పంచుకుంటున్నారు...!! ఓ విధంగా చూస్తే ఇది బానే ఉంది...కాకపొతే మన పని మనం చేసుకోకుండా ఎంతసేపూ ఎదుటివారి గురించి ఏదో రాబట్టాలనుకోవడం సంస్కారం కాదు...!!
మన ఇష్టాలని అభిప్రాయాలని అందరు ఇష్టపడాలని అనుకోవడం, మన ఆలోచనలు ఎదుటివారి మీద బలవంతంగా రుద్దాలని ప్రయత్నించడం సమంజసం కాదు...!! మన ఆలోచనలు అభిప్రాయాలు మనవి అంతే కాని ఎదుటివారికి మనలా ఉంటాయనుకుంటే అది తప్పు...!! ఏ ఇద్దరు ఒకేలా ఉండరు....ఒకే అమ్మ కడుపున పుట్టినా ..మన చేతికున్న ఐదు వేళ్ళలా....!!
ఇంటి సమస్యని అందరి సమస్యగా చేయకుండా మన వరకే పరిమితం చేసుకున్నట్టుగా మన అభిప్రాయాలను కూడా మనకే పరిమితం చేసుకుంటూ ఎదుటివారి ఆలోచనలను గౌరవించే సంస్కృతికి స్వాగతం పలుకుదాం...!! స్నేహాన్ని స్నేహంగానే ఉండనిచ్చి ఆ విలువను ఉన్నతంగానే ఉంచుదాం....!! విపరీత ధోరణులకు పోకుండా మనకున్న విలువలతో మన సంప్రదాయ ధోరణిలోనే ముందుకు సాగుదాం...వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలగకుండా...చక్కని బంధాలతో అనుబంధాలను నిర్మించుకుంటూ....!!