అంతర్మధనంలో అంతరాత్మని చంపి
అంతర్నేత్రంలో ఆత్మానందాన్ని దూరం చేసుకుని
నిర్వేదాన్ని నిర్విఘ్నంగా స్వాగతిస్తూ....
నిస్సార నిర్లక్ష్య జీవితానుభూతిని
పరమావధిగా పరమపద సోపానంగా తలుస్తూ
వాదనలో వేదనని కోరుకుంటూ....
బంధాలకు అందకుండా జరిగిపోతూ
బాధ్యతలకు భయపడి అనుబంధమే లేకుండా చేసుకుంటూ
అంటరానితనంతో అస్పృశ్యులుగా ఉంటూ...
అహంకారాన్ని ఆస్థిగా గర్వపడుతూ
అందరిలో నేను అన్న చట్రంలో ఒంటరిగా బతుకుతూ
అహాన్ని ఆనందమని భ్రమపడుతూ....
చిరునామా లేని చిరు నామమైపోతూ
గల్లంతై పోతూ కూడా గుండెల్లో ఉన్నా అనుకుంటూ
మభ్యపడుతూ మోసం చేస్తూ...
సహవాసానికి సమీపంలో లేకుండా
సహస్ర యోజనాల సుదూర తీరంలో గమ్యం లేని
ప్రయాణంలో ముందుకు పోయే....
జీవితానికి అర్ధం పరమార్ధం ఎక్కడో...!!
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
సుతి మెత్తంగా మొట్టారు ....
చాలా బాగుంది ...వినిపించిన నిర్వేదం ...
ధన్యవాదాలు సాగర్ గారు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి