అనుబంధాలని భ్రమ పడుతూ
అందని ఒయాసిస్సుల కోసం
పరుగులు పెడుతున్న రోజులివి
పగలే నక్షత్రాలకై ఆశపడుతూ
రాతిరి వరకు వేచి ఉండలేని
ఉరుకుల పరుగుల జీవితాల్లో పడి
అందని ఆకాశానికి నిచ్చెనలేస్తున్న కాలం
కోరికలకు కళ్ళాలేయలేక సతమతమౌతూ
మంచి చెడు విచక్షణలో విలక్షణంగా మారి
విలాసాలకు విధులు బానిసలు కాగా
ఎందఱో అమ్మల ఆక్రోశానికి రగులుతున్న రావణకాష్ఠం
బజారు బతుకులంటూ నడిరోడ్డున నీతులు వల్లిస్తూ
పుస్తకాల్లో దాగి కళ్ళు విప్పి చూడలేని న్యాయం
కార్పోరేట్ చేతిలో గిల గిలలాడుతూ కదలనని
మోరాయించే చైతన్యానికి చిరునామాగా మరోసారి నిరూపితం...!!
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
ఎండమావులలో అనుబంధాల భ్రమలో
పగటి నక్షత్రాల ఆశల ఆకాశానికి నిచ్చెనలేస్తూ
కార్పోరేట్ చేతిలో గిల గిలలాడుతున్న చైతన్యం
మరోసారి నిరూపితం.... అంటూ
యువత మనోభావనలు యాంత్రికత అయోమయాలను స్పష్టంగా అక్షీకరించిన విధానం చాలా బాగుంది.
అభినందనలు మంజు గారు!
dhanyavadalu chandra garu
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి