అవధానం అనేది తెలుగు సాహిత్యం లో ఒక విశిష్ట ప్రక్రియ. సంస్కృతం, తెలుగు కాకుండా వేరే ఏ భాష లోనూ ఈ ప్రక్రియ ఉన్నట్లు కనపడదు. క్లిష్టమైన సాహితీ సమస్యలను అలవోకగా పరిష్కరిస్తూ, చమత్కార పూరణలను అవలీలగా పూరిస్తూ, అసంబధ్ధ, అసందర్భ ప్రశ్నలను సమర్ధంగా ఎదుర్కొంటూ, ఆశువుగా పద్యాలు చెప్తూ - వీటన్నిటినీ ఏక కాలంలో - అవధాని చేసే సాహితీ విన్యాసమే అవధానం.
అవధానం స్వరూపం
కవి యొక్క ఆశుకవిత్వ గరిమకు, సాహితీ పటిమకు, ధారణా శక్తి (గుర్తుంచుకోగల శక్తి, memorising ability)కి పాండితీ ప్రకర్షకు అవధానం అత్యున్నత పరీక్ష. సాంప్రదాయికంగా జరిగే అష్టావధానం లో 8 మంది పృఛ్ఛకులు (ప్రశ్నలు అడిగే వారు) అవధాని చుట్టూ చేరి వివిధ రకాలైన ప్రశ్నలు (పాండిత్యాన్ని పరీక్షించేవి కొన్ని, అవధాని సహనాన్ని పరీక్షించేవి మరి కొన్ని) అడుగుతూ ఉంటారు. పృఛ్ఛకులు కూడా పాండిత్య పరంగా ఉద్దండులైన వారే ఉంటారు.ఎందరో కవి పండితులు అవధాన ప్రక్రియను జయప్రదంగా చేసి పండితుల మన్ననలను పొందారు. అవధానం విజయవంతంగా చేసిన వారిని అవధాని అని అంటారు. ఏక కాలంలో తెలుగు, సంస్కృతం - రెండు భాషల లోనూ అవధానం చేసిన పండితులు ఉన్నారు. అవధానాలు చాలా రకాలు. ముఖ్యంగా అవధానాలను వేదసంబంధ, సాహిత్య, సాహిత్యేతర అవధానాలుగా వర్గీకరించవచ్చు.
- వేదసంబంధ అవధానాలు: స్వరావధానం, అక్షరావధానం .
- సాహిత్య అవధానాలు: అష్టావధానం, శతావధానం, సహస్రావధానం... ఇలా 20దాకా ఉన్నాయి.
- సాహిత్యేతర అవధానాలు: శతకలశావధానం, శభ్దావధానం, రామాయణ, భగవద్గీత అవధానాలు. ఇవి ధారణ సంబంధమైనవి. అంటే ఒక్కసారి చదివి లేదా విని గుర్తుంచుకోవడం ద్వారా మళ్లీ చెప్పేవి.
- సాంకేతిక అవధానాలు: నేత్రావధానం, అంగుష్టావధానం మొదలగునవి.
- శాస్త్ర సంబంధ అవధానాలు: గణితావధానం, జ్యోతిషావధానం, వైద్యావధానం, అక్షరగణితావధానం .
- కళా సంబంధ అవధానాలు: చిత్రకళావధానం, నాట్యావధానం, సంగీతాష్టావధానం, చతురంగావధానం, ధ్వన్యవధానం .
అష్టావధానము
ఇందు ఎనిమిది ప్రక్రియలు ఒకేసారి చెయ్యవలెను, కనీస సమయము నాలుగు గంటలు. ఆ ఎనిమిది ప్రక్రియలు- కావ్య పాఠము
- కవిత్వము
- శాస్త్రార్థము
- ఆకాశపురాణము
- లోకాభిరామాయణము
- వ్యస్తాక్షరి (లేదా) న్యస్తాక్షరి
- చదరంగము
- పుష్ప గణనము
అష్టావధానములో ఇవ్వబడిన ఎనిమిది అంశాలలో స్వల్ప తేడాలుంటాయి. వాటిని - వాటి వివరణను గమనించండీ.
- 1.నిషిద్ధాక్షరి
నిషిద్ధాక్షరి విభాగంలో అవధానిని - శ, ష, స, హ - లను ఉపయోగించకుండా శివుని పై ఒక పద్యాన్ని చెప్పమనగా అవధాని గారు ఇలా చెప్పారు.
డమరుకమును మ్రోగించుచు నమరించెను మానవులకు ' అఆ ' మాలన్ కమనీయముగా వ్రాయగ నుమతోడుగ నున్న వాని నుద్ధతి గొలుతున్.
- 2. న్యస్తాక్షరి
- 3.దత్తపది
- 4.సమస్యా పూరణం.
- 5. వర్ణన
- 6. ఆశువు
7.పురాణ పఠనం:
వృచ్ఛకుడు పురాణం, ఇతిహాసం, ప్రబందం, కావ్యం ఇలాంటి గ్రంధాలలో ఒక ప్రథాన ఘట్టాలలో నుండి ఏదైనా ఒకటి రెండు పద్యాలను చదివి వినిపిస్తాడు అవధానిగారికి. అవధానిగారు ఆ పద్యాలను విని ..... ఆ పద్యాలు ఏ గ్రంథంలోనివి, ఆ గ్రంథ కర్త ఎవరు? ఆ సందర్బమేది వంటి విషయాలు.... పురాణ పక్కీలో చెప్పాలి... అవధాని గారు ఆ విషయాన్ని గురించి ఆలోచిస్తుండగా....... మరో వృచ్ఛకుడు మరో ప్రశ్న సందిస్తాడు. అవదానిగారు అతన్ని 'కొంత సేపు ఆగు ' అని అనకుండా అతని ప్రశ్న వినడానికి సిద్ధ పడాలి.
8.అప్రస్తుత ప్రసంగం:
పైన చెప్పిన సమస్యలు అవధాని గారి జ్ఞాపక శక్తికి, అతని ధారణా శక్తిని పరీక్షించేవి. ఆ యా విషయాల గురించి తీవ్రంగా అలోచిస్తూ వుండగా ఈ వృచ్ఛకుడు ప్రస్తుత విషయానికి పూర్తిగా విరుద్ధమైన విషయాన్ని గురించి ఒక కొంటె ప్రశ్న సందిస్త్గాడు. ఉదాహరణకు...... అవధానిగారూ..... నిన్న ఇదే సమయానికి మీరెక్కడున్నారు..... ఏమి చేస్తున్నారు చెప్పండి అంటాడు. దానికి సమాధానంగా అవధానిగారు మామూలుగా అడిగిన దానికి సమాధానము చెప్పడము కాదు... ఆ కొంటె ప్రశ్నకి సమాధానం మరింత కొంటెగా సభాసధులందరూ ఆహా అని మెచ్చుకునే టట్లు సమాధానం చెప్పాలి.
- వివరాలు
ఆ విధంగా అన్ని నియమాలతో పద్యాలు చెప్పడం ఒక్ ఎత్తైతే నాలుగు రౌండ్లు పూర్తవగానే ఆ పద్యాలన్నిటినీ ధారణ చేసి అదే క్రమంలో ఏక ధాటిగా వాటిని అపొపగించడం మరో ఎత్తు. ఇదే ఈ అవధాన కార్య క్రమంలో గొప్పవిషయం. అలా అష్టావధాన కార్య క్రమం చాల కోలాహలంగా ఆనంద భరితంగా ముగుస్తుంది.
3 సమస్యా పూరణం అన్న పై విషయంలో కప్పను జూడంగ పాము గజగజ లాడేన్. ఇది అసమజమైనది. (అనగా కప్పను చూడగా పాము గజగజ లాడి భయపడు. ఆ ఆర్థాన్ని మార్పు చేసూ అక్షరాలను ఏమాత్రము మార్చకుండా పూరించాలి) అనే పద్య పాదాన్ని పూర్వం ఒక సమస్యగా ఇచ్చారు ఒక అవధాని గారికి. దానికి అవధానిగారు పూరించిన సమాదానము పూర్తి పద్యం లోని భావం చూడండి. వెంకప్ప అనే రైతు తన పొలంవద్ద నున్న కుప్పలకు కావలికై వెళుతూ ఒక కర్రను, కిర్రు చెప్పులును ధరించి వెళుతుంటే అతన్ని చూసి అనగా వెంకప్పను జూడంగ పాము గజగజ లాడెన్. ఈ పూరణ ఎంత అద్భుతంగా వుందో.......
4.పువ్వులు విసురుట: అవధాన కార్యక్రమము జరుగుతుండగా ఒకరు అవదాని పైకి అప్పుడప్పుడు ఒక్క పువ్వును విసురు తాడు. అవధానం పూర్తి కాగానే తనపైకి ఎన్ని పువ్వులు విసిరారో గుర్తు పెట్టుకొని ఖచ్చితమైన సమాధానం చెప్పాలి అవధాని గారు.
6. గంటలు కొట్టుట. అవధానం జరుగుతున్నప్పుడు ఒకరు గంట కొడుతుంటాడు. అవధానం పూర్తవగానె., అతను ఎన్ని గంటలు కొట్టాడొ గుర్తు పెట్టుకొని అవధాని గారు చెప్పాలి. పువ్వులు విసరటం , గంటలు కొట్టటం అనే రెండు అంశాలు రెండు వుండవు. ఈ రెంటి వుద్దేశం ఒక్కటే గాన ఏదో ఒక్కటే వుంటుంది. అది కూడ పైన చెప్పిన ఎనిమిది అంశాలలో ఒకదాని బదులుగా ఈ రెంటిలో ఒక్క దాన్ని వుంచు తారు. ఎలాదైనా ఎనిమిది అంశాలుండాలి అది ని భందన.
శతావధానము
సహస్రావధానము
ద్వి సహస్రావధానము
త్రి సహస్రావధానము
నాట్యావధానము
గణితావధానము
ఘంటావధానము
నేత్రావధానము, అంగుష్టావధానము, అక్షరముష్టికావధానం
ఇందులో ఇద్దరు అవధానులు ఎదురెదురుగా కూర్చుని ఉంటారు. పృచ్ఛకులు మొదటి అవధానికి ఒక కాగితంపై విషయం వ్రాసి ఇస్తారు. అతడు దానిని చదివి రెండవ అవధానికి తన కనుసైగల ద్వారా చెప్పాలి. దాన్ని ఆయన అర్థం చేసుకుని బయటకు చదవాలి. ఇలా చేయడానికి ఆ జంట తెలుగులో ప్రతి అక్షరానికి ఒక్కో గుర్తును పెట్టుకుంటారు. తిరుపతి వేంకట కవులు, కొప్పరపు కవులు ఈ నేత్రావధానంలో సిద్దహస్తులు.కళ్లతో కాకుండా బొటనవేలితో భావాలను చెప్పితే అది అంగుష్టావధానం, పిడికిలితో చేస్తే అక్షరముష్టికావధానం. ఇంకా పుష్పావధానం, ఖడ్గావధానం, గమనావధానం... లాంటివి 13దాకా ఉన్నాయి. వీటిని సాంకేతిక అవధానాలు అంటారు.
ఇలాంటి అవధానాలను చేయడానికి జంట అవధానులు తప్పనిసరి. అది ఆ ఇద్దరికి మాత్రమే సాధ్యమవుతుంది. వారిలో ఎవరు లేకపోయినా రెండోవారు మరొకరితో కలసి చేయలేరు.
అష్టావధానం లోని ప్రక్రియలు
పుష్ప గణనము
పుష్ప గణనము అనగా అవధానికి తగిలేలా అప్పుడప్పుడు పుష్పాలు విసురుతుంటారు. ఆయన ఆ పూల సంఖ్యను లెక్కించి మొత్తం ఎన్ని పూలు విసిరారో చివరలో చెప్పాల్సి ఉంటుంది.ఆశువు
ఆశువు లేదా ఆశుకవిత్వం. ఇది ప్రజలను విశేషంగా ఆకర్షించే ప్రక్రియ. అగ్గిపుల్ల నుంచి అంతరిక్షం దాకా దేని మీదనైనా ఆశువు గా పద్యమో దండకమో చెప్పమంటారు పృచ్ఛకులు. అవధాని చతురత, ధార ఇక్కడ ప్రదర్శించాల్సి ఉంటుంది.నిషిద్ధాక్షరి
నిషిద్ధాక్షరి అంటే పృచ్ఛకుడు ముందుగానే ఏయే అక్షరాలు నిషిద్ధమో నిర్దేశిస్తాడు. ఉదాహరణకు, మేడసాని మోహన్ ను ఒకసారి క, చ, ట, త, ప అనే అక్షరాలు లేకుండా సీతాకల్యాణం గురించి చెప్పమన్నారు. ఆయన ఈ విధంగా చెప్పాడు.సరసనిధిరామభద్రుడు
ధరణిజ ఎదలోన మధుర ధారణుడయ్యెన్
సురలెల్ల హర్షమందిరి
విరాజమాన సువిలాస విభవ మెసగిన్
నిర్దిష్టాక్షరి
నిర్దిష్టాక్షరి అనగా నిర్దేశించబడిన అక్షరాలు గలదని అర్థం. దీనిలో 32 గళ్లుంటాయి. పృచ్ఛకుడు బేసి స్థానాల్లో గానీ, సరి స్థానాల్లో గాని ఇష్టానుసారం అక్షరాలను వ్రాసి ఇస్తాడు. అవధాని మిగిలిన ఖాళీలను పూరించి కోరిన దేవతా స్తుతిని పూర్తి చేస్తాడు.ఘంటా గణనం
ఘంటా గణనం అనగా అప్పుడప్పుడు గంట కొడుతుంటారు. అవధాని ఆ సంఖ్యను లెక్కించి మొత్తం ఎన్ని గంటలు కొట్టారో చివరలో చెప్పాల్సి ఉంటుంది.అప్రస్తుత ప్రసంగం
అవధాని ఏకాగ్రతను చెడగొట్టడానికి అప్రస్తుత ప్రసంగి (పృచ్ఛకులలో ఒకరు) చేయని ప్రయత్నం ఉండదు. ఉదాహరణకు ఒక సభలో ఒకాయన "అవధాని గారూ, భర్త భోజనం చేస్తున్నాడు భార్య వడ్డిస్తోంది. భర్త పశువ అన్నాడు. భార్య కోతి అంది. వారి మాటల్లో ఆంతర్యమేమిటి" అని అడిగారు. దానికి అవధాని... "పళ్లెం నిండా శుభ్రంగా వడ్డించవే" అని భర్త అంటే "కోరినంత తినండి" అని భార్య జవాబిచ్చింది అని చెప్పాడు. "హనుమంతుని తోక పెద్దదా-ద్రౌపది కోక పెద్దదా" వంటివి మరికొన్ని ఉదాహరణలు. అవధాని, అప్రస్తుత ప్రసంగి విసిరే ఛలోక్తులూ చెణుకులకు తడుముకోకుండా చెప్పగలిగితేనే సభ శోభిస్తుంది. ఎందుకంటే, పద్యాలూ ఛందస్సుల గురించి తెలియని వారిని ఆకట్టుకునేది ఈ అప్రస్తుత ప్రసంగమే.శతావధాన సహస్రావధానాలలో సాధారణంగా ఉండే అంశాలలో కొన్ని....1. సమస్యాపూరణం 2.దత్త పది 3.వర్ణన 4.ఆశువు 5.నిషిద్ధాక్షరి 6.నిర్దిష్టాక్షరి 7.వ్యస్తాక్షరి 8.న్యస్తాక్షరి 9.చందోభాషణం 10.పురాణ పఠనం 11.శాస్త్రార్థము 12.ఏకసంథా గ్రహ్ణం 13.వివ్ర్గాక్షరి 14.అనువాదం 15.చిత్రాక్షరి 16.అక్షర విన్యాసం 17.స్వీయ కవితా గానం 18.వార గణనం 19.పంచాంగ గణనం 20.పుష్ప గణనం 21.ఘంటా గణనం 22.అప్రస్తుత ప్రసంగం 23.కావ్యానుకరణం 24.సంగీతం 25.మీ ప్రశ్నకు నా పాట మొదలగునవి.
కొందరు అవధానులు
- అవధాని జగన్నాథ పండిత రాయలు మొఘల్ చక్రవర్తి షాజహాన్ నే తన ధారణా శక్తితో మెప్పించిన దిట్ట.
- అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు (1864-1945)
- తిరుపతి వేంకట కవులు గా ప్రసిద్ధులైన జంటకవులు దివాకర్ల తిరుపతి శాస్త్రి (1871-1919) మరియు చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి (1870-1950) - వీరు అవధాన ప్రక్రియకు తమ కాలంలో జీవం పోసి ఎనలేని ప్రజాదరణ సాధించారు. వీరి పాండిత్యాన్ని, చమత్కార చతురతను గూర్చి ఇప్పటికీ సాహితీ ప్రియులు కథలు కథలుగా చెప్పుకొంటారు.
- కొప్పరపు సోదర కవులు - (కొప్పురపు వేంకట సుబ్బరాయ కవి, వేంకట రమణ కవి) తిరుపతి వేంకట కవుల సమకాలీనులు. మెరుపు వేగంతో పద్యాలను అల్లడం వీరి ప్రత్యేకత.
- వేంకట రామకృష్ణ కవులు - తిరుపతి వేంకట కవుల సమకాలీనులు
- పిసుపాటి చిదంబరశాస్త్రి - 1930-40 లలోని గొప్ప అవధానులలో ఒకడు
- వేంకట రామకృష్ణ కవులు - ప్రఖ్యాత జంట కవులు
- రాజశేఖర వేంకట కవులు - ప్రఖ్యాత జంట కవులు
- పల్నాటి సోదరులు - ప్రఖ్యాత జంట కవులు
- దేవులపల్లి సోదర కవులు - వీరు ముగ్గురు
ఆధునిక కాలంలో
- డాక్టర్ గరికిపాటి నరసింహారావు . వేయి మంది పృచ్ఛకులతో అవధానం చేసి మహా సహస్రావధాని అనీ, ముందు చెప్పిన వేలాది పద్యాలు క్రమంలో మళ్ళీ చెప్పి ధారణా బ్రహ్మ రాక్షసుడు అనీ బిరుదులు పొందాడు.
- దూపాటి సంపత్కుమారాచార్య 1932 మే 18 న ఓరుగల్లు పట్టణంలో జన్మించారు. వీరి తల్లి ప్రఖ్యాతి గాంచిన కవయిత్రి శ్రీమతి శేషమ్మ గారు. తండ్రి శేషాచార్యులు గారు. వీరు ప్రాథమిక విద్యను వరంగల్లు లోను, మచిలీపట్నం లోను పూర్తి చేసి, ఎస్.ఎస్.ఎల్.సి ని మాత్రం పాలకొల్లు లో పూర్తి చేశారు. ఆ తర్వాత 1962 లో హన్మకొండ లో బి.ఏడ్. శిక్షణను పూర్తి చేశారు. వీరు 1965 వ సంవత్సరంలో ఉస్మానియా విశ్వ విద్యాలయం నుండి ప్రవేటుగా చచివి తెలుగులో ఎం.ఏ పట్టాను పొందారు. ద్విశతావధానిగా ప్రఖ్యాతి వహించిన రాళ్ళబండి కవితా ప్రసాద్ గారి వద్ద సంపత్కుమారు గారు అవధానము చేయుటలో వున్న మెళుకువలు, రహస్యాలను నేర్చుకున్నారు. వీరు రెండు వందలకు పైగా అష్టావధానాలు చేసిన ప్రముఖులు.
- డాక్టర్ మేడసాని కృష్ణమోహన్. (జననం ఏప్రిల్ 19, 1954) అష్టావధానాలు, శతావధానాలు, ఒక సహస్రావధానం చేశాడు. ఇటీవలే పంచసహస్రావధానం నిర్వహించి సాహితీ చరిత్రలో అపూర్వ ఘట్టాన్ని సాక్షాత్కరింపచేశాడు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ గా సేవలందిస్తున్నాడు.
- డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ. తెలుగులోను, సంస్కృతంలోను కూడా అవధానాలు నిర్వహించగల దిట్ట.
- కడిమెళ్ల వరప్రసాద్. పలు అష్టావధానాలు, శతావధానాలే కాక అవధాన ప్రక్రియలో శిష్యుడు కోట లక్ష్మీనరసింహంతో కలిసి జంట సహస్రావధానం కూడా నిర్వహించారు. అవధానులుగా రాణిస్తున్న కోట లక్ష్మీనరసింహం, వద్దిపత్తి పద్మాకర్ లకు అవధాన ప్రక్రియ నేర్పి తీర్చిదిద్ది "గురు సహస్రావధాని"గా పేరొందారు.
- = సురభి శంకర శర్మ. తెలుగులోను, సంస్కృతంలోను కూడా అవధానాలు నిర్వహించగల దిట్ట.
- అష్టకల నరసింహరామ శర్మ. అవధాన ప్రక్రియపై విశేష పరిశోధన జరిపాడు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. 150పైగా అవధానాలు చేశాడు .
- డాక్టర్ రాళ్ళబండి కవితా ప్రసాద్ వివిధ నూతన ప్రక్రియలు ప్రవేశపెట్టాడు.500పైగా అవధానాలు చేశాడు. తెలంగాణలో-
- డాక్టర్ ఆర్.గణేష్ 17పైగా భాషలలో ప్రావీణ్యం ఉన్న వ్యక్తి. 8 భాషలలో 500పైగా అవధానాలు చేశాడు.
- రాంభట్ల పార్వతీశ్వర శర్మ బాల కవి, 20 ఏళ్ళ వయసులో 12 అష్టావధానాలు చేశాడు. "శ్రీ రాంభట్ల వేంకటీయము" అనే లఘు పద్యకావ్యం వ్రాసాడు. చదివింది బియస్సీ మైక్రో బయాలజీ... చదువుతూ ఉన్నది ఎమ్మే తెలుగు, ఆంధ్ర విశ్వకళా పరిషత్.
- నరాల రామారెడ్డి వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన వీరు ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్ గా పదవీ విరమణ చేశారు. అష్ఠావధాని. అనేక అవధానాలు చేశారు. చమత్కారం వీరి ప్రత్యేకత. అమెరికాలో అవధానాలు చేసి మన్ననలు పొందారు.
- ==పంచసహస్రావధానులు==
- జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి , మేడసాని మోహన్
- ==ద్విసహస్రావధానులు ==
- మాడుగుల నాగఫణి శర్మ.
- ==సహస్రావధానులు==
- మేడసాని మోహన్ , మాడుగుల నాగఫణి శర్మ , వద్దిపర్తి ప్రభాకర్ , గరికపాటి నరసింహారావు.
- == పంచశతావధానులు==
- మాడుగుల నాగఫణి శర్మ.
- ==ద్విశతావధానులు ==
- రాళ్ళబండి కవితా ప్రసాద్ , కడిమిళ్ళ వరప్రసాద్ , గరికపాటి నరసింహారావు , మాడుగుల నాగఫణి శర్మ.
- == --శతావధానులు
- ==
- == అష్టావధానులు==
- ప్రసాదరాయ కులపతి ,దివాకర్ల వెంకటావధాని , ధూళిపాళ మహదేవమణి , గౌరీభట్ల రఘురామ శర్మ ,బేతవోలు రామబ్రహ్మం , దూపాటి సంపత్కుమారాచార్య , [[కోవెల సుప్రసన్నా చార్య [[, విఠాల చంద్రమౌళి శాస్త్రి , చిఱ్ఱావూరి శ్రీరామ శర్మ , ఆర్.అనంత పద్మనాభరావు , మాజేటి వెంకట నాగలక్ష్మీ ప్రసాద్ ,తిగుళ్ళ శ్రీహరి శర్మ , మాడుగుల అనిల్ కుమార్ , సురభి వెంకట హనుమంతు రావు , గణపతి అశోక్ శర్మ , ఇందారపు కిషన్ రావు , మేడూరు ఉమామహేశ్వరం , గాడేపల్లి కుక్కుటేశ్వర్ రావు , మరింగంటి కులశేఖరా చార్యులు , కర్రా గోపాలం , కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాద రావు , కట్టమూరు చంద్రశేఖర్ , లోకా జగన్నాధ శాస్త్రి , అయాచితం నటేశ్వర శర్మ , చింతలపాటి నరసింహ దీక్షిత శర్మ , అష్టకాల నరసింహరామ శర్మ , వెల్లాల నరసింహ శర్మ ,కేసాప్రగడ సత్యనారాయణ , గురువేపల్లి నరసింహం ,రాళ్ళబండి నాగభూషణ శర్మ ,కురుబ నాగప్ప , పూసపాటి నాగేశ్వర రావు , అందె వెంకటరాజం , రాంభట్ల పార్వతీశ్వర శర్మ , కావూరి పూర్ణచంద్రరావు , ముటుకుల పద్మనాభ రావు , ఆశావాది ప్రకాశరావు , పేరాల భరత శర్మ , పరవస్తు ధనుంజయ , నారాయణం బాల సుబ్రహ్మణ్య శర్మ , మేడవరం మల్లికార్జున శర్మ ,సమ్మెట మాధవ రావు , అవధానం రంగనాధ వాచస్పతి , వేదాటి రఘుపతి , ఆరుట్ల రంగాచార్య ,బులుసు వెంకట రామమూర్తి ,గడియారం శేషఫణి శర్మ , ఆమళ్ళదిన్నె వెంకట రమణ ప్రసాద్,పాలపర్తి వేణుగోపాల్ ,దిట్టకవి శ్రీనివాసాచార్యులు , దోనిపర్తి రమణయ్య , శంకరగంటి రమాకాంత్ , ముద్దు రాజయ్య , తిగుళ్ళ రాధాకృష్ణ శర్మ, గౌరీభట్ల రామకృష్ణ శర్మ , కోట రాజశేఖర్ , చిలుకూరి రామభద్ర శాస్త్రి , పరిమి రామ నరసింహం , బెజుగామ రామమూర్తి , పణితపు రామమూర్తి , జోస్యుల సదానంద శాస్త్రి , మద్దూరి రమమూర్తి , చిలుకమర్రి రామానుజాచార్యులు , గౌరిపెద్ది రామసుబ్బ శర్మ , పణతుల రామేశ్వర శర్మ , పాణ్యం లక్ష్మీనరసింహ శర్మ , చక్రాల లక్ష్మీకాంత రాజారావు ,శిరిశినహళ్ శ్రీమన్నారాయణాచార్యులు , పుల్లాపంతుల వెంకట రామశర్మ , దేవులపల్లి విశ్వనాధం , వంకరాజు కాల్వ వీరభద్రాచార్యులు , పణిదపు వీరబ్రహ్మం , భద్రం వేణు గోపాలా చార్యులు ,రావూరి వెంకటేశ్వర్లు , గుమ్మా శంకర రావు , ప్యారక శేషాచార్యులు ,మామిళ్ళపల్లి సాంబశివ శర్మ , నేమాని రామజోగి సన్యాసి రావు , కొప్పరపు సీతారామ వరప్రసాద రావు , శనగల సుందరరామయ్య , అవధానం సుధాకర శర్మ , పైడి హరనాధ రావు , పమిడికాల్వ చెంచు సుబ్బయ్య , తావి కృష్ణ శర్మ ,వడిగేపల్లి నరసింహులు , మేడికుర్తి పుల్లయ్య , కె.ప్రభాకర్ , పుల్లపంతుల రాధాకృష్ణ మూర్తి , బి.శ్రీనివాసాచార్యులు , అక్కపెద్ది రామసూర్యనారాయణ , సురభి శంక శర్మ , ప్రభల సుబ్రహ్మణ్య శర్మ , ఎస్.ఎ.టి.కె. తాతాచార్య , ఫణితపు శ్రియ:పతి , సి.విజయకుమార్ , గోవర్ధనం నరసింహా చారి , ఎం.కె.ప్రభావతి , తంగిరాల ఉదయ చంద్రిక , పుల్లాభట్ల శాంతి స్వరూప , కొంపెల్ల కామేశ్వరి,బులుసు అపర్ణ , ఆకెళ్ళ దుర్గ నాగసత్య బాలభాను మున్నగువారు.
1 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
వీరే కాకుండా ఇంకా కొందరి జాబితా నా వద్ద ఉంది నేడు అవధానాలు చేస్తున్నారు అందులో నేను ఒక అవధాని గా గర్వ పడుతున్నాను. మీకు వీలైతే 9652478734 number కు call చేయండి
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి