31, జనవరి 2015, శనివారం

నిన్నటి పోస్ట్ కి ముక్తాయింపు...!!

నిన్న నేను రాసిన ఒక చిన్న అనుమానం పోస్ట్ కి అందిన స్పందనలకు హృదయపూర్వక ధన్యవాదాలు... చాలా మంది నేను మహర్షులను, దేవుళ్ళను ఏదో అన్నానని అనుకున్నారు... అక్కడ నా ఉద్దేశ్యం ఎంతో గొప్ప
తపస్సంపన్నులు, అన్ని తెలిసిన దైవాలు కూడా అరి షడ్వర్గాలకు ఎక్కడో ఒక చోట లొంగి పోయారు అని... అది లోక కల్యాణానికి కావచ్చు లేదా మరే ఇతర కారణానికైనా కావచ్చు.... అది చెప్తూ మనలో చాలా మంది చేసే పని గురించి చెప్పాను... నీతులు చెప్పడానికే కాని పాటించడానికి కాదని.... మనలో ఎంత మందికి తప్పు చేసినా దాన్ని ఒప్పుకునే ధైర్యం ఉంది...? కోపతాపాలు వారికే తప్పనప్పుడు వారి చేతిలో ఊపిరి పోసుకున్న మనమెంత అని అన్నాను... కొంత మంది చెప్పారు తమ స్పందనలో ఎదుటివారి అహాన్ని, అజ్ఞానాన్ని పోగొట్టడానికి అని... దానికి ఈ కోపతాపాలకు లొంగనవసరం లేదు కదా... ఏదైనా మాటను ఎదుటివారికి చెప్పే ముందు దాన్ని ఆచరించే అతి కొద్ది మందిలో వివేకానందుడు, మహాత్మా గాంధి గారు చెప్పుకోదగ్గ మహానుభావులు...
అసలు విషయం ఏంటంటే .. చాలా మంది విపరీతంగా పూజలు చేస్తూ... వారి స్వార్ధం కోసం దేనికైనా వెనుకాడరు... అలానే నీతులు చెప్పే పెద్ద మనుష్యులు... ఇలాంటి వారిని చూసి చూసి కాస్త...  కాస్త ఏమిటి బోలెడు కోపం వచ్చి .... నిన్న ఆ పోస్ట్ రాశాను... అంతే కాని దైవాన్ని మహర్షులను తప్పు పట్టడానికి కాదు... ఏదో చిన్న అనుమానం వారు కూడా ఇలా కోపాన్ని ఎందుకు తట్టుకోలేక పోయారు... వారికి నిగ్రహ శక్తి ఉంటుంది కదా అని....
నేను  చిన్నతనం నుంచి అన్ని రకాల పుస్తకాలు చదివాను... కాకపొతే ఎక్కువగా వాస్తవానికి అన్వయిస్తూ చూస్తాను... నా చుట్టూ ఉన్న పరిస్థితులకు బేరీజు వేస్తూ ఇలా అప్పుడప్పుడు నా అనుమానాలను బయటికి చెప్తూ కాస్త నా అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను... అంతే కాని ఎవరి నమ్మకాలను ప్రశ్నించడానికి కాదు.. మన చుట్టూ అందరు ఉన్నా మనకు నచ్చినట్టుగానే మనం ఉంటాము... మంచి చెడు అందరిలో ఉంటాయి... సాధ్యమైనంత వరకు ఎదుటివారికి సాయం చేయక పోయినా పర్వాలేదు కాని హాని మాత్రం చేయకూడదనే మనస్తత్వం నాది.. తప్పుని చూస్తూ మనకెందుకులే అని ఊరుకోలేను... దయచేసి ఎవరు అన్యధా భావించకండి ఈ పోస్ట్ ని.. ఎవరి మనసునైనా నొప్పిస్తే క్షంతవ్యురాలిని...

30, జనవరి 2015, శుక్రవారం

ఏక్ తారలు...!!

30/1/15
1. మరణమే లేని ప్రేమకు_నీ రూపు దూరమౌనా
2. వెన్నెలంతా నాతోనే ఉంది_నువ్వింకేం తీసుకు వస్తావు
3. వాకిలి తీసే ఉంది_ఆ తట పటాయింపెందుకు
4. స్వరాలకు అందినవి_నా అక్షర భావాలేనేమో
5. గుప్పెడు గుండెలో_ఉప్పెనై చేరింది నీ ప్రేమ
6. మాయలు నేర్చింది_మోహంలో ముంచేస్తూ
7. అక్షర సుమాల అర్దింపు_ప్రేమను సైతం పరిమళింప చేస్తూ
8. అపార్ధపు ఆనవాళ్ళే_అనర్ధాలకు తెర తీస్తూ
9. ధరణి పుత్రే దరిజేరే_పసిడి పితాంబరాలెందుకు కోదండపాణికి
10. పారిజాతమే దివి నుంచి భువికి వచ్చె_సత్య అలుకని దీర్చ కన్నయ్య వెంట
11. చుక్కల సందడితో_గగనమంతా నవ్వులే
12. అతిశయమూ అలంకారమే_మది బాసలు పలికించే కనులకు
13. వన్నెలన్ని చిన్నబుచ్చుకున్నాయి_వెన్నెల సంతకాలు చేయలేదని
14. వెన్నెల దోచుకుంది మౌనాన్ని_నీ క్రీగంటి చూపుల భాషను తెలిపి
15. ఎన్ని అలుకలు నేర్వాలో_నీ మనసును గెలిచేందుకు
16. రేపటికి రాలిపోయే గులాబీల మాలలా_మది మెచ్చిన మనసుకి
17. ప్రతి పలకరింపు చేరదు_మనసు ముంగిలికి
18. నువ్వు దూరమౌతావని_నిదురనే పొమ్మన్నా
19. ఆ నమ్మకమే_ఎక్కడికి పోయిందో మరి

నాకో చిన్న అనుమానం....!!

ఎప్పటినుంచో నాకో చిన్న అనుమానం అలానే మిగిలిపోయింది.... మన పురాణ ఇతిహాసాల్లో ఎందరో తాపసులు ఉన్నారు.... మరెందరో దైవాలు ఉన్నారు.... ఆ కథలు చదువుతున్నప్పుడు...  బాగా కోపం ఉన్న మహర్షి దుర్వాసుడు అని అందరికి తెలుసు... త్రిమూర్తులను కూడా శపించారు... వశిష్టుడు, గౌతముడు, పరశురాముడు ...ఇలా చెప్పుకుంటూ పొతే చాలా మంది ఉన్నారు... ఎంతో తపస్సు చేసిన మహర్షులు కదా... అయినా కోపానికి బానిసలుగానే ఉండిపోయారెందుకో... దక్షుడు మొదలైన వారేమో అహానికి బానిసలు... కోపం వస్తే పరమశివుడు ఫాల నేత్రాన్ని తెరచి భస్మం చేస్తాడు... త్రిమూర్తులు కోపతాపాలకు దాసులే... అరిషడ్వర్గాలను దైవాలు, మహర్షులే వదలలేక పొతే ఇక సామాన్యులం మన సంగతి ఏమిటి...?
కోపగించుకోకండి... మనలో చాలా మంది పూజలు చేస్తూ ఉంటారు... దైవ ప్రవచనాలు చెప్తూ... వింటూ ఉంటారు.. కాని వారిలో ఎంత మంది ఆచరించి చెప్తున్నారు... మనం చేసే ప్రతి కర్మకు దైవాన్ని బలి చేస్తూ మనం మాత్రం సంతోషంగా ఉండాలనుకోవడం ఎంత వరకు సబబు..? పూజ చేసిన కాసేపు కూడా మన మనసుని నియంత్రించుకోలేక పోతున్నాము... కొందరు అయ్యప్ప మాల వేసుకుంటారు... ఆ మండలం రోజులు ఏదో చేశామనిపించి దర్శనానికి వెళ్లి వచ్చాక మళ్ళి అన్ని మామూలే... మరి కొందరేమో మన పెద్దలు చెప్పిన చందాన చేసేవి శివ పూజలు .. దూరేవి .... అన్నట్టుగా ఉన్నారు... ఒక్కోసారి జనాలు వల్లించే నీతి వాక్యాలకు... వారు చేసే పనులకు పొంతన లేక నాకైతే చాలా కోపం వస్తుంది.... కాని ఏమి చేయలేం నలుగురితో మనమూ అన్నట్టు బతికేయడమే... ఈ లోకం తీరు ఇంతే అని సరిపెట్టుకోవడమే... నీతులు ఎదుటివారికి చెప్పడానికే కాని మనం ఆచరించడానికి కాదని అర్ధం చేసుకోవాలన్న మాట -:).  దేవుళ్లకే తప్పని అరిషడ్వర్గాల ముందు మనమెంత అని తలను వంచేసుకోవడమే...!!

ఏక్ తారలు....!!

29/1/15
1. అంబరాన్ని తాకానన్న మాయలో_నిన్ను నువ్వు మర్చిపోతే ఎలా
2. తలపుల పరిమళం సోకి_మనసు పురి విప్పిందనుకుంటా మయురంలా
3. నెరజాణ సొగసులన్నీ_ప్రేమ పలవరింతల కోసమే
4. తేలికగా వదిలించుకునే బంధనాలేమో_వలపు చిలక జారిపోవడానికి
5. ప్రేమ ఆరాధన పక్క పక్కనే_నీ కోసం ఎదురు చూస్తూ
6. వెన్నెల్లో ఆడపిల్లనే_అమాసకి మాయమౌతూ
7.  ఎదలోని జ్ఞాపకాలు_అక్షరాల్లో చిద్విలాసంగా
 8. ఏటి గట్టు ఎలాతెలా బోతోంది_యాడ నీ జాడ ఎన్నెలంటి నా ఎంకి
9. గుండె గొంతు విప్పింది_నీ కవనాలకు నీరాజనాలందిస్తూ
10. ఇరువురి భామల మధ్యన_మింగలేక కక్కలేక నీలకంఠుడు
11. నెలరేడుకి కోరికేమో_ఆ ఒక్క రోజైనా తనలో దాచుకుందామని
12. హరతికి వెలుగెక్కువైంది_కళ్ళు నీళ్ళు కమ్మి అక్షరాలు కనిపించక
13. అలరించే ప్రేమ ఆశ పెడుతోంది_ఆరాధనకు సొంతం కమ్మంటూ
14. నీ మనసు జాడే తెలియకున్నది_ఇక నన్నెలా వెదకను
15. నిన్ను నే తలచుకుంటున్నా_నా రేపటి స్వప్నంగా
16. అద్దంలో నీ రూపే_భావాలను వెదజల్లుతూ
17. ఎదలో మౌన సమీరాలు_నిలువెల్లా చుట్టేస్తుంటే
18. బుగ్గల్లో సిగ్గునే_రేయికి స్వాగతమిస్తూ
19. జీవితాన్నే నీకర్పించా_ప్రేమారాధనల సాక్షిగా
20. ఆరాధన అల్లరౌతోంది_నిజాయితీ లేని ప్రేమకు
21. ఆత్మాభిమానం  ఓ పాలెక్కువే నా భావాలకి_నాలానే
22. కలలా నువెళ్ళి పోతావన్న తొందరలో_కాస్త కల'వర'మైంది
23. మోమంతా సింధూర వర్ణమే_ఉదయసంధ్య అప్పుడే వచ్చేసింది కాబోలు
24. మనసంతా నువ్వే_మరు జన్మకు తోడంటూ
25. మోమున ముసి ముసి నవ్వులే_తలపుల గిలిగింతలకు
28. తోసివేయాలనుకోలేదు_తొలగి పోతున్నావెందుకో
29.శిధిలమైనా దాచుకున్నా_జ్ఞాపకంగా మిగిలిపోతావని
30. సంతోషం ఉప్పెనయ్యింది_నీ కోరికక
31. మౌనంలో మాటలు_విన్పిస్తాయి మనసుంటే
32. నిన్ను మర్చిపోయింది ఎప్పుడని_నా కన్నుల్లో తడెప్పుడు గుర్తు చేస్తూనే ఉందిగా


ఏక్ తారలు....!!

27/1/15
1. కాలం కలవర పడింది_క్షణాలన్నీ నువ్వు దోచేసుకుంటుంటే
2. మౌనం ఆగమంది_మనసుతో మాట్లాడుతున్నానంటూ
3. చిరునవ్వుల కేరింతలు చూసి_మబ్బులు ఒయారంలో ఓలలాడాయి
4. కలలొలుకుతున్నాయిగా_నిదురే పోని స్వప్నంలో
5. అరుణ వర్ణం వెలతెలా బోయింది_నీ బుగ్గల్లో కెంపుల మెరపు చూసి
6. నవ్వులకెన్ని అర్ధాలో_మాయల మౌనాలు తనలో దాచుకున్నందుకు
7. హరివిల్లుకెంత కినుకో_తన ఒంపుల వర్ణాలన్నీ నీలో దాచుకున్నావని
8. గోదారంతా నీ గల గలలే_వెన్నెల్లో తడుస్తూ
9. గమనిక స్వార్ధానికి_మానవత్వం లొంగిందని
10. మౌన తరంగాన్ని తట్టి లేపింది_మదిలో నీ అలజడి
11. సామాన్యునికి అందని తారల్లా_మేఘాల్లో గణతంత్రోత్సవాలు
12. అవునట_బియ్యం సింగపూర్ నుంచి తెచ్చుకోవాలేమో
13. అర్ధం పరమార్ధకెరుకని_అందరు చెప్తుంటే విని
14. సీతాకోక చిలుకలా_నీ నవ్వుల్లో విరిసిన ముద్దమందారాలనుకున్నా
15. జ్ఞాపకాల పుటలన్నీ తొందరపెడుతున్నాయి_ఏకాంతాన్ని పంపించేయమని
16. గోదారి పరవళ్ళు తొక్కింది_నీ హొయలకు జతగా
17. ఊహలకెప్పుడూ ఆరాటమే_నిశబ్దాన్ని ఎప్పుడు పంపేద్దామా అని
18. తీరాన్ని అల్లరి పెడుతూ_ఇలా వచ్చి అలా వెళుతూ

తెలుగు సాహితీ ముచ్చట్లు ... పదిహేడవ భాగం....!!

వారం వారం మన సాహితీ ముచ్చట్ల ప్రయాణం తెలుగు సాహిత్యపు కవి యుగాలతో పాటు ఛందస్సు లోని కొన్ని పద్య లక్షణాలను తెలుసుకుంటున్నాము కదా... ఈ వారం కవిత్రయంలో మూడవ వారైన ఎఱ్ఱన గారి  వివరాలతో పాటు సీస పద్య లక్షణాలు చూద్దాము....

1320 - 1400 : ఎఱ్ఱన యుగము 

 1320నుండి 1400 వరకు ఎఱ్ఱన యుగము అంటారు. ఈ యగంలో ప్రబంధ రచనా విధానానికి పునాదులు పడ్డాయి. మహాభారతంలో అరణ్యపర్వశేషం తెలుగుచేయబడింది. నన్నయ తిక్కనాదుల కాలములో చెల్లిన గ్రాంధిక, పౌరాణిక భాష ఈ యుగంలో ఆధునికతను సంతరించుకోసాగింది.
తిక్కన మరణానికి షుమారు 10 సంవత్సరాలముందు (1280 ప్రాంతంలో) ఎఱ్ఱన జన్మించి ఉంటాడు. ఎఱ్ఱన మరణం 1360లో జరిగిఉండవచ్చును. 1365-1385 ప్రాంతంలో జన్మించిన శ్రీనాధుడు తరువాతి యుగకవిగా భావింపబడుతున్నాడు.
ఆంధ్ర వాఙ్మయంలో ఆఖ్యాన పద్ధతిని నన్నయ, నాటకీయ పద్ధతిని తిక్కన ప్రారంభించినట్లే వర్ణనాత్మక విధానానికి ఎఱ్ఱన ఆద్యుడు. నన్నయ యొక్క శబ్దగతిని, తిక్కన యొక్క భావగతిని అనుసంధించి క్రొత్త శైలిని కూర్చిన మహానుభావుడు ఎఱ్ఱన. తెలుగుభాష పలుకుబడి, వాక్యనిర్మాణము ఈ కాలంలో ఆధునికతను సంతరించుకొన్నాయి. శ్రీనాధునివంటి అనంతరీకులు ముందుగా ఈ శైలినే అలవరచుకొని రచనలు సాగించారు.
తెలుగు సాహిత్యంలో 1320 నుండి 1400 వరకు ఎఱ్ఱన యుగము అంటారు. ఈ యగంలో ప్రబంధ రచనా విధానానికి పునాదులు పడ్డాయి. మహాభారతంలో అరణ్యపర్వశేషం తెలుగుచేయబడింది. నన్నయ తిక్కనాదుల కాలములో చెల్లిన గ్రాంధిక, పౌరాణిక భాష ఈ యుగంలో ఆధునికతను సంతరించుకోసాగింది.

తిక్కన మరణానికి షుమారు 10 సంవత్సరాలముందు (1280 ప్రాంతంలో) ఎఱ్ఱన జన్మించి ఉంటాడు. ఎఱ్ఱన మరణం 1360లో జరిగిఉండవచ్చును. 1365-1385 ప్రాంతంలో జన్మించిన శ్రీనాధుడు తరువాతి యుగకవిగా భావింపబడుతున్నాడు.

ఎఱ్ఱన పేరుమీద ఒక యుగం అవుసరమా? ఆ కాలాన్ని తిక్కన, శ్రీనాధ యుగాలలో కలుపకూడదా? అన్న సందేహానికి పింగళి లక్ష్మీకాంతం తెలిపిన అభిప్రాయం ఇది - "తిక్కన అనంతరం, శ్రీనాధునికి ముందు ఎఱ్ఱన, నాచన సోమన, భాస్కరుడు వంటి మేటికవులవతరించారు. అంతేగాక తెలుగు సారస్వతానికి త్రిమూర్తులైన కవిత్రయం తరువాతనే ఎంతటివారైనా పేర్కొనదగినవారౌతారు. ఆ మువ్వురును ఆంధ్ర కవి ప్రపంచానికి గురుస్థానీయులు. కనుక ఆ మువ్వురిపేరు మీద మూడు యుగాలుండడం ఉచితం. అంతేగాక ఆంధ్ర వాఙ్మయంలో ఆఖ్యాన పద్ధతిని నన్నయ, నాటకీయ పద్ధతిని తిక్కన ప్రారంభించినట్లే వర్ణనాత్మక విధానానికి ఎఱ్ఱన ఆద్యుడు. నన్నయ యొక్క శబ్దగతిని, తిక్కన యొక్క భావగతిని అనుసంధించి క్రొత్త శైలిని కూర్చిన మహానుభావుడు ఎఱ్ఱన. తెలుగుభాష పలుకుబడి, వాక్యనిర్మాణము ఈ కాలంలో ఆధునికతను సంతరించుకొన్నాయి. శ్రీనాధునివంటి అనంతరీకులు ముందుగా ఈ శైలినే అలవరచుకొని రచనలు సాగించారు. కనుక ఎఱ్ఱనను యుగకర్తగా సంభావించుట ఉచితం."

రాజకీయ, సామాజిక నేపధ్యం

1323లో ఢిల్లీ సుల్తాను చేత పరాజితుడై ప్రతాపరుద్రుడు మరణించడంతో కాకతీయ సామ్రాజ్యం అంతమైంది. అయితే కాకతీయులకు విధేయులైన నాయకులు తిరిగి ఢిల్లీ సులతాను సేనలను ఓడించి ఆంధ్రాపధాన్ని హస్తగతం చేసుకోగలిగారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలలో ఆంధ్రదేశం చిన్న చిన్న భాగాలుగా నాయకుల పాలనలోకి వచ్చింది. కృష్ణానదికు ఉత్తరాన ముసునూరు నాయకులు, రేచెర్ల వెలమ నాయకులు, కృష్ణకు దక్షిణాన రెడ్డి రాజులు రాజ్యం చేశారు. అనంతరం బీజాపూరు బహమనీ రాజులతో జరిగిన యుద్ధంలో కాపయ నాయకుడు మరణించాడు. అద్దంకి రాజధానిగా ఉన్న ప్రోలయ వేమారెడ్డి 1325-1353 మధ్యకాలంలో రాజ్యం చేశాడు. అతని ఆస్థాన కవియే ఎఱ్ఱాప్రగడ.

ముఖ్య కవులు, రచనలు

యుగకర్తయైన ఎఱ్ఱాప్రగడ హరివంశమును, భారత అరణ్య పర్వ శేషమును, నృసింహ పురాణమును వ్రాసాడు. రామాయణం కూడా వ్రాశాడు కాని అది లభించడంలేదు. భాస్కరుడు భాస్కర రామాయణమును, నాచన సోన ఉత్తర హరివంశమును వ్రాసారు. రావిపాటి త్రిపురాంతకుడు వ్రాసిన రచనలలో "త్రిపురాంతకోదాహరణము" మాత్రం లభిస్తున్నది. చిమ్మపూడి అమరేశ్వరుడనే మహాకవి "విక్రమసేనము" అనే మహాగ్రంధాన్ని వ్రాశాడట గాని అది లభించడంలేదు.

ఇక ఈ వారం సీస పద్య లక్షణాల వివరణ... 

సీస పద్యం

సీస పద్యం చాలా ప్రాచీనమైనది. మొదటగా ఈ పద్యాన్ని గుణగ విజయాదిత్యుని కందుకూరు శాశనం (క్రీ.శ.850 సం) లో చూశారు. అంతకు ముందే ఎన్నో సవంత్సరాలనుంచీ ఉండి ఉండవచ్చు. ఈ పద్యం చాల వరకూ శిధిలమైందని చరిత్ర కారులు చెప్పారు. అయితే ఉన్నంతవరకూ కొమర్రాజు లక్ష్మణరావు గారు ఇచ్చారు.
"శ్రీ నిరవద్యుండు చిత్తజాత సముండు
శివ పద వర రాజ్య సేవితుండ
ఖిలుడు ననృతరిపు బలుడు నాహవరావ
దండమోద్య సిఘాసనుండగణిత
దానమాన్యుండు దయా నిలయుండును
భండన నండన పండరంగు
...................................కొలది లేని
కొట్టము ల్వోడిచి గుణక నల్ల
తాని పక్ష పాతి................
....................విభవ గౌరవేంద్ర..
ఈ పద్యం లో ఒక విశేషం ఏమిటంటే.. కొలది లేని అనే మాట వచ్చేదాకా అన్నీ తత్సమ పదాలే కావడం విశేషమే! ఈ పద్యం ఏ పాదానికి ఆ పాదం విడిపోకుండా వుండే "గునుగు సీసం" కావడం మరొక విశేషమని పెద్దలు చెప్తున్నారు. నాహవరావ దండమోద్య సిఘాసనుండగణిత దానమాన్యుండు అనే పెద్ద పెద్ద సమాసాలు అప్పుడే మొదలైన విశేషం గమనించారు గదా. కొమర్రాజు లక్ష్మణరావు నన్నయ యుగానికి చెందిన ద్రాక్షారామంలోని సీసపద్యశాసనాన్ని ప్రకటించారు. గిడుగు రామమూర్తి పంతులు ప్రకటించిన దీర్ఘసీసపద్యశాసనం మరొకటి నన్నయ కాలం నాటిదే అయివున్నది.

ఉదాహరణ 1:

కలుగడే నాపాలి కలిమి సందేహింప
గలిమిలేములు లేక కలుగువాడు;
నా కడ్డపడ రాడె నలి న సాధువులచే
బడిన సాధుల కడ్దపడెడువాడు
చూడడే నా పాటు జూపుల జూడక
చూచువారల గృపజూచువాడు;
లీలతో నా మొఱాలింపడే మొఱగుల
మొఱ లెఱుంగుచు దన్ను మొఱగువాడు;

లక్షణములు

క.
నల నగ సల భ ర త ల లో
పల నాఱిటి మీఁద రెండుఁ బద్మాప్త గణం
బులఁ దగి నాలుగు పదములఁ
జెలువగు నొక గీతి తోడ సీసము కృష్ణా !
  • పాదముల సంఖ్య = 4
  • ఈ పద్యం లో, నాలుగు పెద్ద పాదాలు ఉంటాయి. ఆ నాలుగు పెద్ద పాదాలనూ..మళ్ళీ నాలుగు పెద్ద పాదాలుగా, నాలుగు చిన్న పదాలుగా విడగొట్టి రాస్తారు.
  • ప్రతి పాదంలోనూ 6 ఇంద్ర గణాలు, + 2 సూర్య గణాలు కలిపి మొత్తం ఎనిమిది గణాలు ఉంటాయి.
  • ఈ పద్యాలు పెద్దవి కావడం చేత ప్రతి పాదాన్నీ రెండు భాగాలుగా చూపుతారు.
  • ఈ నాలుగు పాదాలకూ చివర ఆటవెలది కానీ, తేటగీతి గానీ ఉండవలెను, ఇది తప్పనిసరి.
  • ఒకటో పాదం .... ఇంద్ర - ఇంద్ర - ఇంద్ర - ఇంద్ర - పెద్ద పాదం.
  • రెండో పాదం.. ఇంద్ర - ఇంద్ర - సూర్య - సూర్య- చిన్న పాదం.
  • మూడు నాలుగూ... ఐదూ ఆరూ... ఏడు ఎనిమిదీ.. పదాలు వరుసగా ఉంటాయి. ఇలాగే..
  • ప్రతి చిన్న పాదం లోని మొదటి గణం మొదటి అక్షరానికీ.. మూడవ గణం మొదటి అక్షరానికీ యతి చెల్లాలి. ప్రాస యతి కూడా చెల్లుతుంది. ఈ పద్యానికి ప్రాస నియమము లేదు.

యతి

  • యతి
    • 1వ గణంలో మొదటి అక్షరానికి 3వ గణంలో మొదటి అక్షరంతోనూ,
    • 5వ గణంలో మొదటి అక్షరానికి 7వ గణంలో మొదటి అక్షరంతోనూ మైత్రి కుదరాలి.
    • ఉదా: లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర దీపాలు గగనాన త్రిప్పలేక
  • ప్రాసయతి ఉండ వచ్చు.
    • అంటే పై సూత్రంలో చెప్పిన గణాలలో మొదటి అక్షరాలకు యతి మైత్రి బదులు రెండో అక్షరాలు ప్రాస నియమం పాటిస్తే చాలు - అంటే ఒకే అక్షరం అయి ఉండాలి (ఏ గుణింతమైనా సరే).
    • ఉదా: లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర దీపాలు గగనాన త్రిప్పలేక

ప్రాస

ప్రాస నియమం లేదు.

ఉదాహరణ 2:

వరధర్మకామార్థ వర్జితకాములై
విబుధు లెవ్వాని సేవించి యిష్ట
గతి బోందుదురు? చేరి కాంక్షించువారి క
వ్యయ దేహ మిచ్చు నెవ్వాడు కరుణ?
ముక్తాత్ము లెవ్వని మునుకొని చింతింతు?
రానందవార్ది మగ్నాంతరంగు
లేకాంతు లెవ్వని నేమియు గోరక
భద్రచరిత్రంబు బాడుచుందు?

ఉదాహరణ 3:

సీసపద్యం ఎట్లా ఉండాలనేది ఒక ఆటవెలది పద్యంలో ఈ విధంగా చెప్పబడింది.

ఇంద్రగణములారు ఇనగణంబులు రెండు
పాదపాదమందు పల్కుచుండు
ఆటవెలదినైన తేటగీతియు నైన
చెప్పవలయు మీద సీసమునకు

సీస పద్యాన్ని ఒకేలాగా ఉండే నాలుగు పెద్ద పాదాలుగా కాని (1,1,1,1), ఈ ఒక్కో పెద్ద పాదాన్ని రెండు చిన్న పాదాలుగా (1,2,1,2,1,2,1,2) - మొత్తం ఎనిమిది పాదాలుగా - గాని వివరించవచ్చు. సీస పద్యంలో భాగం కాకపోయినా, సీస పద్యం తరువాత ఒక గీత పద్యం ("ఆటవెలది" లేదా "తేటగీతి") వస్తుంది.
  1. ఒక పెద్ద పాదంలో వరుసగా 6 ఇంద్ర గణాలు, 2 సూర్య గణాలు వస్తాయి.
  2. ప్రాస నియమం లేదు.
  3. యతి: 1వ గణంలో మొదటి అక్షరానికి 3వ గణంలో మొదటి అక్షరంతోను, 5వ గణంలో మొదటి అక్షరానికి 7వ గణంలో మొదటి అక్షరంతోను మైత్రి కుదరాలి.
  4. ప్రాసయతి ఉండ వచ్చు. అంటే పై సూత్రంలో చెప్పిన గణాలలో మొదటి అక్షరాలకు యతి మైత్రి బదులు రెండో జత అక్షరాలు ప్రాసలో ఉండవచ్చు. ఒకే అక్షరం అయి ఉండాలి (ఏ గుణింతమైనా సరే)
ఈ అచ్చ తెనుగు పద్యరీతులలో ఖచ్చితమైన గణాలు చెప్పకపోవటం వల్ల అన్ని పద్యాలు (అంతెందుకు ఒక పద్యంలోని అన్ని పాదాలు) ఒకే లయలో ఉండనవసరం లేదు. కాని వీటి లయను గుర్తించడం అంత కష్ఠం కాదు. పద్యాలు పైకి చదువుతుంటే లయ దానంతటదే అవగతం అవుతుంది.
ఉదాహరణ
సీసము
తిలకమేటికి లేదు తిలకినీ తిలకమా? పువ్వులు దురుమవా పువ్వుఁ బోడి
కస్తూరి యలదవా కస్తూరికా గంధి? తొడవులు దొడువవా తొడవుతొడవ?
కలహంస బెంపుదే కలహంస గామిని? కీరముఁ జదివింతె కీరవాణి?
లతలఁ బోషింతువా లతికా లలితదేహ? సరసి నోలాడుదే సరసిజాక్షి?
ఆటవెలది
మృగికి మేతలిడుదె మృగశాబలోచన? గురులనాదరింతె గురువివేక?
బంధుజనుల బ్రోతె బంధుచింతామణి? యనుచు సతుల నడిగె నచ్యుతుండు
 సేకరణ : వికీపీడియా నుండి 
వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో.....

29, జనవరి 2015, గురువారం

ఏక్ తారలు...!!

28/1/15
1. జీవమున్న అక్షరాల మెరుపులే_తారల తళుకులు
2. వాస్తవాలకు అబద్దాలు చెప్తూ_ఊహల నిజాలు
3. నీలి వర్ణం మెరుస్తోంది_నల్లనయ్య అందాన్ని దోచుకుని
4. పసితనమే పండిపోయింది_పండు వయసును మీదేసుకుని
5. ఎద సవ్వడి చేసేదీ_ఈ జ్ఞాపకమే
6. మౌనానికి మాటలొస్తే_మది సంగతి తెలుపుతుందేమో
7. నీ స్పర్శ చేరిందేమో_శిల్పం చెలిగా మారింది
8. పరిమళాలన్నీ పంచుకో_పులకించే పూలతో సహా
9.  కన్నీరెందుకో తడబడుతోంది_కలేనంటూ నువ్వు తీసిపారేస్తుంటే
10.  రానంటున్నాయి భావాలు_మదిని వదలి
11. నన్ను నే వెదుక్కుంటున్నా_నువ్వు విసిరి పారేసిన జ్ఞాపకాలలో
12. కలై  కమ్మేసింది నన్ను_అంతే తెలియని నీ ప్రేమ సంద్రం మదంతా
13. ఓదార్పులే నీ జ్ఞాపకాలు_విరహంలో వేగుతున్న మనసుకు
14. ప్రేమ వలలే వేసావుగా_మది సంద్రాన్ని దోచేస్తూ
15. ప్రేమతో మదిలో బంధించి_బయటకు రమ్మంటే ఎలా
16. పరిచయమే జ్ఞాపకాలకి_నీ సాన్నిహిత్యంలో కాలం ఎటుపోతుందో

ఏక్ తారలు....!!

26/1/15

1. కలలొలుకుతున్నాయి ... కన్నీళ్ళతో చేరి 
2. మబ్బులకూ ఒయారమే ... వర్షంలో హర్షాన్ని ఒలకబోస్తూ
3. నిశ్శబ్దం విసుక్కొంది ....
మనిద్దరి మధ్యన తన చోటు గల్లంతైందని
4. అబద్డంలోనే జీవిస్తున్నాం... గత అరవై ఆరేళ్లుగా అదే నిజం అనుకుంటూ
 5. కలలో 'కల'వరించినందుకేమో...శిల్పానికి సైతం జీవ నాదం
6.  అక్షరాలకెందుకో ఇంత కినుక_అందమైన భావాలల్లేస్తున్నానని
7. రేయికెంత కలవరమో_వేకువ చేతిలో ఓడిపోతానని
8. మీ అభిమానంలో పడి_భావాలను మరచిపోతానని
9. పుడమికెందుకో ఇంత కులుకు_ప్రకృతి కాంత సొగసులు తనవనేమో
10. మౌనమైన మది అంతరంగం_ఆలకించనందుకేమో
11. మనసు రాయించే అక్షరాలకు_నగిషీలతో పనేముంది కనుక
12. ఎదలో సవ్వడి_మౌనాన్ని హరాయిస్తూ
13. భావాత్మకమైన భాష విలసిల్లు_అందరి మదిలో నిత్య నూతనంగా
14. దోసిలిలో దాచుకుంటున్నా_సైకత రేణువులై జారి పోతుంటే
15. సంద్రంలో భాగమేగా కెరటం_లోతులు తెలియనిది కాదు
16. ఓర్పు సహనం ఉన్నాయే_నిందల్ని మోయడానికి సిద్దంగా
17. చుక్కల దుప్పటి ఎగిపోయింది_మబ్బులన్నీ మూకుమ్మడిగా దాడి చేస్తుంటే
18. పూలకెంత పరవశమో_కొమ్మల సన్నాయి రాగాల సందడికి
19. మురళీలోలుని మురళికి_తెలియని రాగాల బాణిలా
20. మోహనుని మది దోచిందందుకే_మురిసిపోతూ మురళి
21.  వెండి వెన్నెల అడిగి తెచ్చా_చీకటి దుప్పటి చుట్టేసి పోదామని
22. కన్నీరు తుడుస్తోంది_మనసైన స్నేహం
23. మది ఉలికిపాటుకు_నీళ్ళన్ని అల్లకల్లోలం
24. ఆణి ముత్యాలే అక్షరాలు_పద భావాలను పేర్చుకుంటూ
25. ఒంటరి తనం వదిలేసింది_నిన్ను నాలో చూసాక
26. నీడలో నిజం_నిలబడే ఉంది


మణి మాలికలు....!!

1.మనసు నవ్వుకుంటున్నది
   మౌనమూ తన జతే అని  
2. మనసు నవ్వుకుంటున్నది
   మాయలు నేర్చిన నీ ప్రేమకు
3. మనసు నవ్వుకుంటున్నది
   నీ మొసలి కన్నీళ్ళను చూస్తూ
4. కోపం శాపమైంది నాకు
   వరాలన్నీ నువ్వు తీసుకుంటే
5. వ్యక్తిత్వం వదిలేసా నీ ప్రేమలో
  అంతు లేని ఆరాధనకు దాసోహమై
6. సడి చేస్తోంది మనసు
   పక్కనే మౌనం పలకరిస్తుటే
7. రహదారంతా రాళ్ళ బాటే
కన్నీళ్ళకు కరగని పాషాణాల్లా
8. నేనంటూ లేనే లేనుగా
నాదంతా నీవై పోయాక
9. జీవితమంతా కన్నీరే
ఆనందం నా దరి చేరక
10. నేనే నీవుగ కూడాముగా 
నువ్వు నేను ఒకటయ్యాక
11. కోల్పోయినా జ్ఞాపకాలలోనే
జీవిస్తూ ఎప్పటికీమణి మాలికలు

28, జనవరి 2015, బుధవారం

అక్షరాల అలుక....!!

నేస్తం...
     పలకరించి కాసిని రోజులయ్యింది కదూ... రోజు నీతో కబుర్లు చెప్పాలనే అనుకుంటాను.. కాని ఎందుకో ఈ మధ్య భావాలు అలిగినట్లు ఉన్నాయి నా మీద... అక్షరాలకు అందడం లేదు... మాటల చాటుగా చేరి దోబూచులాడుతున్నాయి.. కొన్నిసార్లేమో అందినట్లే అంది దొరకకుండా జారిపోతున్నాయి శైకత రేణువుల్లా... నా ఏకాంతానికి స్నేహంగా వచ్చి చేరి అంతలోనే పారిపోతూ దాగుడుముతలాడుతున్నాయి ఈ భావనలు... అవునూ అసలు ఈ స్పందించే మనసెందుకు నాతో ఉంది... అదే లేక పొతే నా ఏకాంతంలో నేనే ఉండేదాన్ని కదా... మదిలో రొద చేసే ఎన్నో ఆలోచనలకు సర్ది చెప్తూ కొన్నిటికయినా అక్షరరూపాన్ని ఇవ్వాలన్న నా ఈ ప్రయత్నాన్ని విరమించేదాన్ని ఎప్పుడో...
     ఈ మధ్య పలకరింపుల ప్రహసనాల్లో నాకు కనిపించని నిజాయితీ గురించి ఆలోచిస్తూ తరచి చూసుకుంటే నిజాయితీ అన్న పదాన్నే మర్చిపోయినట్లుగా అనిపించింది... కాసిన్ని కవితలు, ఓ నాలుగు బహుమతులు, నాలుగు పుస్తకాలు వచ్చేస్తే చాలు.. మనమే గొప్ప కవులమని అనేసుకుంటూ ఎదుటివారిని చులకన చేసే సంప్రదాయం ఎందుకు మనలో వేళ్ళు  నాటుకుంది..? చూసే మనసే ఉండాలి కాని...  ప్రతి వ్యక్తిలో గొప్పదనం ఉంటుంది... కాకపొతే ఆ గొప్పదనాన్ని గుర్తించి ఒప్పుకునే మనసే మనకుండదు.. ఏంటో ఒకరికి పేరు వచ్చినా తట్టుకోలేము... పోనీ మనకున్న పేరు నిలుపుకోడానికి ప్రయత్నించనూ లేము... ఎదుటి వారిలో తప్పును చూసే ముందు మనలోనికి మనం ఒక్కసారి తొంగి చూసుకుంటే ఎంత బావుండు... అసలు ఇలా ప్రతి దానిలో చెడునే ఎత్తి చూపాలని కంకణం ఎందుకు కట్టుకోవాలి... చెడులో మంచిని ఎందుకు చూడలేక పోతున్నాము... మనని పోగిడితేనే మన ఆత్మీయులా... విమర్శకుల్లో మన బంధువులు లేరా... ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా మంచి చెడు రెండు ఉంటాయి... సద్విమర్శను స్వీకరిస్తూ సాధ్యమైనంత వరకు ఎదుటివారి మనసు నొప్పించకుండా సాగిపోతే చాలనే చిన్న మాటను చేతల్లో చేయగలిగితే చాలు... అందరు సంతోషపడే వారే కదా మిగిలేది .... ఏం  నేస్తం నువ్వేమంటావు...?
ఏంటో కలగాపులంగా చెప్పినట్లు ఉన్నా కదా కబుర్లు ఈసారి... చెప్పానుగా అక్షరాలూ భావాలు రెండు నామీద అలిగాయి ..అందుకే ఇలా నీకు కాస్త కష్టంగా.... ఉండనా మరి ఇప్పటికి
నీ నెచ్చెలి

27, జనవరి 2015, మంగళవారం

వన్నెల సంతకాల.....!!

చేరువగా వచ్చి చేతిలో అక్షరమై
భావమై ఒలికి భారాన్ని పంచుకుంటూ 
మదిలో నిలిచి మమతలై పొంగి
ఆర్తిగా స్పృశించి ఆరాధనగా మారి
గుండెను తడిమి గురుతులను దాచి
కవితలను అల్లి కథలెన్నొ చెప్తూ
గతాన్ని తలుస్తూ జ్ఞాపకాలను పేర్చి
కన్నీట ఒలికే పన్నీరు చినుకులను
చిరునవ్వు వెన్నెలలో సిగ్గు దొంతరలను
చీకటి సింగారాలను రేయి వాకిట వదలుతూ
కలల కడలి కావ్యానికి శ్రీకారం చుడుతూ
భాష్యానికి అందమైన భాషను కూర్చి పేర్చిన
తుషారాల తుమ్మెద సమ్మోహన నాదమై
మనసు చేసిన తొందరలో జాలువారిన
వన్నెల సంతకాల వసంత యామిని...!!

26, జనవరి 2015, సోమవారం

ప్రకృతిలో భరతమాత...!!

పుడమితల్లి పురిటి నెప్పులకు
విధాత అద్దిన వర్ణాలతో వెలసిన
ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలో
జలధారల జీవనదాల జలపాతాలు
విలయంలో అశువులు తీసే ఆక్రోశపు శోకాలు
అంతలోనే కరుణించని కరకురాళ్ళ కాఠిన్యం
పాషాణమైనా శిల్పి చేతి ఉలి దెబ్బకు
చెరిగిపోని శిల్పకళా నైపుణ్యమైన వైనం 
చెప్పిన సత్యం ఓరిమి వహించిన వెలుగుల 
వందనాలు అందుకునే దైవ రూపాలే సాక్ష్యాలు
పచ్చదనాల పడుచు వన్నెల తివాసీలపై
అలరాలే మంచు ముత్యాల మురిపాలు
సంతోష సాగరంలో ఎగిరిపడే కెరటాల క్షణాల రూపం
పడినా లేవమని పట్టుదలను నేర్పే నాంది గీతం
అందచందాల అణు నిర్మాణాల అంతే తెలియని
కణ సముదాయాల పొత్తిళ్ళ సాంకేతికతో
అణు యుద్ద నినాదాల హోరుతో క్షణ క్షణం మరణ భయంతో
మూగ జీవాల సాహచర్యంతో సేద దీరుతూ
మనసులేని మానవత్వంలో నలుగుతున్నా
ఎప్పటికప్పుడు దిగులు దుప్పటిలో దాచుకుంటున్న
ప్రకృతి విలయానికి కారణాలను చెరిపేస్తూ
ఆధునికత కోసం అర్రులు చాస్తూ
సంస్కృతీ సంప్రదాయాలను మరచి
వావి వరుసలను వెలి  వేసి సహజీవన మత్తులో
మరో సంస్కృతిలో తేలియాడే భారతీయత
భరతమాతకు కట్టిన దాస్య సృంఖలాలు
నిలువెత్తున అలంకరించిన లోహపు ఆభరణాలు
గుండెలపై మోయలేని భారమైన బిడ్డల
మతోన్మాదాల నెత్తుటి చారికలు
ఇది మన భారతం మారని మరో ప్రజాస్వామ్యం....!!

ఏక్ తారలు....!!

25/1/15
1. మనసుకు పని పడింది_అర్ధాలను వెతికేందుకు
2. మనసు సున్నితం_భావాలు గుచ్చుతుంటే గిల గిలలాడుతోంది
3. సముద్రమంత స్నేహాన్ని_గుప్పెడు గుండెలో దాస్తానంటే ఎలా
4. కలలో చేరి_కనుమాయమౌతావేమోనని
5. పుష్పక విమానమే నా మది_నీ భావనల విరులతో చేరి
6. గతానికి వర్తమానానికి మధ్యలో_వాస్తవంలా
7. ఒకే ప్రాణమైనా_విడి వడిన శరీరాలు కలవలేక
8. విరుల అందానికి_మరులు గొన్న తుమ్మెదల ప్రదక్షిణాలే ప్రతి క్షణమూ
9. ఎన్నెలంటి నీ సూపు_నే ఎటెల్లినా ఎంటబడతా ఉంది 
10. రానంటునే వెంట పడుతున్నాయి_నీ జ్ఞాపకాల నీడలు
11. తీగనై అల్లుకున్నా_నీ విధిలింపులు భరిస్తూ

25, జనవరి 2015, ఆదివారం

ఏక్ తారలు...!!

24/1/15
1. నేను నీకే సొంతమన్న నీ స్వార్ధం_నన్ను నీతో యుద్ధం చేయనివ్వలేదు
2. మట్లాడాలేని సాక్ష్యం మనసై_ముచ్చట్లను ఆస్వాదిస్తోంది
3. అధరాల మధువు అందినందుకేమో_అధర జంటలకంత అహం
4. వేకువ వెలుగొచ్చింది_దగ్గరౌతున్న నీ అలికిడికి స్వాగతిస్తూ
5. సుముహుర్తానికి సమయమయ్యింది_చక్కని తారని తిధితో కలిపి
6. నీలాలు కారేటి నీ కళ్ళు_నను వెంబడిస్తూనే ఉన్నాయి ఎటు వెళ్ళినా
7. ఉచ్చ్వాసం నాదైన_ నా నిశ్వాసం నీవే కదా
8. నేనిక్కడే మిగిలి పోయా నిన్నటిలో_రేపటికైనా నువ్వు వస్తావన్న ఆశతో
9. రాజకీయం బాగా వంట బట్టినట్టుంది_మన నాయకుల పక్కన చేరి
10. నా ఊపిరే నీవైతే_నిన్నొదిలి నే శ్వాసించేదెలా
11. గాలిలో నీ శ్వాసనే అందుకున్నా_నీలో లీనమై తరించాలని
12. వెలసిన వర్ణాల చిత్రం_అద్దంలో నన్ను చూసి నవ్వుతూ
13. మాటల్లో పడి_దూరమే తెలియలేదు అందుకే
14. తొలి సంధ్య సిగ్గు పడింది_భానుని రాకను పసిగట్టి
15. అణువంత చోటిస్తే_బ్రహ్మాండమై చుట్టేశావు
16. నవ్వుల నక్షత్రాలు పరిచింది_నీ రాక తెలిసి
17. మకరందం అందిందని_మరులు పోతున్నాయి ఆధరాలు
18. నీ సోయగమంటినట్టుంది_వయ్యారంతో పాటుగా
19. వలపు చిలికి వడ్డిస్తే_కమ్మని విందు భోజనాలే
20. పరితాపమే_ప్రియ సన్నిధికి చేరక
21. క్షణమైనా _యుగాల తాపమే నాకు
 22. ప్రేమ సాంగత్యమే_మరెన్నడూ విడవలేనంటూ
23. ఇహ పరాలు అన్ని_ప్రేమలో మాయమే
24. వేల జన్మలు నీతోనే అంటే_ఏడు జన్మలు చాలంటే ఎలా
25.తెలిసిన మనసుకు తేలికే_సన్నిహితాన్ని స్నేహితమంటూ
26. మయూరం పురి విప్పింది_నీ చెలిమిని స్వాగతిస్తూ
27. మిన్నలలో మిగిలిపోయా_వెన్నెల కోసం ఎదురు చూస్తూ
28. నేను  నువ్వుగా ఉంటే_నన్నెలా చూపుతుంది నీకు పిచ్చి అద్దం
29. అన్నల అనురాగం నువ్వందిస్తానంటే_ఈ క్షణమే వచ్చేస్తా
30. నిశబ్దపు నీడ వెన్నాడుతోంది_నీ రాక తెలియనీయకుండా
31. మనసు పుటలన్నీ_నీ జ్ఞాపకాలే మరి
32. మనసెరిగిన మమతలు_కన్నీళ్ళకు తావీయక
33.తాకిన మది మౌన తరంగం_పలికిన హృదయ రాగం

భరతమాత కన్నుల్లో...!!


మనసు మూగదైన తరుణాన
జనని బిడ్డల ఆక్రోశము ఆలకించలేక
మనకంటూ ఏది లేదని తలపోస్తూ
జన పదంలో సమిధలమైనందుకు నిట్టూర్చుతూ
కనలేని స్వప్న సౌధాలను కావాలంటూ
నినదించే మది హోరులో కొట్టుకుపోతూ
రానని మొరాయిస్తున్న బంధాలను
వెనకేసుకొస్తున్న ఆత్మీయతలను
తాన తందానని చెక్కభజన చేస్తున్న సహవాసాలను
వెనకటింటి గుమ్మం నుండి దాటేస్తున్న కొత్త తరం
మనమందరమూ ఒకటేనని జాతీయ గీతాన్ని
వినసొంపుగా ఆలపించిన ఆ రోజు కనిపించు
అనన్య తేజస్సు భరతమాత కన్నుల్లో...!!

24, జనవరి 2015, శనివారం

ఏక్ తారలు ...!!

23/1/15
1. రామకోటి రాయడంలో పడి_ప్రేమకోటికి చోటు లేకుండా చేస్తే ఎలా
2. అమెరికా వీసా కావాలండి_కోటు (టి ) సరిపోదు ఇప్పుడు
3. గగనాన్ని జల్లెడ పట్టా_  నువ్వు కనిపిస్తావేమోనని
4. చీమలు బారులు తీరాయి_తేనే రుచి చవి చూసినందుకేమో
5. ముద్ద బంగారం మేలిమో కాదోనని_ముద్దుతో సరిపెట్టుకోవానుకుందేమో
6. ధూపంలో వెదికి చూసాను_పరిమళం గాలివాటుకి కొట్టుకుపోయి గుండె ఖాళీగా ఉంది
7. పిచ్చి మనసు కనుకే_అన్ని తనవే అనుకుంటుంది ఏది తనద కాకపోయినా
8. ఎద చుట్టూ పరిమళాలే_నీ జ్ఞాపకాల పూలతో
9. ఏకాంత రాగానికై ఎదురుచూస్తుంటే_మౌనగానం మది పంపింది
10. మోహం (నం) మురళిలో దాగిపోయింది_నల్లనయ్య చిలిపితనానికి 
11. క్షణాలన్నీ భారాలే_నీ సన్నిధిలో చేరకుంటే 
12. అగ్ర తాంబూలం నాకిచ్చి_ఆయువే నువ్వు తీసుకుంటే ఎలా 
13. మనసు మురిసింది_నీ జ్ఞాపకాల విరుల పరిమళాలకు 
14. గాంధర్వానికి జత చేరిన అనురాగం_ఏకాంతానికి స్వస్తి పలికింది 
15.పైర (పిల్ల) గాలినే మార్చేసి_నిట్టూర్పుల వడగాలి చేసేస్తే ఎలా 
16. పాల మనసు పొంగుతోంది_ప్రేమ వేడికి తాళలేక 
17. కావ్యాంజలి ఘటించా_కరుణించవే కలల నా చెలి 
18. పంచనామా వద్దంటే వినలేదు_నీ జ్ఞాపకాలతో ఛిద్రమైన ఎదను చూసి తట్టుకోలేవని 
19. గుచ్చుతున్నాయి గులాబి ముళ్ళై_పరిమళాన్ని అందిస్తున్నా 
20. పారిజాతమై చేరింది_సత్య అలుకను దీర్చ 
21. కోపానికి తన మన లేదు_ఫాలాక్షుడేపాటి 
22. అందుకేగా అష్ట సఖులు ఇష్టంగా మురిసేది_పదహారువేల గోపికలతో పాటు 
23. మురిసింది ... మురిసింది _మురళి నాదమందుకేలే 
24. ప్రేమ జయిస్తుంది_కఠినమైన మనసుని 
25. మనసుని తొలిచే గాయాలూ_ఈ జ్ఞాపకాల అనుభూతులే 
26. ఆరో ప్రాణంగా నే మిగిలిపోయా_పంచ ప్రాణాల పంచనామా చూడలేక 
27. నీ కోసమని పరిమళాన్ని వదిలితే_పూలను చిన్నబుచ్చుతావెందుకు 
28. గుండెల నిండా కొలువై ఉండాలని_కాస్త నవ్వుకే అలా ఐతే కష్టం కదూ 
29. అందుకున్నా స్నేహాన్ని_మోహాన్ని మరచి 
30. అసూయ అంతరాయం కాకూడదు_అక్షరాలే మెరవాలి అంతా 
31. రేయి మెలకువగానే  ఉంది_గగనంలో దాగిన తారలు నీ కోసం వస్తాయేమోనని 
32. అనుకోని అతిధినే_ప్రణయ కావ్యమే నాదైనప్పుడు 
33. నిరీక్షణలోనే గడిపేస్తున్నా_నీకోసం కలవరిస్తూ 
34. మరపు మందు ఇవ్వలేదా కాలం_వాస్తవంలో ఉంటూ గతాన్ని వదిలేయడానికి

23, జనవరి 2015, శుక్రవారం

జాజిమల్లి ఎదురుచూపులు....!!

జాతరకు వేళాయే జతకు రావేల
జాజిమల్లి ఎదురుచూపులు గుచ్చలేదా
జాము రాతిరయినా జాగు చేయనేల
జాబిలమ్మకు తొలిపొద్దుకు పోటి కుదిరే
జాడ తెలియక మనసు గుబులాయే
జాలి లేని కాలం జరిగిపోతోంది
జారిపోయిన జ్ఞాపకాలు తగులుతున్నాయి
జాగృతిని మరచి స్వప్నాల్లో నిదురిస్తున్నాయి 
జానపదాలు నా రాతల్లో నిన్నే కలవరిస్తున్నాయి
జావళిలో భాగమై చేతులు కలిపాయి
జాతులు రీతుల స్వరాలు మరచి
జానకి రాముల కలయికకై కలవరించాయి...!!

22, జనవరి 2015, గురువారం

మనసు దోచుకుని....!!

హిమవంతుని పుత్రి కైలాస నాధుని మనసు దోచుకుని అర్ధ భాగము తానందుకునె

ఏక్ తారలు...!!

21/1/15
1. మెరవని అక్షరాలతో మురిసిపోవాలనుకున్నా_మౌన సమీరమై  తాకితే చాలని
2. నిజమే మరి_కట్న కానుకలు తేలేదని వారు పంపేది కాటికే కదా
3. ఈ చావడాలు ఎందుకో_హాయిగా కలిసుండక :)
4. కలమెప్పుడు చురుకే_సూదంటు రాయిలా భావాలను రాస్తూ
5. నువ్వే నా గమ్యమని అనుకుంటే_ఎక్కడున్నావో తెలియక తడబడే అడుగులు
6. ఆత్మీయపు పలుకు_ఆహ్వానించే అతిధి
7. కాల సంగీతాన్ని కాచి వడబోసినందుకేమో_అనుక్షణం మారుతూ
8. మనసు ఖాళీగా ఉందేమో_చొరబడదామనుకున్నా
9. రేపటి కోసం ఎదురు చూస్తూ_నిన్నటి జ్ఞాపకాన్ని నేనేనని మర్చిపోయాను
10. కలువలకు చోటు లేదేంటా అని చూస్తున్నా_జ్ఞాపకాల తామరలు కొలను నిండా ఉంటే
11. గాలివాటుకి కొట్టుకుపోతుంది_ఈ మేకపోతు గాంభీర్యం
12. కన్నీటి మంటల పొగలు ఎక్కువై_యవ్వన సెగ వేడి కాస్త తగ్గింది
13. మౌనరాగం మహ గమ్మత్తుగా ఉంది_నీ స్వర సాహిత్యం అమరినందుకేమో
14. మోహనం ముగ్ధమై_పరవశానికి పరిమళ రాగాన్నిచ్చి_మౌనాన్ని ఊరడించింది
15. యవ్వనానిదంతా ఉతుత్తి హంగులే_పొంగి ఆరిపోయే పాలలా
16. లేచి పడే కెరటంలా_మున్నాళ్ళ ముచ్చటే ఈ యవ్వనం
17. కాగితానికి తొందరే_కలం సిరాక్షరాలను ఎప్పుడు చేర్చుతుందా అని
18. గ్రీష్మంలో వడలుతుంది_కొత్త చివుర్లను దాచే యత్నంలో
19. యవ్వన వేడి తగ్గినా_అనాధను చూసి హుంకరించింది నా అహం
20. తీసుకెళ్ళాలనే ఉంది తోడుగా_వేల జన్మల జతకు
21. అక్షరాలు అజరామరం_కలం సాక్షిగా
22. ఏకత్వానికి ఎప్పుడో సరే అన్నా_అర్ధ నారీశ్వరుని అనుగ్రహంతో
23. అనుభూతిలోనే మిగిలిపోయా_తీరాన్ని తాకిన సంబరంలో
24.  గుప్పెడు క్షణాలు చాలు_నీ జ్ఞాపకాలను గుండెల నిండా నింపుకోవడానికి
25. గుళ్ళో రాయిని చెయొద్దు_సజీవ జ్ఞాపకాన్నైతే చాలు
26. చలికి వణుకుతూ_చోటు కోసం వెదుకుతుంది
27. గ్రీష్మ తాపానికి కోపం రాదూ_పక్కనే ఉన్నా తనని పట్టించుకోవడం లేదని
28. స్వప్న సౌధాలనే నమ్ముకుంటే ఎలా_వెక్కిరిస్తూ వాస్తవం ఎదురుగా ఉంటే
29. ఇంకా ఏకాంతమంటే ఎలా_జ్ఞాపకాలను తోడిచ్చాయిగా
30. హృదయానికి చప్పుడు ఉంది_మౌనమైన మనసు మరీ అద్బుతం కదూ
31.  కలల్లో ఉండిపోతూనే_కోయిల స్వరం యవ్వనాన్ని దాటేసింది
32. నిత్య యవ్వనం కోసం_అమృతాన్ని గ్రోలిందేమో హృదయం 
33. చిన్నతనం పెద్ద మనసుతో_నేను నీ దగ్గరకే వస్తానని ఊరడించింది
34. మదిలో ఏ పొరను కదిలించినా_నీ జ్ఞాపకపు వెచ్చదనాలే
35. సాయంసంధ్యలోనూ_విరుపుల కువకువలే ఈ జ్ఞాపకాల అనుభూతులకు
36. మరచిపోయే జ్ఞాపకమా_మరలిపోని ఈ అనుభూతి
37. అందుకే మరి_జ్ఞాపకాల అనుభూతి మూడుకాళ్ళ వయసులో

ఏక్ తారలు ...!!

22/1/15
1. లెక్కలు తప్పినా_నా నుంచి మనసు మళ్ళకుండా ఉంటే చాలు
2. అక్షరాలకు కెంపుల వన్నెలెక్కడివా అనుకున్నా_నీ బుగ్గల్లో సిగ్గులని తెలియక
3. మంగళ తోరణాలు ముసి ముసిగా నవ్వుతున్నాయి_మూడుముళ్ళ ముచ్చట గానానికి
4. అస్సలు నాకంటూ ఏమి లేదు ఇక లెక్కలెలా తప్పుతాయి _జగన్ తండ్రి మీద ఆన
5. మది తలుపులు తెరిస్తే_పారిపోనని మాటివ్వు
6. తర్కానికి తావీయక_నా సాన్నిహిత్యాన్ని ఆస్వాదించరాదూ 
7. మాతృత్వ మధురిమ పరిమళం_గత జన్మ వరమే కదా
8. నా ఊహలు నీతోనే ఉంటే_ఒంటరన్న చింత నీకేలా
9. నిరాశావాదాన్ని చుట్టుకుంటే ఎలా_ఆశతోనే అంబరాన్ని తాకాలి
10. జ్ఞాపకాల అంబులపొది నిండుగా_నీతో యుద్దానికి సన్నద్ధమై
11. తలపులలో తడిమే జ్ఞాపకం_వాస్తవమై చేరిన క్షణం
12. ప్రేమ తపస్సు ఫలితం_మూడుముళ్ల బంధం వెలుగుతున్న అగ్నిహోత్రం సాక్షిగా
13. తెరిచే ఉన్నాయి_నీ కోసం నిరీక్షిస్తూ
14. అలసిన మది ఆనందం_అలుపెరగని నీ ప్రేమలో
15. నా జ్ఞాపకం నీ ఊపిరైతే_ఇక పంచనామాలెందుకు
16. పదమునైనా కాకపోతిని_నీ మదిని తెలిపే లిపికి
17. పలుకే మరిచింది పెదవి_నీ నామ స్మరణలో లీనమై
18. జ్ఞాపకాల చెలిమితో_ఒంటరితనానికి వీడ్కోలు
19. ఎందుకంత భయం_నన్ను చూడాలంటే
20. ఎద వీణను సవరించా_జ్ఞాపకాలకు గమకాలు అందించడానికి
21. జ్ఞాపకాల చేయూత_పెను తుఫాను నుంచి తట్టుకోవడానికి
22. మంచు మువ్వల ముత్యాలు మెరుస్తున్నాయి_నీ చిరునవ్వుల తళుకులు చేరినందుకేమో
23. ప్రేమ యుద్దంలో మనిద్దరమే.... గెలుపైనా ఓటమైనా ఒకటే
24. మౌనం ఉలిక్కి పడింది_తన మనసు నీకు తెలిసిపోయిందని
25. అమృతమే దాచుకున్న అమ్మ నీకుంటే _కాగితాల నోట్ల కట్టలెందుకు
26. అలల తాకిడికి తెలుసులే_ప్రేమ సాగరం మనసు

21, జనవరి 2015, బుధవారం

ఏక్ తారలు....!!

20/1/15
1. ఏకాంతం నాకిష్టమంటే_ నా ఏకాంతమే నీదంటే  ఎలా
2. జ్ఞాపకం మరుగున పడిపోయిందనుకున్నా_జీవితమే నీవని తెలియక
3. మదిలోని చీకటి సేదదీరుతోంది_అమాసపొద్దు తనతో సహవాసం అని
4. లెక్కల్లో ఎప్పుడు వెనుకే_నీ జపం చేస్తూ
5. చినుకు అలికిడి వినిపించలేదు_చిత్తమే జడివానగా మారే నీ తలపుల్లో
6. ఎదురు చూస్తోంది చీకటి_జాబిలమ్మకు సెలవెప్పుడా అని
7. రమ్మని పిలవాలా_అనుకోని అతిధిలా అలరించు
8. ఏకాంతాల పయనం_మనసు దోచిన జ్ఞాపకాల కడకే
9. ఆవిరయినా ఆనంద బాష్పాలే కదా_ఊహల విరి జల్లులు
10. మనసు పుస్తకంలో ప్రతి అక్షరమూ నీదే_ఇక ముఖ చిత్ర చింత ఏలా
11. జ్ఞాపకపు పుటలు పదిలమే_మనసు గదిలో గాయాల మాటున
12. వాస్తవంలో లేకున్నా_వర్తమానంలో జ్ఞాపకంగా మిగిలాము కదా
13. తరాల తారలు వెలుగుతున్నాయి_ఒకే తార పక్కన
14. నా మనసు మాటాడింది_నీ మదిలో అలజడితో_అందుకే ఈ తడి
15. అటు ఇటు రెండు ఉండగా_ఒంటరి భావనేలా
16. కన్నీటి ఊహలైనందుకేమో_వాస్తవంలో ఉన్నా బెరుకుగానే ఉన్నాయి
17.  అమృతాన్ని గ్రోలిందేమో_అమత్వాన్ని అందుకుంది ఈ ప్రేమ
18. గోతిలో పడ్డావేమో_ఓ సారి బయటికి వచ్చి చూడరాదూ 
19. అల్ప సంతోషులే ఈ మహరాణులు_మగ మహారాజుల మోసాల్లో చిక్కి
20. పడిపోయానులే అని కొట్టుకుపోతే ఎలా_లేచే ప్రయత్నం చేయరాదూ
21. హితాన్ని సన్నిహితంగా చూడు_కాకిలో కోకిల కనిపించదూ
22. వందల్లో పర్వాలేదు_వేల వేల తలపుల్లో తడుతూ ఉంటే లెక్క తప్పదూ
23. అనంతమై నన్ను చుట్టేసావు_ఆలింగనంలో ముల్లోకాలు చూపిస్తూ
24. రాతిరినే మరిచింది_రెప్ప పడితే నీ రూపాన్ని ఏమార్చుతుందని
25. తడిచే భావాల పడవలో_తలపుల వేడి సంతకాలతో మనిద్దరం
26. చీకటిలో వెలుగు సంతకం_నీ చిరునవ్వుతో 
27. మారాజుల  మాయలో చిక్కి_అమాయకత్వాన్ని ఆభరణమనుకునే మారాణి
28.  పుష్ప విలాసం వికసించింది_నీ ప్రణయ ప్రబంధానికి ఆకృతిగా మారినందుకు
29. తడి పొడి తంటాలే_తలపుల్లో తేలియాడుతూ
30.  వార్ధక్యానికి చేయూత_వదలి వేసిన జ్ఞాపకపు నీడలే
31.  స్నేహమంటు కలిపింది_మదిలో దాచిన ప్రేమను
32. లెక్కకు రాని తారల్లో_ఎక్కడో రాలి పడిన ఓ తారను
33. తలపుల మెరుపు అది_నీలో దాగిన నా వలపు తళుకులా
34. ఇది మల్లెల వేళయని...  ఆ దారిలో వసంతం కూడానేమో
35. అల్లుకున్న లతలు విడివడుతున్నాయి_వలపుల పూలు పూయక

20, జనవరి 2015, మంగళవారం

ఈ ముద్రాక్షరాలను...!!

నేస్తం ...
               ఒకప్పుడు తెరచిన పుస్తకమే అయినా ఇప్పుడు మూసుకుపోయి మౌనంగానే రోదిస్తోంది... ఆనందంగా మొదలైన కొత్త పుస్తకంలో లోనికి తొంగి చూస్తే కొన్ని పేజీల్లో అక్షరాలు కనిపించక మనసే కనిపించింది... ఆ మనసు చదివి కొన్ని జ్ఞాపకాల గాయాల బంధాలను ఊరడించే శక్తిని అందుకోవాలని ఆ అక్షరాలలోనే అది వెదుక్కుంటూ  చివరి వరకు ఏక బిగిన చదువుతూనే ఉండిపోయిన పుస్తకం కూడా ఇదేనేమో... ఎందుకో కొన్ని పేజీల్లో అక్షరాలు కినుక వహించినట్టుగా అనిపించినా అది కూడా అందమైన అర్దాలంకారంగా అమరింది... తీరాన్ని తాకిన అలకు ఎంత సంతోషమో... ఈ మనసు పుస్తకంలోని ప్రతి అక్షరానికి అంతే ఆనందం... తన నిర్దేశ గమ్యానికి చేరిన సంకేతానికి గుర్తుగా ప్రతి పేజిలోని పదానికి రాలిపడుతున్న ఈ మనసాక్షరాలను అందుకోవాలని ఎంత కోరికో... కన్నీటి తడితో తడచిన అక్షరానికి ఆ కన్నీటి చినుకు తపన హృదయపు పొరలను దాటుకుని కనురెప్పలను చేరిన వైనం తెలుసు... అందుకేనేమో ఎప్పుడు ఆ రెప్పల మాటునే దాగి మనసు పొరలను చెమ్మగానే మిగిల్చింది... సంద్రాన్ని తలపిస్తూ... గుండె కోతను తట్టుకుంటూ చెరగని శిలాక్షరాలను చెక్కుతూ తెలియని గమ్యాన్ని చేరుకోవాలన్న దిశా నిర్దేశాన్ని లక్ష్యంగా మార్చుకుని సాగుతున్నపుస్తకంలోని ప్రతి పేజి ఓ మౌన తరంగమే... ఎప్పుడో మొదలైనా నిన్నా   మొన్న చూసినట్లుగానే అనిపిస్తూ ఎప్పటికప్పుడు కొత్త హంగులను దిద్దుకుంటున్న జీవిత పుస్తకానికి జన్మ చందాను కానుకగా అర్పిస్తూ..... ఈ జన్మకు నెలవైన ఈ ముద్రాక్షరాలను ముచ్చటగా శెలవు కోరుతూ....
ఉండనా నేస్తం...

నిశబ్దం బద్దలైంది...!!

నిశబ్దం బద్దలైంది ఒక్కసారిగా
గొంతు దాటి రాలేని మాటలను
మూటగట్టిన కుహనా వాదాలను
చూస్తూ ఓర్చుకొనలేక....
రాలిన కన్నీళ్ళను లెక్కగట్టలేక
మాసిన బతుకుల మచ్చలను
దాయలేని చిరుగుల బొంతలను
కప్పుకున్న జీవితాలను
పహరా కాస్తూ ఉండలేక ...
జ్ఞాపకాల్లో తడిసిన మనసు మౌనాన్ని
గుంభనంగా ఉంచాలని చేస్తున్న
మధ్య తరగతి ప్రయత్నాన్ని 
ఆసాంతము తిలకిస్తూ ...
అహానికి ఆయుధంగా మారిన
ధన దాహాన్ని భరించలేక
ముడుచుకున్న అభిమానాన్ని
స్పృశిస్తూ  గుప్పెటలో మూసిన
విస్పోటనాన్ని వదిలేస్తూ...
నిశబ్ద సంకేతాల జయకేతనం
రెప రెపలాడుతోంది...!!

పాలకడలి పరవశించె....!!




పాలకడలి పరవశించె జగన్నాధుని పవళింపు సేవలో శ్రీదేవి సహితముగా

ఆరవ పుట్టినరోజు....!!

2009 జనవరిలో మా ఉప్పల రాజ్యలక్ష్మి చారిటబుల్ ట్రస్టు కోసం మొదలు పెట్టిన ఈ బ్లాగుల పరిచయం అలా అలా పెరిగి తీపి చేదు కలయికల .... కబుర్లు కాకరకాయలతో చేరి ఇంతింతై వటుడింతై అన్నట్టు... కబుర్లు, కవితలు, జ్ఞాపకాలు..... ఇలా నా  మనసు పుస్తకంలోని అన్ని భావనలు కలిపి 2015 జనవరి నాటికి 1011 పోస్ట్ లుగా రూపు దిద్దుకున్న ఈ అక్షరాల భారాన్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా నమస్సులు... ఐదు పుట్టినరోజులు జరుపుకుని ఆరవ పుట్టినరోజుకి అడుగిడిన నా ఈ కబుర్లు కాకరకాయలు... మీ అందరి ఆదరాభిమానాలను అందుకోవాలని కోరుకుంటూ.... మీ కబుర్లు కాకరకాయలు 

18, జనవరి 2015, ఆదివారం

తెలుగు సాహితీ ముచ్చట్లు ... పదునారవ భాగం....!!

వారం వారం మనం చెప్పుకుంటున్న తెలుగు సాహితీ ముచ్చట్లలో ఈ వారం తిక్కన యుగం గురించిన వివరణ చూసి తరువాత మన అందరికి ఇష్టమైన ఆటవెలది గురించి చూద్దాము... కవిత్రయంలో ఒకరైన తిక్కన సోమయాజి మహాభారత తెలుగు అనువాదంలో తనదైన శైలిలో తెలుగు భాషకు తరగని వన్నెలద్దినారు.

1225 - 1320 : తిక్కన యుగము  

తెలుగు సాహిత్యంలో 1225 నుండి 1320 వరకు తిక్కన యుగము అంటారు. నన్నయతో ఆరంభమైన తెలుగు సాహితీ వైభవాన్ని శివకవులు ఇనుమడింపజేశారు. తరువాత కాకతీయుల పాలనలో ఆంధ్రదేశమంతా ఒక సామ్రాజ్యంగా ఏర్పడడంతో తెలుగు సాహిత్యం సుస్థిరమైన సాంస్కృతిక వారసత్వాన్ని పుణికిపుచ్చుకోగలిగింది. కవిత్రయంలో రెండవవాడైన తిక్కన సోమయాజి ఈ యుగానికి ప్రధానకవిగా గుర్తింపు పొందాడు.
ఈ యుగంలో పురాణ ఖండాలు, వచన కావ్యాలు, ప్రాకృత నాటకాలు ప్రబంధీకరింపబడడం మొదలయ్యింది. శతక కవిత్వం వర్ధిల్లింది. శైవ కవిత్వంలో ఉన్న పరమతదూషణ, స్వమత మౌఢ్యత తగ్గాయి. ఎక్కుగా ప్రబొధాత్మక రచనలు వెలువడినాయి.

రాజకీయ, సామాజిక వేపధ్యం

తీరాంధ్రంలో తెలుగు సాహిత్యానికి తొలి పలుకులు పలికిన వేంగి రాజ్యం క్రీ.శ. 624లో ప్రారంభమై, 1075లో అంతరించింది. తెలంగాణ ప్రాంతం అంతవరకు బాదామి చాళుక్యులకు, రాష్ట్రకూటులకు యుద్ధభూమిగా కల్లోలితమై ఉంది. తెలంగాణంలో ఆరంభమైన కాకతీయ వంశము ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రాంతమును క్రీ. శ. 1083 నుండి క్రీ. శ. 1323 వరకు పరిపాలించిన రాజవంశము. కాకతీయులు ఆంధ్రదేశాన్ని అంతటిని ఒకే త్రాటిపైకి తెచ్చి పరిపాలించారు. శాతవాహనుల అనంతరం ఆంధ్రదేశాన్ని,జాతినీ సమైక్యం చేసి, ఏకచ్ఛత్రాధిత్యం క్రిందికి తెచ్చిన హైందవ రాజవంశీయులు కాకతీయులొక్కరే. వీరి రాజధాని ఓరుగల్లు (నేటి వరంగల్).

అంతకుముందు తీరాంధ్ర ప్రాంతాన్ని కొణిదెన చోళులు, నెల్లూరు చోడులు పాలించారు. కడప ప్రాంతాన్ని రేవాటి చోళులు, కోనసీమను హైహయ రాజులు, నిడదవోలును వేంగి చాళుక్య చోళులు, కొల్లేరు ప్రాంతాన్ని తెలుగు నాయకులు, విజయవాడను చాగివారు, ధరణికోటను కోటవారు, కొండవీడును కమ్మ నాయకులు, పల్నాటిని హైహయ వంశపు రాజులు పాలిస్తుండేవారు. ఈ చిన్న చిన్న రాజ్యాల మధ్య తగాదాలు వైషమ్యాలు సర్వ సాధారణం. క్రీ. శ. 1176-1182 మధ్యకాలంలో కారెంపూడి వద్ద జరిగిన పల్నాటి యుద్ధంలో జరిగిన అపారమైన జన, ఆస్తి నష్టం వల్ల తీరాంధ్ర రాజ్యాలన్నీ శక్తిహీనములయ్యాయి. సమాజం కకావికలయ్యింది. బలం కలిగిన పాలకులు లేకపోతే జరిగే కష్టం ప్రజలకు అవగతమయ్యింది. ఈ పరిస్థితిలో ఓరుగల్లు కాకతీయులకు రాజులందరినీ ఓడించడం అంత కష్టం కాలేదు. ఆంధ్ర దేశాన్ని తమ పాలనలో ఐక్యం చేసే అవకాశం వారికి లభించింది.

కాకతీయులు శైవమతస్థులే కాని వీరశైవాన్ని అనుసరించలేదు. అనగా కాకతీయులు వైష్ణవులను బాధించలేదు. (అయితే వారికాలంలో జైనులపై జరిగిన అత్యాచారాలను వారు నిరోధించలేకపోయారని తెలుస్తుంది). అయితే సమాజంలో శైవులకు, వైష్ణవులకు మధ్య విభేదాలు పెచ్చరిల్లి ఉన్నాయి. పలనాటి యుద్ధానికి ఇది కూడా ఒక కారణం. తిక్కనకు ముందు కాలంలో శివకవులు సృజించిన వీరశైవ సాహిత్యం సమాజాన్ని చాలా ప్రభావితం చేసింది. శైవేతరులు బహుశా ఆ సాహిత్యాన్ని ఏవగించుకొని ఉండవచ్చును కూడాను కాని అందుకు ప్రతిసాహిత్యాన్ని సృజించినట్లు లేదు. ఈ నేపధ్యంలో "భిన్న మతముల యొక్కయు, భిన్న దైవతముల యొక్కయు అవధులను దాటి తాత్వికమైన పరమార్ధమును గ్రహించి, దానిని కాలానుగుణమైన గ్రంధసృష్టి ద్వారా ప్రజలకు బోధింపగల మహాకవి ఆవిర్భావము ఆవశ్యకమైయుండును. మృ వైషమ్యములను అణచివేయు శక్తి ఒక్క అద్వైతమునకే యుండును. ఆ పరమ ధర్మమును శాస్త్రముల ద్వారా బోధిస్తే జనబాహుళ్యానికి రుచింపకపోవచ్చును. ఇలాంటి పరిస్థితిలో ధర్మాన్ని బోధింపగలిగిన మహాకవి తిక్కన ధర్మాద్వైతములను బోధించి జాతిని ఉద్ధరింపగలిగిన మహాపురుషుడయ్యాడు. తెలుగులో ఏ కవికి రాని చారిత్రిక ప్రాముఖ్యత తిక్కనకు లభించింది."

ఈ యుగంలో భాష లక్షణాలు

శివకవుల కాలంలో ద్విపద రచనకు, దేశి కవితకు ప్రాముఖ్యత పెరిగింది. మతంతో సంబంధం లేకుండా సాహిత్యాన్ని సేవింపగలిగే పరిస్థితి కొరవడినందువలన శివకవులును, భవికవులును పరస్పరము గర్హించుకొనసాగారు. సంస్కృతాభిమానులకు, దేశి కవితాభిమానులకు వైషమ్యాలు పెరిగాయి. ఇలాంటి నేపధ్యంలోనే "ఉభయ కవిమిత్రుడు" అనే బిరుదు తిక్కన సాధించగలిగాడు.

ముఖ్య కవులు, రచనలు

ఈ యుగంలో మొట్టమొదట వెలువడిన గ్రంధం గోనబుద్ధారెడ్డి రచించిన రంగనాధ రామాయణము. ఈ కవి పాల్కురికి సోమనాధునికి ఇంచుమించు సమకాలికుడు. రంగనాధ రామాయణం చక్కని ద్విపద కావ్యం. ఆయన రచించిన రంగనాథ రామాయణం తెలుగులో తొలి రామాయణంగా ఖ్యాతి పొందడమే కాక పూర్వపు సంప్రదాయ పాఠ్యప్రణాళికలో కవిత్రయ భారతం, పోతన భాగవతంతో పాటుగా కలిసివుండేది. బుద్ధారెడ్డి వ్రాస్తూ యుద్ధకాండ తర్వాత ఇతిహాసాన్ని వదిలిపెట్టడంతో మిగిలిన రచనను అతని దాయాది బుద్ధారెడ్డి కుమారులు కాచనాథుడు, విఠలనాథుడు పూర్తిచేశారు. గోనబుద్ధారెడ్డి అనంతరం యగకవి తిక్కన సోమయాజి నిర్వచనోత్తర రామాయణాన్ని రచించి, అ తరువాత మహాభారతం 15 పర్వాలను ఆంధ్రీకరించాడు. కొట్టరువు తిక్కన కార్యదక్షుడైన మంత్రి, ఖడ్గ నిపుణుడైన శూరుడు, కావ్య నిర్మాత అయిన కవి, ధర్మోపదేష్ట అయిన ఆచార్యుడు, తత్వజ్ఞాన సంపన్నుడైన ఆధ్యాత్మిక సాధకుడు. ఈ మహానుభావుడు ఆంధ్రజాతి పుణ్యవశమున అవతరించినాడని చెప్పవచ్చును అని పింగళి లక్ష్మీకాంతం వ్రాశాడు. తిక్కన 1205-1210 మధ్యకాలములో జన్మించి ఉండవచ్చును. 1288లో మరణించాడు.
తిక్కన సమకాలికుడైన కేతన తన దశకుమార చరిత్రను తిక్కనకే అంకితమిచ్చాడు. కేతన వ్రాసిన ఆంధ్రభాషా భూషణం తెలుగులో మొట్టమొదటి లక్షణ గ్రంధం. గోనబుద్ధారెడ్డి కుమారులైన కాచవిభుడు, విట్ఠలుడు అనే సోదరులు తమ తండ్రి రచనయైన రంగనాధరామాయణమునకు ఉత్తరకాండమును రచించి ఆ గ్రంధాన్ని పూర్తి చేశారు. మంచన అనే కవి కేయూరబాహుచరిత్రను రచించాడు. యథావాక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకం రచించాడు. తిక్కన శిష్యుడైన మారన మార్కండేయ పురాణాన్ని వ్రాశాడు. బద్దెన నీతిసార ముక్తావళి వ్రాశాడు. ఈ బద్దెనయే సుమతీ శతకం కూడా వ్రాసాడని అభిప్రాయం ఉంది కాని అది నిరూపితం కాలేదు. శివదేవయ్య, అప్పన మంత్రి, అధర్వణుడు ఈ కాలపు కవులే కావచ్చును.
13వ శతాబ్దిలో జరిగిన ఆంధ్రోద్యమ నఫలమే తిక్కన గారి భారతము. ఆనాడు వారు నాటిన విత్తనమే తరువాత వృక్షమైనది.

ఈ వారం ఆటవెలది గురించిన వివరణ...
ఆటవెలది
ఆటవెలది తెలుగు ఛందస్సులో ఒకానొక ఉప జాతి పద్యరీతి.

లక్షణములు

  • సూత్రము:
ఆ. ఇనగణ త్రయంబు నింద్ర ద్వయంబును
హంస పంచకంబు ఆటవెలది.
  • ఇందు నాలుగు పాదములుంటాయి.
  • 1, 3 పాదాలు మెదట 3 సూర్య గణాలు తరువాత 2 ఇంద్ర గణాలు కలిగి ఉంటాయి.
    2,4 పాదాలు 5 సూర్య గణాలు ఉంటాయి.
  • ప్రతి పాదములొ నాల్గవ గణం మొదటి అక్షరం యతి
  • ప్రాసయతి చెల్లును
  • ప్రాస నియమం లేదు. ప్రాసయతి చెల్లును.

ఆటవెలది పద్య లక్షణములు

  1. ఉపజాతి రకానికి చెందినది
  2. 10 నుండి 17 అక్షరములు ఉండును.
  3. 4 పాదములు ఉండును.
  4. ప్రాస నియమం లేదు
  5. ప్రాస యతి నియమం కలదు
  6. ప్రతి పాదమునందు 4 వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము
  7. గణ లక్షణాలు :
    1. ఒకటవ పాదమునందు మూడు సూర్య , రెండు ఇంద్ర గణములుండును.
    2. రెండవ పాదమునందు ఐదు సూర్య గణములుండును.
    3. మూడవ పాదమునందు మూడు సూర్య , రెండు ఇంద్ర గణములుండును.
    4. నాలుగవ పాదమునందు ఐదు సూర్య గణములుండును.


ఉదాహరణలు
'విశ్వదాభిరామ వినుర వేమ' అనే మకుటంతో ఆంధ్రులకు చిరపరిచితములైన వేమన పద్యాలన్నీ ఆటవెలదులే.
ఉదా:

ఉప్పుకప్పురంబు ఒక్కపోలికనుండు,

చూడచూడ రుచుల జాడవేరు,

పురుషులందు పుణ్యపురుషులు వేరయా

విశ్వదాభిరామ వినుర వేమ.


అనువుగానిచోట అధికులమనరాదు

కొంచెముండుటెల్ల కొదువగాదు

కొండ అద్దమందు కొంచెమై యుండదా

విశ్వదాభిరామ వినురవేమ.

రామహేశు నాదు నవ్యక్తు నధ్యాత్మ
యోగగమ్ము బూర్ణు నున్న తాత్ము
బ్రహ్మ మైన వాని బరుని నతీంద్రియు
నీశు స్థూలు సూక్ష్ము నే భజింతు.

నెఱి నసత్య మనెడి నీడతో వెలుగుచు
నుండు నెక్కటికి మహోత్తరునకు
నిఖిల కారణునకు, నిష్కారణునకు న
మస్కరింతు నన్ను మనుచు కొఱకు.

సేకరణ : వికీపీడియా నుండి 
వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో.....

9, జనవరి 2015, శుక్రవారం

నన్ను నే వదిలేసుకున్నా....!!

ఆత్మీయంగా చెంత చేరితే
అందమైన జ్ఞాపకానివనుకున్నా

విషాదాన్ని నా ముందుంచితే 
చెలిమికి చిరునామావనుకున్నా

నా మనసుతో ఆటలాడితే
తెలిసి తెలియని తొందరనుకున్నా

నువ్వెళిపోతూ ఒంటరిని చేస్తే
ఏకాంతాన్ని తోడిచ్చావని సంబరపడ్డా

నవ్వులన్ని నీతో తీసుకెళిపోతే
కన్నీటిని నాకుంచావని సరిపెట్టుకున్నా

రెప్ప పడితే కనుమరుగౌతావని
కలలనే కనుమరుగు కమ్మని ఆదేశించా

వెన్నెలంతా నువ్వెత్తుకెళితే
చీకటే నా చుట్టమని సరిపెట్టుకున్నా

నా జీవాన్ని నువ్వు తీసుకుంటే
నువ్వే నా జీవితమని నన్ను నే వదిలేసుకున్నా....!!

ఏక్ తారలు...!!

09/1/15
1. కోపం శాపంగా మారింది_నీ దురాన్ని తట్టుకోలేక
2. జ్ఞాపకాలన్నీ నీతోనే వచ్చేసాయి_నాతో ఒక్కటి ఉండనంటూ
3. మౌనం పలకరించింది_నువ్వు లేవని తెలిసింది కాబోలు
4. అభిమానం అలిగి పుట్టింటికి వెళ్ళింది_నీ ఆత్మీయతను నాతో ఉంచేసి
5. విరజాజుల విసుర్లు చూసి_సన్నజాజులు సరసాలాడుతున్నాయి
6. పల్లెంతా బోసిపోయింది_తన ముంగిట్లో పండుగ సందడి కానరాక  
7. ఆత్మీయత తలొంచుకుంది_నటించే అనుబంధాల్లో ప్రేమలు చూడలేక

ఏక్ తారలు....!!

8/1/15
1.  క్షణాలే పంపించాయి_ నీ చూపుల సెగలకు తాళ లేక
2. రత్నాల రంగును పులుముకున్నావుగా_సింధూరపు ముత్యమౌతూ
3. పరితపించే పరిచారికను_మోహానికి మధువునద్దుతూ
4. రూపాలెన్నున్నా _సర్వేశ్వరుడొక్కడే
5. శ్రవణానందమే_వినిపించే ప్రతి నాదం ఇష్టమైతే
6. ఆ చిలిపితనానికే_గోపికాలోలునికి దాసోహం జగమంతా
7.  పల్లెలే వదిలేసాయి_ఇక పట్నమెక్కడ రమ్మంటుంది ధనుర్మాసపు సందడిని
8. ఎన్ని దెబ్బలు తిన్నా ఆనందమే_అందరి ఆకలి తీర్చే అన్నపూర్ణమ్మ తానేనని
9. ఒక్క పువ్వు లేదేంటా అనుకున్నా _నీ కలల పరిమళాలుగా మారాయని తెలీక
10. నాలో నువ్వున్నావని ఎరుగక_నన్నే నాకు పరిచయం చేస్తున్నాయి మళ్ళి మళ్ళి
11. మామిడి పిందెలను చూస్తుంటే _పసితనమెందుకు పారిపోయిందని దిగులేసింది
12. మంచులా నీ మనసెంత చల్లన_ముక్కలైనా తపిస్తోంది నా కోసం
13. అమ్మ ప్రేమే పెట్టని ఆభరణం_జన్మ జన్మలకు
14. ప్రేమ పరిమళం పదిలం _పది కాలాలు దాటినా
15. పిడికిట్లో దాచి_ప్రాణమే నేనంటే ఎలా నమ్మేది
16. రేయంతా మెలకువే_చుక్కలన్నీ నీ కోసం కాపలా కాస్తుంటే
17. బెదరిపోకు ఓటమిని చూసి_విజయానికి సోపానంగా మార్చుకో
18. మదినిండిన ఆత్మాభిమానం_వ్యక్తిత్వానికి పెట్టని ఆభరణమే ఈ అహం
19. నిరీక్షణ హాలాహలం తరువాతే_ప్రేమామృతం దొరికేది 

తల్లడిల్లే....!!



తల్లడిల్లే మదినూరడించ కన్నీరు చెక్కిళ్ళను ముద్దాడి నీకు నేనున్నాని సేదదీర్చే ...

తెలుగు సాహితీ ముచ్చట్లు ... పదునైదవ భాగం....!!

మన తెలుగు సాహితీ ముచ్చట్లలో వారం వారం కాస్త తెలుగు సాహిత్యంతో పాటు పద్యాలకు గల ముఖ్య లక్షణమైన ఛందస్సులోని కొన్ని లక్షణాలను తెలుసుకుంటున్నాము కదా... ముందుగా ఈ వారం తెలుగు సాహిత్యంలో నన్నయ యుగము తరువాతి యుగమైన శివకవి యుగము గురించి కొద్దిగా చూద్దాము... 

1100 - 1225 : శివకవి యుగము

నన్నయ తరువాతికాలంలో ముఖ్యమైన సామాజిక, మత సంస్కరణలు చోటు చేసుకొన్నాయి. వీరశైవము భక్తిమార్గము ప్రబలమై ఎన్నో కావ్యాలకు కారణమైనది.

రాజకీయ, సామాజిక వేపధ్యం

ఈ సమయానికి చాళుక్యచోళరాజ్యం క్షీణదశకు చేరుకొంది. తెలంగాణ ప్రాంతంలో పశ్చిమ చాళుక్యుల, రాష్ట్రకూటుల బలం అధికంగా ఉంది. తీరాంధ్రంలో సరైన కేంద్ర పాలన కొరవడిందని, వేంగి రాజ్యంలో రాష్ట్రకూటులు, పశ్చిమ చాళుక్యులు, చోళులు ఎడతెరిపి లేకుండా యుద్ధాలు జరిపారని తెలుస్తుంది. ఈ సమయంలో చాళుక్యులకు సామంతులుగా ఉండిన కాకతీయులు స్వతంత్రులై తెలంగాణ ప్రాంతంలో బలపడసాగారు.

సాంస్కృతికంగా అప్పటికి బౌద్ధం, జైనం బాగా బలహీనపడ్డాయి. శైవం, వీరశైవం విజతంభించాయి. శైవులు బౌద్ధ , జైనాలనే కాక వైదిక విధానాలను కూడా నిరసించారు. శివుడు తప్ప వేరు దైవము లేదని, శివారాధన చేయనివానిని మన్నింపతగదని వాదించారు. వారికి వాఙ్మయం కూడా మతబోధనకు మార్గం తప్ప దానికి వేరు లక్ష్యం లేదు.

 ముఖ్య కవులు, రచనలు
ఈ యుగానికి చెందిన నన్నెచోడుడు, మల్లికార్జున పండితారాధ్యుడు, పాల్కురికి సోమనాధుడు అనే కవులను శైవ కవిత్రయంగా పేర్కొంటారు. శ్రీపతి పండితుడు, శివలెంక మంచన, యథావాక్కుల అన్నమయ్య కూడా శివకవులే. శివకవులలో శైవాభిమానం, దేశికవితాభిమానం, శైలీస్వేచ్ఛ ముఖ్య లక్షణాలు. క్రీ.శ. 1160 కాలానికి చెందిన నన్నెచోడుడు కుమార సంభవం రచించాడు. నన్నయ కంటే నన్నెచోడుడు ముందువాడని మానవల్లి రామకృష్ణకవి వాదించాడు కాని ఆ వాదం నిలబడలేదు. పాల్కురికి సోమనాధుడు 1160-1230 కాలంవాడు కావచ్చును. ఇతడు తెలుగు, సంస్కృతం, కన్నడ భాషలలో గొప్ప పండితుడు. ఇతని రచనలలో అనుభవ సారము, బసవ పురాణము, పండితారాధ్య చరిత్ర, వృషాధిప శతకం, చతుర్వేద సారం అనేవి మాత్రం లభించాయి. శతక వాఙ్మయంలో లమకు లభిస్తున్న మొట్ట మొదటి శతకంగా వృషాధిప శతకాన్ని పేర్కొంటారు. మల్లికార్జున పండితారాధ్యుడు చాలా గ్రంధాలు వ్రాసి ఉండాలికాని శివతత్వ సారము మాత్రం లభిస్తున్నది. మిగిలిన కొన్న గ్రంధాల కర్తృత్వం స్పష్టంగా తెలియరావడంలేదు.

1133-1198 మధ్యకాలంలో ఓరుగల్లును పాళించిన కాకతీయరాజు ప్రతాప రుద్రుడు "నీతి సారము" అనే గ్రంధాన్ని రచించాడని భావిస్తున్నారు. చక్రపాణి రంగన కూడా ఈ యుగంలోనివాడు కాని, తిక్కన యుగంలోనివాడు కాని కావచ్చును.

జాను తెనుగు

నన్నెచోడుడు మొట్టమొదటిసారిగా "జాను తెనుగు", వస్తు కవిత" అనే పదాలను వాడాడు. జాను తెనుగు అంటే ఏమిటనే విషయంపై పండితుల మధ్య చాలా చర్చలు జరిగాయి. కన్నడంలో "జాణ్ణుడి" (చమత్కారమైన నుడి) అనే పదం నుండి "జాను కవిత" అనే ప్రయోగం వచ్చిందని ఒక అభిప్రాయం. "జాను" అనగా ఇంపైన, అందమైన, స్పష్టమైన భావం కల తెలుగు అని కొందరన్నారు. అందరి అభిప్రాయాలను క్రోడీకరించి జి.నాగయ్య చెప్పిన నిర్వచనం - "తెలుగు భాషలో స్వభావసిద్ధంగా వాడే సంస్కృత సమాసాలను జనసామాన్యంలో వాడబడే దేశిదాలతో అన్వయించి, అన్వయ క్లిష్టత లేకుండా మంజులమై, సరసమై, ప్రసన్నమైన తెలుగు జాను తెనుగు"
జాను తెనుగును వాడిన వారిలో రెండవవాడు లింగాయతకవి పాల్కూరికి సోమనాధుడు.
ప్రాచీనులెవ్వరూ దీని అర్ధమును నిర్వచించలేదు. వాజ్మయమునందలి ప్రయోగముల మూలమున దీని అర్ధమును తెలుసొకోవాలే తప్ప. కాని యిట్టి ప్రయోగములు యెన్నియో లెవు. లభ్యమైన ఆంధ్ర గ్రంధములలో మూడునాలుగు మాత్రమే కానవచ్చుచున్నవి. ఇందొకటి నన్నెచోడుడి కుమారసంభవము లోనిది.
                     సరళముగా భావములు జానుదెనుంగున నింపుపెంపుతో 
                     బిరిగొన వర్ణనల్ ఫణితివేర్కొన నర్ధము లొత్తగిల్ల బం
                     ధురముగ బ్రాణముల్ మధుమృదుత్వరసంబున గందళింప న
                     క్షరములు సూక్తు లార్యులకు గర్ణరసాయనలీల గ్రాలగాన్.         [కుమారసంభవము,1-35]
ఇందు నన్నెచోడుడు తాను కావ్యమును జానుతెనుంగున రచియించెదనని చెప్పెనేకాని ఆ జానుతెనుగు స్వభావమెట్టిదో తెలియపరచలేదు.
మరి మూడు ప్రయోగములు పాల్కూరికి సోమనాధుని గ్రంధములనుండి:
                   ఉరుతరగద్యపద్యోక్తులకంటే-సరసమై పరగిన జానుదెనుంగు 
                   చర్చించగా సర్వసామాన్యమగుట- గూర్చెద ద్విపదల గోర్కేదైవార    [బసవపురాణము పుట-5]
                   ఆరూఢగద్యపద్యాదిప్రబంధ-పూరిత సంస్కృతభూయిష్ఠరచన 
                   మానుగా సర్వసామాన్యంబుగామి- జానుదెనుగు విశేషము బ్రసన్నతకు. [ప్రండితారాధ్యచరిత్ర, దీక్షాప్రకరణము పుట-18]
ఈ ద్విపదలవలన గద్యపద్యాది ప్రబంధ సంస్కృత భూయిష్టము గానిది జానుదెనుగు అని బోధపడుచున్నది. ఇంతేకాదు; వృషాధిశతకమున జానుదెనుగు స్వభావమిట్టిదని ఈ క్రిది పద్యములో పాల్కూరి చెప్పినాడు.
                   బలుపొడతోలు సీరయును బాపసరుల్ గిలుపారు కన్ను వె 
                   న్నెలతల సేదుకుత్తుకయు నిండిన వేలుపుటేరు వల్గుపూ 
                   సల గల ఱేని లెంకనని జానుదెనుంగున విన్నవించెదన్
                   వలపు మదిం దలిర్ప బసవా బసవా వృషాధిపా.
కావున పాల్కూరికి సోముని మతమున జానుదెనుగు అనగ అచ్చ తెలుగుఅని తెలియవచ్చుచున్నది.
జానుదెనుగు సమస్తపదము. జాను+తెనుగు అను రెండుమాటల కలయిక వల్ల యేర్పడినది. దీనియందలి తెనుగు భాషానామము; జాను శబ్ద మా భాషా స్వభావమును దెలుపుచున్నది. జాను శబ్దము దేశ్య శబ్దమని కొందరి అభిప్రాయము. ఇది జ్ఞాశబ్దభవ మనియు; 'జాణ' కు తోబుట్టువని అందురు. దీనికి 'అందము', 'సౌందర్యము' అని అర్ధము. అందువలన జానుదెనుగు అనగా సొంపైన, లేక నుడికారము గల తెనుగని అంవయించుకోవచ్చును. తెనుగు కవులు జానుదెనుగును ప్రశంసించినట్లు కర్ణాటకులు 'జాణ్ణుడి' ని (జానుకన్నడము) ప్రశంసించియున్నారు.
కర్ణాటక 'జాణ్ణుడి' యే జానుదెనుగునకు మతృక అని కొదరు తలిచెదరు. తెనుగున కావ్య రచన లేనికాలమున నూతనాంధ్ర కావ్యనిర్మాణమునకు గడంగిన నన్నెచోడుడు కర్ణాటక వాజ్మయమునుండి పెక్కు విషయములను గ్రహించినట్లు 'జాణ్ణుడి' గొని దానిని జానుదెనుగుగా మార్చెననియు, నతని గ్రంధములనుండి పాల్కూరికి సోముడు గ్రహించెనని తలిచెదరు.

ఇక ఈ వారం మన ఛందస్సులో ఈ క్రింది వివరణలు చూద్దాము...

పద్యము తెలుగు కవితా రచనలో ఒక విధానము. పురాతన తెలుగు రచనలు ఎక్కువగా పద్యరూపంలోనే ఉన్నాయి. పద్యంలోని ముఖ్య లక్షణం ఛందస్సు..

పద్యాలను వ్రాయడానికి ఉపయోగించే విధానాన్ని ఛందస్సు అంటారు. ఛందస్సును మొట్టమొదట సంస్కృతములో రచించిన వేదాలలో ఉపయోగించారు. వేదముల యొక్క అంగములనబడు ఆరు వేదాంగములలో ఛందస్సు ఒకటి. వేదత్రయాన్ని ఛందస్సు అని కూడ అంటారు. ఋగ్వేదము మరియు సామవేదము సంపూర్ణముగా పద్య (శ్లోక) రూపములో నున్నవి. యజుర్వేదములో గద్యము కూడ ఉన్నది. సామవేదమంతయూ ఛందస్సేనని పండితుల అభిప్రాయము. బ్రహ్మవిష్ణుశివులలాగా ప్రతి మంత్రానికీ ఋషి, ఛందస్సు, దేవత త్రిమూర్తులని భావిస్తారు. కావ్య నిర్మాణానికి వాడబడునది ఛందస్సు.

తెలుగు ఛందస్సు

పాదాది నియమములు గలిగిన పద్య లక్షణములను తెలుపుంది చందస్సు అనబడును. తెలుగు ఛందస్సు, సంస్కృత ఛందస్సు పై ఆధార పడి అభివృద్ధి చెందినది. సంస్కృత ఛందస్సులోని వృత్తాలతో బాటు జాతులు, ఉపజాతులు తెలుగులోని ప్రత్యేకతలు. ఆధునిక పాఠకులు, లేఖకులు, నవ కవులు, విప్లవ కవులు ఛందస్సు పురాతనమైనదని, ప్రగతి నిరోధకమని భావించినా కొన్ని సినిమా పాటలలో, శ్రీ శ్రీ గేయాలలో మాత్రా ఛందస్సును చూడవచ్చు. 

గణాలు

గణాలు అనగా, రెండు లేక అంత కంటే ఎక్కువ అక్షరాల గురు లఘు నిర్ణయాన్ని బట్టి వాటిని ఏదో ఒక (గ్రూపు)విభాగము లో ఉంచుతారు, దీనినే ఏదో ఒక గణము అని అంటారు.

రెండక్షరాల గణాలు

మొత్తము ఉన్నవి రెండు రకాల అక్షరాలు గురువు, లఘువు; రెండక్షరాల గణాలు మొత్తము నాలుగు వస్తాయి (బైనరీ 0, 1 కాంబినేషన్లు తీసుకున్న 00, 01, 10, 11 వచ్చినట్లు) ఆ నాలుగు రెండక్షరాల గణాలు:
  1. లల II ఉదా: రమ, క్రమ, సమ, ధన, అన్నీ కూడా లల గణములు
  2. లగ IU ఉదా: రమా
  3. గల UI ఉదా: అన్న, అమ్మ, కృష్ణ
  4. గగ UU ఉదా: రంరం, సంతాన్

మూడక్షరాల గణాలు

ఇవి మూడక్షరాల కలయికలతో ఏర్పడేవి (బైనరీ 0, 1, తీసుకున్న 000, 001, 010, 011, 100, 101, 110, 111) కింది వాక్యాన్ని మననం చేసుకుంటూ వీటిని సులువుగా గుర్తుంచుకోవచ్చు. య మా తా రా జ భా న స ల గం గణం కావాలంటే పై వాక్యంలో తో మొదలుపెట్టి వరుసగా మూడక్షరాల గురు లఘువులను గుర్తిస్తే యగణం అవుతుంది. య తో మొదలుపెట్టి మూడక్షరాలు: య మా తా - లఘువు, గురువు, గురువు IUU అలాగే రా తో మొదలుపెట్టి మూడక్షరాలు (రా జ భా - UIU) రగణం అవుతుంది. ఈ విధంగా అన్ని గణాలను గుర్తుంచుకోవచ్చు
అన్ని గణాలు:
  1. ఆది గురువు గణము UII
  2. మధ్య గురువు గణము IUI
  3. అంత్య గురువు గణము IIU
  4. సర్వ లఘువులు గణము III
  5. ఆది లఘువు గణము IUU
  6. మధ్య లఘువు గణము UIU
  7. అంత్య లఘువు గణము UUI
  8. సర్వ గురువులు గణము UUU
ఇవి మూడక్షరముల గణములు

ఉపగణాలు

ఉప గణములు అనగా పైవాటి సమ్మేళనం లో ఏర్పడేవి. ఇవి మూడు రకములు
  1. సూర్య గణములు
    1. న = న = III
    2. హ = గల = UI
  2. ఇంద్ర గణములు
    1. నగ = IIIU
    2. సల = IIUI
    3. నల = IIII
    4. భ = UII
    5. ర = UIU
    6. త = UUI
      3. చంద్ర గణములు
  1. భల = UIII
  2. భగరు = UIIU
  3. తల = UUII
  4. తగ = UUIU
  5. మలఘ = UUUI
  6. నలల = IIIII
  7. నగగ = IIIUU
  8. నవ = IIIIU
  9. సహ = IIIUI
  10. సవ = IIUIU
  11. సగగ = IIUUU
  12. నహ = IIIUI
  13. రగురు = UIUU
  14. నల = IIII

పద్యం ఒక తెలుగు సాహితీ ప్రక్రియ. పద్యాలు వృత్తాలు కావొచ్చు, జాతులు కావొచ్చు, ఉపజాతులు కావొచ్చు. ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మత్తేభము, మున్నగునవి వృత్తాలు. కందము, ఉత్సాహ, ద్విపద, తరువోజ, అక్కర, మున్నగునవి జాతులు. సీసము, తేటగీతి, ఆటవెలది అనునవి ఉపజాతులు.
మనము వృత్తాల గురించి, జాతుల గురించి కొన్ని వివరాలు చూసాము. ఈ వారం ఉపజాతుఅల గురించిన వివరణలు చూద్దాము...

మొదటగా తేటగీతి ...
తేనెలొలుకు తెనుగు పద్యము తేటగీతిగా వెలుగు
"సూర్యుడొక్కరుండు సురరాజులిద్దరు
దినకరద్వయంబు తేటగీతి"

తేటగీతి పద్య లక్షణములు

  1. ఉపజాతి రకానికి చెందినది
  2. 12 నుండి 17 అక్షరములు ఉండును.
  3. 4 పాదములు ఉండును.
  4. ప్రాస నియమం లేదు
  5. ప్రాస యతి నియమం కలదు
  6. ప్రతి పాదమునందు 4 వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము
  7. ప్రతి పాదమునందు ఒక సూర్య , రెండు ఇంద్ర , రెండు సూర్య గణములుండును.
  8. ఉదాహరణలు:
    1. దేవదేవుని చింతించు దినము దినము;
      చక్రహస్తునిఁ బ్రకటించు చదువు చదువు;
      కుంభినీధవుఁ జెప్పెడి గురుఁడు గురుఁడు;
      తండ్రి! హరిఁ జేరు మనియెడి తండ్రి తండ్రి.
    2. అరసి నిర్గుణబ్రహ్మంబు నాశ్రయించి
      విధినిషేధ నివృత్తి సద్విమలమతులు
      సేయుచుందురు హరిగుణచింతనములు
      మానసంబుల నేప్రొద్దు మానవేంద్ర!
    3. మంద గొందల మంద నమందవృష్టిఁ,
      గ్రందుకొనుఁ డంచు నింద్రుండు మందలింపఁ
      జండపవన సముద్ధూత చటుల విలయ
      సమయ సంవర్త కాభీల జలధరములు.
    4. భద్రమగుఁగాక! నీకు నో! పద్మగర్భ!
      వరము నిపు డిత్తు నెఱిఁగింపు వాంఛితంబు;
      దేవదేవుఁడ నగు నస్మదీయ పాద
      దర్శనం బవధి విపత్తిదశల కనఘ!
    5. చేతులారంగ శివునిఁ బూజింపఁడేని
      నోరు నొవ్వంగ హరికీర్తి నుడువఁడేని
      దయయు సత్యంబు లోనుగాఁ దలఁపఁడేనిఁ
      గలుగ నేటికిఁ దల్లుల కడుపుఁ జేటు.
    6. క్షితిని గోశంబు లరసి వీక్షింపవలయుఁ
      బిదప నాలింపఁజనును గోవిదులఁ బ్రశ్న
      సేయఁదగుఁ గడుమదిని యోచింపుటొప్పు
      నెచట నెఱుఁగనిచో నేరమెంచఁగూడ
      దనుచు నే భావి లోకుల నభినుతింతు. 

ఆటవెలది, సీసముల గురించిన వివరణలు వచ్చే వారం చూద్దాము....
సేకరణ : వికీపీడియా నుండి 
వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో.....

8, జనవరి 2015, గురువారం

ఏక్ తారలు...!!

7/1/15
1. నిర్లిప్తత చుట్టంలా వచ్చింది_నువ్వు లేవని తెలిసిందేమో
2. అహం నా అలకారమయ్యింది_ఆత్మాభిమానాన్ని ఆసరాగా చేసుకుని
3. మరో జీవితం_డబ్బుకు దాసోహమై కన్నప్రేమకు సమాధి కడుతూ
4. నమ్మకానికి నిలువ నీడ లేకుండా పోయింది_నిజాయితీ చెట్లన్నీ తెగ నరకబడి పోతుంటే
5. తీరం చేరువనే ఉంటూ_గమ్యం తెలియదంటే ఎలా
6. ప్రేమ వర్షంలో_రగిలిన కుతకుతలు మలయ సమీరాలే
7. అధికారమే అలకారంగా_దోపిడే సంపాదనగా ఈ నాయకులు
8. వలపు మహిమ_చల్లని వేళ వేడి సెగలతో
9. జ్ఞాపకాల ఓదార్పులే_కాలంతో పాటుగా పయనిస్తూ
10. ఆర్భాటానికెప్పుడు అవకరమే_అన్ని ఉన్న విస్తరి అణిగి ఉన్నా
11. ప్రపంచాన్ని చుట్టే నువ్వు_ఒక చోటే ఉండి పోతానంటే ఎలా
12. పదాల పరిచయం తప్ప_అణువంత తెలియని సామాన్యురాలిని

7, జనవరి 2015, బుధవారం

మాలికలు...!!

1. మౌనం తడబడింది మాలికలు
   నీ మాటల అలికిడికి ఉలికిపడి
2. రాగం మూగబోయింది
  అపస్వరాలను తాళలేక
3. చీకటి దుప్పటి చుట్టేసింది
  చుక్కల వెలుగులో నువ్వు  నాకు దొరికిపోతావని

ఏక్ తారలు..!!

5/1/15
1. చెలియల కట్ట చెల్లాచెదురయ్యింది_చేరని చెలియ సన్నిధికి పరితపిస్తూ
2. జ్ఞాపకం బోరుమంది_నీ గతంలో లేనందుకు
3. గాయాలన్నీ ఎదురు చూస్తున్నాయి_మరపు లేపనాన్ని ఎప్పుడు పూస్తానా అని
4. ముద్దబంతులన్నీ అలిగాయి_తమ ముగ్ధత్వాన్ని నువ్వు తీసుకున్నావని
5. మనసెందుకో మాటాడనంటోంది_నీ మనసులో చోటు లేదనేమో

ఏక్ తారలు...!!

6/1/15
1. కుదురుగా ఉండనిస్తే కదా_కలసిన అలల తాకిడి
2. మంచు కురుస్తూనే ఉంది_నీ జ్ఞాపకాలు నాతో ఉన్నంత చల్లగా
3. జ్ఞాపకాల అరలన్నీ నీతోనే_నన్ను కూడా తోసేసి
4. కలలన్ని వెళిపోయాయి_నువ్వు రాకుండానే తెల్లారిందని చెప్తూ
5. వయ్యారాలు ఒలకబోస్తోంది_తనతో సాటి మరెవరు లేరని కాబోలు
6. అక్షరాలు చేతనమయ్యాయి_బాధలను ఓర్చుకుంటూ
7. మరో కర్ణుని జననం_మోహాన్ని ప్రేమనుకుని
8. నమ్మకం మోసపోయింది_స్నేహంలో అపశ్రుతులను చూడక 
9. తలపులన్ని మధురాలే_మౌనం మాట్లాడితే
10. నిద్రకు నీతో పనిలేదట_మరో చోటుకు తరలి వెళ్ళింది
11. ఎదురు చూపుల చురకత్తులు గుచ్చుకుంటున్నాయి_పదే పదే అలా గుచ్చకు
12. అర్దాల పరమార్ధం_ నీ కెరుకని నాకు తెలియునులే
13. తొలి వలపు మాయ_ఈ జగాన్ని మరిపించే మోహంలో
14. మది పల్లవి విరచితమే_అనుభూతుల అక్షర మాలికకు
15. ముంగిట్లో ముగ్గులు_ముద్దబంతిని ఓదారుస్తున్నాయి
16. విరజల్లిన భావాలే_కవితా కన్నెకు అలంకారాలుగా
17. ఆచేతనంలో చైతన్యం_నీ జ్ఞాపకాలే
18. కోపానికెప్పుడు ఆత్రమే_కన్నీటిని దాచేయాలని
19. ఎక్కడ పసిడి తొడుగు అడుగుతానోనని_మూగనోము రోజు చేయమంటే ఎలా

మంచు కురిసే వేళ.... !!

మంచు కురిసే వేళ మనసు మురిసి
మౌనరాగాలు అలఓకగా ఎద పలుకగా
విరిసిన మంచు ముత్యాల పూలతేరుల
విరి పానుపు పాల సంద్రాన్ని మరిపించగా
శరత్తు సంతకాలు చేసిన చామంతుల సందడికి 
హేమతంలో అడుగిడిన ముద్ద బంతులు ముచ్చట్లు చెప్తూ
శీతలానికి చేరువగా చేరికైన చెలి వయ్యారాలు
హిమాపాతంలో గ్రీష్మ తాపాన్ని మదిలో రేకెత్తించగా
తెలి మంచులో తేలియాడిన సంకురాతిరి సంబరాలు
హేమంతపు అలసటలో మునిగి శిశిరానికి చోటిస్తూ
వసంతంలో మొగ్గలేసే మల్లెల గుభాళింపులో మైమరచి
రాలుతున్న జ్ఞాపకాలను దాటి కొత్త చివురులేసే
ఆనందాలకు స్వాగతాలు పలుకుతూ
మురుస్తోంది ఈ మంచు కురిసే వేళ.... !!

ఒక చిన్న మాట ...!!

ఏ సమూహంలో అయినా కవితా పోటీలు పెట్టినప్పుడు న్యాయ నిర్ణయం అనేది ఏక పక్షంగానో లేదా వ్యక్తుల పేర్లు చూసి కాని, గొప్ప కవులని కాని చూడరు... న్యాయ నిర్ణేతలు ఎవరైనా కవితలను ఒకటికి నాలుగైదు సార్లు చదువుకునే ఎంపిక చేస్తారు... సమయ లేదని కాని.. పెద్ద కవితలను చదవకుండా వదిలేయడం కాని జరగదు... ఒకరు భావానికి ప్రాధాన్యతనిస్తే మరొకరు భాషకు, ఇంకొకరు భావంతో పాటుగా పదాల ఎంపికకు మరొకరు కవితలోని కొత్తదనానికి ఇలా నిర్ణయాలు తీసుకుంటారు...ఇక్కడ న్యాయ నిర్ణేతగా ఉండటానికి అర్హత నిర్ణయించేది సముహ నిర్వాహకులు... ఈ అర్హత ఎవరికీ వారు ఆపాదించుకుంటే వచ్చేది కాదు. 

న్యాయ నిర్ణయాన్ని చెప్పేంత గొప్పదాన్ని కాకపోవచ్చు కాని నేను న్యాయ నిర్ణేతగా ఉన్న సమయంలో నా మనసుకు నచ్చిన వాటినే ఎంపిక చేసాను... నాకు నచ్చినవి మరొకరికి నచ్చాలని నిబంధన ఏమి లేదు.... నాకు నచ్చిన కవిత ఎందుకు నచ్చిందో  నేను చెప్పగలిగితే నా న్యాయ నిర్ణయం సరి అయినదే అవుతుంది... మీకు అందరికి తెలియాలని చెప్తున్నా ఈ రోజు ఈ విషయాలు ...

సాహితీ సేవలో ఒకసారి నేను న్యాయ నిర్ణేతగా ఉన్నాను... మరోసారి ప్రాధంక న్యాయ నిర్ణేతగా కూడా ఉన్నాను ... ఏదైనా నా దృష్టిలో ఒకటే... కవితను చదువుతాము కాని కవిత రాసినవాళ్ళు ఎంత గొప్పవారైనా అక్కడ అప్రస్తుతం... నచ్చిన అంశాలు పరిగణలోనికి తీసుకుని ఫలితాలు పంపేస్తాము..తరువాత మరో ఇద్దరు న్యాయ నిర్ణేతలు వారి వారి ఫలితాలు ఇచ్చి .. ఆ తరువాత అందరు చర్చించి ఏకాభిప్రాయానికి వస్తారు.... ఇవి అన్ని జరగడానికి ఎంత సమయం పడుతుంది అని విజ్ఞులైన మీకు చెప్పనవసరం లేదు... ఇక్కడ న్యాయ నిర్ణేతలకు కాని సముహ నిర్వాహకులకు కాని ఒరిగేదేమీ ఉండదు... మన అమ్మ భాష మీద పెంచుకున్న మమకారం తప్ప... పోటికి రాసే ప్రతి ఒక్కరు తమ కవిత ప్రధమ స్థానంలోనే ఉండాలని కోరుకుంటారు... నేనైనా అంతే... మన కవిత న్యాయ నిర్ణేతలను మొదటిసారి చదవగానే మెప్పించేదిగా ఉండాలి.... కవితలు రాయడంలో దిట్టలైన అనుభవజ్ఞులకు తెలియని విషయం కాదు ఇది... ఇక భాషాలోపాలు అంటారా ఒక్కోసారి చిన్నవే అని వదిలేస్తారు... తప్పులు లేకుండా రాసినంత మాత్రాన గొప్ప కవిత అవదు కదండీ...

సాహితీ సేవలో ఫలితాలు ప్రకటించిన రోజునే న్యాయ నిర్ణేతలతో ముఖా ముఖి రెండు గంటల పాటు ఏర్పాటు చేశారు... న్యాయ నిర్ణయంలో పాలుపంచుకున్న ఐదుగురు న్యాయ నిర్ణేతలు చర్చలో పాల్గొన్నారు... నాకు తెలిసి ఏ కవితా పోటిలకు ఇలా ఫలితాల తరువాత చర్చ జరగలేదు... సభ్యులకు సందేహ నివృత్తి చేయడానికి మరో రెండు రోజుల తరువాత కూడా ముగిసిన చర్చను మళ్ళి కొనసాగించారు...ఆ చర్చ చూసిన వారికి న్యాయ నిర్ణయం ఎలా జరిగిందో తెలుస్తుంది..

మనకు ఒక్కరికి నచ్చినంత మాత్రాన మనం రాసిన కవిత గొప్పదైపోదు... పది మందితో చదివించుకున్న కవిత ఎప్పటికి గొప్పదే నా దృష్టిలో... తప్పులు దొర్లడం మానవ సహజం అండి... మనం నేర్చుకోవాల్సింది..ఒకరి తప్పులు ఎంచే ముందు మనం తప్పులు లేకుండా... అర్ధవంతంగా  రాయగలగడం ... తెలియని వారు భాష మీద పట్టు లేని వారు రాస్తే అర్ధం ఉంది... సాహిత్యంలో, పురాణాలలో పండిపోయి కూడా తప్పులు రాస్తూ, అర్ధం లేకుండా కవితలు రాస్తుంటే వారిని ఎలా అర్ధం చేసుకోవాలి... ఎవరమైనా ఒకటి గుర్తు పెట్టుకోవాలి... మనం ఒక వేలు ఎదుటి వారికి చూపిస్తే మన నాలుగు వేళ్ళు మన వంకే చూపుతాయి...


సాహిత్యంలో ఇప్పుడిప్పుడే నడకలు నేర్చుకుంటున్న మాలాంటి వాళ్లకు చక్కని మీ సద్విమర్శలతో స్వాగతం పలకండి .. మీ అనుభవ పాఠాలు మాకు పంచండి.. తప్పులను సరిదిద్దండి... అక్షరాలకు అండగా నిలవండి... నడవలేక పడిపోతుంటే ఆసరా ఇవ్వండి.. మా తప్పులను మన్నించి పెద్ద మనసుతో మీ దీవెనలు మాకు అందించండి... 
నా ఈ పోస్ట్ తో ఎవరినైనా నొప్పిస్తే పెద్ద మనసుతో మన్నించండి...
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner