితే మిగిలిన నీరు ఏమైనా వుంటే అది కుడా వచ్చేస్తుంది. అప్పుడు దీనిలో ఉప్పు, కారం, పసుపు, అల్లంవెల్లుల్లి ముద్ద, గరం మసాలా, కొద్దిగా జీలకర్ర, కోఫ్తాలకు సరిపడినంత సెనగపిండి వేసి బాగా కలుపు కోవాలి. ఇప్పుడు చిన్న చిన్న కోఫ్తాలుగా చేసుకుని పొయ్యి వెలిగించి, స్టౌవ్ మీద పాన్ పెట్టి పాన్లో నూనె ఎక్కువగా పోసి కోఫ్తాలను బాగా వేయించి తీసి పక్కన పెట్టుకుని, వేరే పాన్ స్టవ్ పై పెట్టి పాన్ లో కొద్దిగా నూనె వేసి తాలింపు పెట్టి పర్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయముక్కలు, టమాటో ముక్కలు, కరివేపాకు వేసి బాగా మగ్గిన తరువాత కొద్దిగా చింతపండు వేసి కొన్ని నీళ్ళు పోసి వుడకనివ్వాలి. కాస్త వుడికిన తరువాత వేయించి పక్కన పెట్టుకున్న సొరకాయ కోఫ్తాలు వేసి, జీడిపప్పుల పొడి చల్లి కొద్ది సేపు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక బౌల్ లోకి కూర తీసుకుని పైన కొత్తిమీర చల్లితే వనభోజనాలకి వడ్డించడానికి సొరకాయ కోఫ్తా కూర రడీ అయిపోయినట్లే.
మరి రుచి చూసి చెప్పండి ఎలా వుందో!!

15 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

వేణూశ్రీకాంత్ చెప్పారు...

బాగుందండి :-)

కృష్ణప్రియ చెప్పారు...

రెండు పెద్ద సొరకాయలున్నాయి మా ఇంట్లో.. ఐతే ట్రై చేస్తా ఇవ్వాళ్ళ

జయ చెప్పారు...

బాగుందండి సొరకాయ కూర.

swapna@kalalaprapancham చెప్పారు...

parcel cheyandahoooooooooo. Taste chusi cheptha :)

swapna@kalalaprapancham చెప్పారు...

BTW super ga undi chusthunte ika thinte ela untundo :)

నేస్తం చెప్పారు...

మా ఇంట్లో కూడా ఉన్నాయి నేనూ చేస్తా

లత చెప్పారు...

బాగుందండీ
చపాతీల్లోకి అప్పుడప్పుడు చేస్తాను నేను ఈ కూర.

sunita చెప్పారు...

Good looking and tempting too.

మాలా కుమార్ చెప్పారు...

సొరకాయ కోఫ్తా రాసేసారా ? గుడ్ . బాగుంది .

అజ్ఞాత చెప్పారు...

సొరకాయ అంటే నాకు ఇష్టం వుండదు.పిక్చర్ చూస్తుంటే నోరూరుతుంది.మీ రెసిపి ట్రై చేద్దామంటే చాలా లాంగ్ ప్రాసెస్ అనిపిస్తుంది.అందుకని ఈ సారి విజయవాడ వచ్చినప్పుడు మీ ఇంటికి వస్తాను.అప్పుడు సొరకాయ కోఫ్తా రుచి చూపించండి.

చెప్పాలంటే...... చెప్పారు...

నా వంటకం అందరికి నచ్చినందుకు బోల్డు ఆనందం అండి....థాంక్యు. ఇంటికి రండి వచ్చినప్పుడు తప్పకుండా చేసి పెడతాను లాంగ్ ప్రాసెస్ కాదు ఈజినె

ఇందు చెప్పారు...

నేను ఎప్పుడూ...సొరకాయ పులుసు,కూర,హల్వా మాత్రమె చేస్తను.ఇలా కోఫ్తా చెయడం..బాగుంది.నకు కొత్త వంట నేర్పారు :) ధన్యవాదలు..మీ ఫొటో చాల కలర్ ఫుల్ గా...చూడగానె తినాలనిపించెలా ఉంది :)

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్ యు ఇందు....

Unknown చెప్పారు...

wow......my mouth is watering............good curry and i will also try to make.........my kids like sorakaya variety curries.....

చెప్పాలంటే...... చెప్పారు...

చాలా బావుంటుంది ట్రై చేయండి.....పిల్లలు ఇష్టపడతారు

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner