6, సెప్టెంబర్ 2013, శుక్రవారం

ఆ రోజు తొందరగా వస్తే ఎంత బావుండు...!!

బాధ్యతను పంచుకోని  బంధానికి ప్రశ్నించే హక్కు మాత్రం ఎక్కడిది...?? బంధాన్ని పంచుకోమంటే బరువుగా మారి,
మనసు ముక్కలు చేస్తే ఆ బంధాన్ని భరించడం అవసరమా...!! వేసిన తప్పటడుగు తప్పుటడుగుగా వెక్కిరిస్తుంటే ఏమి చేయలేని నిస్సహాయతను ఆసరాగా చేసుకోవాలా...!! ఇంకా ఇంకా అధఃపాతాళానికి కుంగి పోవాలా...!! నమ్మిన పాపానికి నమ్మకమే లేని జీవితాన్ని కానుకగా ఇచ్చి క్షణక్షణం భయాన్ని, బాధను తోడుగా ఉంచుకోమని చెప్తూ...బతుకే లేకుండా చేస్తుంటే...!! క్షమయా ధరిత్రి అన్న పేరు కోసం పాకులాడటం మనిషినే కాదు మనసునే  చంపుకోవడంతో సమానం...!!
ఒకరికి మన వేలు చూపించే ముందు మన నాలుగు వేళ్ళు మననే చూస్తూ ఉంటాయని మర్చి పోతున్నాము. అబద్దాలు చెప్పో, నలుగురిలో చాలా మానవతా వాదిని, మంచితనం నా చిరునామా అని నటిస్తే నాలుగు రోజులు పోయాకయినా మనమేంటో అన్నం తినే ఆ నలుగురికి తెలియదా...!! అహంకారంతో కళ్ళు మూసుకుపోయి నా అనుకున్న అనుబంధాలు అక్కరలేదు అనుకుంటే....సున్నా ముందు ఒకటి లేక పొతే సున్నా విలువ ఎంతో మన విలువా అంతే అని తెలిసే సరికి ఈ జీవితం ముగింపుకి వచ్చేస్తుంది.
మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుందని తెలిస్తే దానిని అడిగినా లేదా అది చెప్పేది విన్నా సరిపోతుంది....కనీసం మనం మన బాధ్యతలలో ఒక్కటి అయినా సక్రమంగా నిర్వర్తించామో లేదో...!! మనస్సాక్షి నోరు నొక్కేసి అహాన్ని ఇంటి పేరుగా చేసుకుంటే  రేపటి రోజున మన నటన బయటపడి మనకంటూ ఒక్కరు కూడా లేకుండా ఒంటరిగా మిగిలి పోవాలి. ఎదుటి వారికి మనం ఏది ఇస్తే అదే మనకి తిరిగి వస్తుంది....ప్రేమ అభిమానం ఇస్తే అంతకు రెట్టింపుగా దొరుకుతాయి....నన్నంటుకోకు నా మాల కాకి అంటే(క్షమించాలి )....మనం కూడా అలానే ఉండాలి...!! నమ్మి వచ్చిన బంధాన్ని నమ్మకంగా చూసుకోవాలి.... నలుగురిలో నవ్వులపాలు చేయాలని చూస్తే మనమే  నవ్వులపాలు అవుతామని తెలుసుకోవాలి. బెదిరింపులకు భయపడే రోజులు పోయి బయటకు పొమ్మనే రోజు రాకుండా చూసుకుంటే చాలు. ఎన్నాళ్ళైనా...ఎన్నేళ్ళయినా మన బుద్ది మారకపొతే మన అనుకున్న అనుబంధాలకు దూరం కావడానికి ఎంతో సమయం పట్టదు. మనకి మనం గొప్ప దివి నుంచి భువికి దిగి వచ్చాము అనుకుంటే సరి పోదు....నలుగురు చెప్పాలి కాని బాజా భజంత్రీలు వాయించే వాద్య బృందం చెప్తే అది నిజం కాదని తెలుసుకున్న రోజు మనని మనం తెలుసుకున్న రోజు....!! ఆ రోజు తొందరగా వస్తే ఎంత బావుండు...!!

4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Meraj Fathima చెప్పారు...

మంజూ, మీ పోస్ట్ మొత్తం చాలా ఆవేశంగా సాగిందమ్మా.., కొన్ని పచ్హి నిజాలను ఇలా ఎండగడితే ఎదుటివారి నాలుకలు ఎండిపోతాయి. అంతె గానీ అవి వాటి మాట తీరు మార్చుకోవు. మంజూ... మీకు మంచి ఆలోచనా పరిది ఉంది, వివేకం ఉంది, మీ అక్షరాలను సమాజానికి శుభ తో్రణాలుగా ్కట్టే ఆశయం ఉంది. అందుకే మీరు ఇక్నా ముందుకెళ్ళాలని దీవిస్తున్నా.

చెప్పాలంటే...... చెప్పారు...

మీ మనస్సులోని అభిమానానికి ధన్యురాలిని అక్కా....వేదన నుంచి వచ్చే ప్రతి మాటా నిజాలుగానే ఉంటాయి...ఒప్పుకోలేని జీవుల్ని ఏమి చేయలేము అలా అని నిజాలు కాకుండాను పోవు... మీ ఆశిస్సులకు నా నమస్సులు

అజ్ఞాత చెప్పారు...

Every word is true.

చెప్పాలంటే...... చెప్పారు...

Thank u so much Anu

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner