10, జూన్ 2011, శుక్రవారం

అందని తీరాలలో....!!

అనుక్షణం కాలం పరుగెత్తి పోతూనే వుంది
నేను మాత్రం నువ్వు వదలి వెళ్ళిన చోటే ఉన్నాను....ఇప్పటికీ....
అందుకే నువ్వు నాతొ లేవు అన్న నిజం కుడా....
నాకు తెలియనంతగా నీతో మమేకమైన నేను....
నేనుగా లేక నువ్వు గానే మిగిలాను...
నీ జ్ఞాపకాలే ఊపిరిగా....నీ తలపులే ప్రాణవాయువులుగా...
నిరంతరం నను వెంటాడే నాలోని నువ్వే... నా శ్వాస!
నీతో వున్న ప్రతిక్షణమూ...పదిలమే నాకు....!!
దూరంగా ఉన్నా...చేరువుగా ఉన్నా... నా దగ్గరే నువ్వు.!!
కాని నువ్వు మాత్రం నాకు ఎప్పటికీ అందనంత దూరమే!!
భలే విచిత్రం కదూ...!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

vijay చెప్పారు...

"అందని తీరాలలో....!!" ముందు వ్రాసి ఆ తర్వాత "కల్పన నిజమైతే !!" ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. ఎందుకంటే ఆ రెండిటికి Continuity ఉన్నట్లుగా నాకనిపిస్తున్నది. మొత్తమ్మీద కవిత(లు) బావున్నాది(యి).

చెప్పాలంటే...... చెప్పారు...

ఏమో విజయ్ గారు అనిపించినట్లు అప్పటికి రాసాను థాంక్యు అండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner