27, జులై 2017, గురువారం

కలియుగ రాధాకృష్ణులు..!!

నేస్తాలు,
       ద్వాపర యుగంలో కృష్ణుడికి అష్ట భార్యలు, రాధ, గోపికలు ఉండేవాళ్ళు. కలియుగంలో కాస్త వరస మారి ఒక కృష్ణుడు, ఇద్దరు భార్యలు, వేల మంది రాధలు తయారయ్యారు. భార్య / భర్తల మధ్య మనస్పర్ధలు వస్తే ఒకరు చని పోవడానికి సిద్దపడి చావు అంచుల వరకు వెళ్ళిన మరురోజే ఆ కలియుగ పురుషుడు తన సుందర చిత్రాన్ని పెట్టిన కొన్ని క్షణాల్లోనే రాధమ్మ(ల) స్పందనలు చూస్తుంటే ఆ కృష్ణయ్యకి ఎంత సంబరమో. పొరపాటున నాలాంటి వాళ్ళ కళ్ళబడితే నాకెంత ఆనందమో. అసలే మంచం మీద నుంచి లేవలేని స్థితిలో ఉన్న నాకు కనుల పండగే కదండీ. అందుకే ఇన్నాళ్లు రాయకుండా ఉరుకున్న రాధాకృష్ణుల కావ్యాలు సాక్ష్యాలతో సహా మీ అందరికి కూడా చూపించేద్దామని ఓ నిర్ణయానికి వచ్చేసాను. ఏంటి మరి రాసేయమంటారా. పక్క చిత్రాన్ని చూసి మీరే చెప్పండి. ఇది చాలా తక్కువ అన్న మాట. నిర్ణయం మీదే
..!!

23, జులై 2017, ఆదివారం

మననెందుకు పలకరించాలి..?

నేస్తం,
        కనీసం కాకులకున్నపాటి నీతి కూడా జన్మలన్నింటికన్నా ఉత్తమెత్తమమైన మానవజన్మ ఎత్తిన మనకు ఉండటం లేదు. ఒక్క కాకి చనిపోతే వందల కాకులు చేరతాయి, కనీసం నీళ్ళు కూడా ముట్టవు. సన్మానాలు, సత్కారాలు, బిరుదులు, పురస్కారాలు, పదవులు  పొందగానే సరి కాదు. కనీసం మానవతా విలువలు కూడా మర్చిపోతున్నాం. మొన్నీమధ్య రచయిత, డాక్టరు అయిన ఒక మంచి వ్యక్తి చనిపోతే దూరం నుంచి వెళ్ళలేని వారు సరే అక్కడే ఉన్నవారు కూడా నలుగురు వెళ్ళలేక పోయారు అంటే చాలా సిగ్గు పడాల్సిన విషయం. సాటి రచయిత చనిపోయారు, ఒక్క క్షణం చూడటానికి సమయం లేదన్నప్పుడు మనకు రచయితల సంఘాలెందుకు..? మన గొప్పలు మనం  చెప్పుకోవడానికే అనుకోవాలి. చనిపోయాక సంస్మరణ సభలు మాత్రం పెడతారు. కష్టంలో ఉన్నప్పుడు ఒక్క పలకరింపుకి కూడా సమయం ఉండదు మనకు. ముఖ పరిచయస్తులు కూడా మొఖాలు చాటేస్తున్న ఈ ఆధునికతలో ఇలా ముసుగు వేసుకుని బతికేయడం, నీతులన్నీ ముఖ పుస్తక గోడలకే పరిమితం చేయడం రోజూ చూస్తూనే ఉన్నాం. ఎవరైనా బాధలో ఉన్నప్పుడు ఆ బాధను తీర్చలేము కానీ ఓ చిన్న పలకరింపు ఎంత శక్తిని ఇస్తుందో మాటల్లో చెప్పలేము. చావు పుట్టుకలు ఎలానూ మన చేతిలో లేవు, కనీసం మనకు చేతనైన పలకరింపు పలకరిస్తే మనుష్యులుగా పుట్టినందుకు కొన్ని క్షణాలను సార్ధకం చేసుకుందాం. ఎలాగూ మనం పోయినరోజు ఎవరు వచ్చారో చూడలేము, మన గురించి ఏం చెప్పుకున్నారో వినలేము. కొంతమంది అనుకుంటారు నేను కష్టంలో ఉన్నప్పుడు నన్నెవరు పలకరించలేదని, అప్పుడు ఆలోచించం, మనమెవరినైనా పలకరించామా అని. ఆ ఇంటికి ఈ ఇల్లు ఎంత దూరమో ఈ ఇంటికి ఆ ఇల్లు అంతే దూరం. కనీసం వెళ్ళలేకపోతే పోనీ ఫోనులో కూడా పలకరించము. అలాంటప్పుడు మననెందుకు పలకరించాలి..? అలా అనుకోవడానికి కూడా అర్హులం కాదు. మరికొందరేమో అన్నం పెట్టిన చేతినే కాటు వేసే రకాలు. అబ్బో ఇలా చెప్పుకుంటూ పొతే బోలెడు రకాలు మనలోనే. అందుకేనేమో ఏది ఎక్కువగా ఆశించకూడదు.

రెక్కలు...!!

1. ఎక్కడా
కనిపించదు
ఎవరికీ
వినిపించదు

మనసు
మాట...!!

2. రాలిన
ఆకులు
నిలిచిన
నీళ్ళు

వెలసిన
గాలివానకు సాక్ష్యంగా...!!

3. చెదిరిన
బొట్టు
పగిలిన
గాజులు

మిగిలిన
జీవచ్ఛవం...!!

21, జులై 2017, శుక్రవారం

దాసోహం అనక తప్పదు....!!

నేస్తం,
      అనుబంధాలను అవసరానికి వాడుకోవడం నేటి జీవితాల్లో మామూలై పోయింది. కొందరు వారి స్వార్ధం కోసం మారినట్లు నటిస్తారు కానీ మార్పు ఎలా వస్తుంది..? ఏ అనుబంధానికైనా పునాది నమ్మకం. నమ్మకం మోసపోయినప్పుడు కలిగే మానసిక వేదన ఎప్పటికి సమసిపోదు. గాయాలుగా మిగిలిన ఆనవాళ్ళు ప్రతి క్షణం ఆ గాయపు నొప్పిని గుర్తు చేస్తూనే ఉంటాయి. కాలం దేనికోసమూ ఆగదు కానీ గాయపు నొప్పి తగ్గినా గుర్తు మిగిలిపోతుంది. మేము ఇప్పుడు చాలా మారిపోయాము, తప్పు తెలుసుకున్నాము అని చెప్పగానే నమ్మేసి మళ్ళి మరోసారి మోసపోవడానికి తగిలిన గాయపు తీవ్రత తక్కువేమి కాదు. తమ స్వలాభాపేక్ష కోసం అమ్మానాన్న, తోబుట్టువులు, స్నేహితులు అన్న బంధాలను మరచి అవసరానికి తగ్గట్టు రంగులు మార్చుతూ ఊసరవెల్లికే పోటీగా వెళ్ళే ఎందరో మహానుభావులు ఈరోజు మన మధ్యన ఉన్నారు. ఎక్కడో ఓ చోట నాలుగు నీతులు చెప్పేస్తే మహా నీతిమంతులు అయిపోయినట్లు అనుకుంటూ ఉంటారు. మనిషి బంధాలకు కాకుండా మనిషిలోని మనీ బంధాలకు విలువలు ఇచ్చే మనుష్యులు జీవితంలో ఏదో ఒకసారైనా మనిషి బంధానికి దాసోహం అనక తప్పదు.

రెక్కలు..!!

1. లెక్కలు తేలని
 బంధాలు
 అక్కరకు రాని
 చుట్టరికాలు

 వెరసి మెరిసిన
 జీవిత సత్యం..!!

2. చెమ్మగిల్లిన
మనసు
ఉబుకుతున్న
కన్నీళ్ళు

మది భారాన్ని
దించుకునే యత్నం..!!

3. అక్షరంతో
అనుబంధం
కాగితంతో
స్నేహం

కలంతో
ముడి పడింది...!!

16, జులై 2017, ఆదివారం

చెదరని శిథిలాక్షరాల గుప్పెడు గుండె సవ్వడులు ... పెద్దల మాటల ముత్యాల మూటలు 8

చెదరని శిథిలాక్షరాల గుప్పెడు గుండె సవ్వడులు ... పెద్దల మాటల ముత్యాల మూటలు 7

ఏక్ తారలు ..!!

1. నిర్వచనాలకందదు_నిలకడలేని వ్యక్తిత్వం
2. రాతిరి రాయభారమంపింది _వెన్నెల వంటరిదైందని
3. అతుకుల బొంతే_అస్తవ్యస్తమైన జీవితం
4. రాధకన్నీ రస రంజితాలే_మాధవుని ప్రేమలో
5. వింతల విశేషాలే_విధి వంచితుల వ్యధలు

చెదరని శిథిలాక్షరాల గుప్పెడు గుండె సవ్వడులు ... పెద్దల మాటల ముత్యాల మూటలు 6

ఫెంటోస్ ..!!

1. అలికిడి లేని రెప్పలు
కలల కాన్వాసుపై వర్ణాలద్దుతున్నాయి
2. అరువు తెచ్చుకున్నాయి
అక్కరకురాని గతపు ఆనవాళ్ళను
3. దిగులు దుప్పటి దాచేసింది
దిక్కుతోచని జ్ఞాపకాలను చుట్టేసి

చెదరని శిథిలాక్షరాల గుప్పెడు గుండె సవ్వడులు ... పెద్దల మాటల ముత్యాల మూటలు 5

చెదరని శిథిలాక్షరాల గుప్పెడు గుండె సవ్వడులు ... పెద్దల మాటల ముత్యాల మూటలు 3

చెదరని శిథిలాక్షరాల గుప్పెడు గుండె సవ్వడులు ... పెద్దల మాటల ముత్యాల మూటలు 2

చెదరని శిథిలాక్షరాల గుప్పెడు గుండె సవ్వడులు ... పెద్దల మాటల ముత్యాల మూటలు

12, జులై 2017, బుధవారం

తిమిరపు తిథులు...!!

అక్షరాలు అలసిపోతూ
అనుభవాలను అనునయిస్తూ
ఆత్మీయతను కోరుకుంటున్నాయి

ఆపేక్షలు అద్దుకుంటూ
అనుబంధాలను చేరుకోవాలని
గతాల వెంట పరుగెడుతున్నాయి

బాంధవ్యాలు కనుమరుగౌతూ
గుర్తు లేని జ్ఞాపకాల లెక్కల్లో చేరుతూ
బాహాటంగానే వెలితి పడుతున్నాయి

వ్యధల దోసిళ్ళలో దాగుతూ
వెతల కన్నీళ్ళు రెప్పల మాటుగా
దాగిపోవాలని చూస్తున్నాయి

తిమిరపు తిథులెన్ని చేరినా
తీరం చేరాలని ఆరాటపడుతూ
అలలపై ఆటలాడే గుండె గురుతులు

మౌనాలే మాటలు నేర్చినా
మూగబోయిన మది సవ్వడి
మరల వినిపించే క్షణాలెన్నడో..!!

జీవన 'మంజూ'ష(1))...!!

 నేస్తం,
మనకు ఆధునిక సౌకర్యాలు వచ్చాక అసలు మూలాల్ని మర్చిపోతున్నాము. ఇప్పటికే అర్ధాలు మార్చుకుంటున్న బంధాలు, నైతిక విలువలు మనకు ఎదురుపడుతూనే ఉన్నాయి. సప్తపదికి, ఏడడుగులకు కొంగ్రొత్త భాష్యాలు చెప్పేస్తున్నారు వయసుతో నిమిత్తం లేకుండా. ఒకప్పుడు పుస్తకాలు, ఉత్తరాలు మనుష్య సంబంధాలతో ఎంతో పెనవేసుకుపోయాయి. ఇప్పుడు ముఖ పుస్తకం లేకపోతే మనం బ్రతకలేని పరిస్థితి. ఎన్నో వైవాహిక జీవితాలు విచ్చిన్నం కావడానికి, అర్ధం పర్ధం లేని అనుబంధాలు పెంచుకోవడానికి తద్వారా జీవితాలు నాశనం చేసుకోవడాలు.
అన్నింటికీ కారణం రాహిత్యం. అది ప్రేమ కావచ్చు మరేదైనా కావచ్చు. మనసు దొరకని దాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తూ తప్పటడుగులే కదా అనుకుంటూ తప్పుటడుగులు వేస్తున్న ఎన్నో జీవాలు. నిర్లక్ష్యానికి గురై నైరాశ్యంలో కూరుకుపోతే అది అలుసుగా తీసుకునేవాళ్ళు కోకొల్లలు. తమలో లోటుపాట్లు కనిపించకుండా ముసుగు వేసుకుని దానికి కులాలు, మతాలు అంటూ రంగులు పులుముతుంటారు మరికొందరు. ఇక మరికొందరేమో మానసికరోగులు వీరి జాడ్యానికి అక్షరాలని ఆశ్రయించి ఆ అక్షరమే ఆక్రోశపడే రాతలు రాస్తూ, ఎవరికీ రాయడమే రాదన్నట్టుగా ప్రవర్తిస్తారు. ఇక అవార్డులు, రివార్డులు అధికారానికి, డబ్బుకు అమ్ముడుబోతూ ఉన్నాయి. బిరుదులూ బిక్కుబిక్కుమంటూ బేల చుపులు చూస్తూ బాధపడుతున్నాయి.
ఇప్పటికి ఈ ముచ్చట్లకు సశేషం.

నవ మల్లెతీగ సాహిత్య మాసపత్రికలో నా శీర్షిక. సంపాదక వర్గానికి, సాహిత్య బంధువులకు కృతజ్ఞతలు. 

11, జులై 2017, మంగళవారం

అనుబంధానికి వారధులు నా ఆత్మీయులు...!!

నేస్తం,
     చిరకాల పరిచయమూ కాదు, మాటల దొంతర్లు మన మధ్యన దొర్లింది లేదు, దగ్గరలోనే ఉన్నా కలిసిన సందర్భాలు స్వల్పమే. అయినా బాంధవ్యం  ఉంది, ఎప్పటికీ ఉండిపోతుంది. మీ అక్షర ఆత్మీయతకు నా కృతజ్ఞతలు.

 అనుబంధానికి వారధులు నా ఆత్మీయులు...చిత్రంలో లేకుండా తెర  వెనకున్న మరెందరో...

సరళ ఉప్పలూరి గారు రాసిన మృదువైన స్నేహపు మలయ సమీరాలు.... 


కుదేలవుతున్న మనసుని కూడగడ్తూనే ఉంది
అక్షరాల ధైర్యముతో..
ఆగిపోతున్న ఆయువును పరిగెట్టిస్తూనే ఉంది
భాద్యతల కొరడా ఝుళిపిస్తూ..
అన్నిటికీ సిద్ధమంటూ బెదిరిస్తుంది మృత్యువుని
వాయువు తప్ప మరేం దక్కదంటూ..
తాముద్రించిన అక్షరాలలో నిలిచి వెక్కిరిస్తుంది కాలాన్ని
బ్రతికిపోతానిక్కడంటూ...

గుండె నిబ్బరమే నీ ఆయువు
తరగనీయకది...
నిలిచిపో మా అందరి గుండెల్లో
మరపురాని నేస్తంలా...
Love you maa

 Thank you so much Sarala

9, జులై 2017, ఆదివారం

జీవితానికి వెలకట్టే...!!

నేస్తం,
       అంతర్లీనంగా కొన్ని భావాలు మనతో మాట్లాడుతూనే ఉంటాయి ఎప్పుడూ. పిలిచినా పలుకలేని బాంధవ్యాలు ఎన్నో మన చుట్టూ ఉన్నా పిలువకనే మనతో మిగిలిపోయే అనుబంధాలు మరెన్నో. అంపశయ్య మీద నిలబడినప్పుడు ఆర్తిగా ఆదుకున్న స్నేహ హస్తాలు, ఆసరాగా నిలిచిన ఆప్తుల అండదండలు, తడబడుతూ తప్పటడుగులేస్తున్న మరో ప్రస్థానానికి చేయూతగా మారిన చేదోడువాదోడులు, చెదరని గురుతులుగా గుప్పెడు గుండెలో చేరుకున్న జ్ఞాపకాల సవ్వడులు మరో జన్మకు సరిపడా మిగిలిపోయిన ఆ పాత మధురాలుగా మారి మనలను పరామర్శిస్తుంటే.. ఎన్ని నవ్వులు సందడి చేస్తూ చుట్టాలుగా మారాయో, ప్రతిసారి మళ్ళి రమ్మని మృత్యువుని గుమ్మం బయటినుంచే పంపేయడం అలవాటైపోయి కన్నీరూ ఆనంద భాష్పమై కలవరిస్తోంది. మనసుని అక్షరాలుగా తర్జుమా చేస్తే ఎంత బావుండు అనిపిస్తోంది చెప్పడానికి మాటలు దొరకని ఆ క్షణాల సంతసం ఇంకా మనతోనే ఉన్నట్లుగా. మనసు తూట్లు పడినా మరచిపోయే మందు జ్ఞాపకాల నుండి అక్షయపాత్రలా అందుతుందని ఎంతమందికి తెలుసు..? అవసరానికి అనుబంధాన్ని నటించే ముసుగులకు అర్ధంకాని అభిమానం, వారి జీవితాల్లో అందని మకరండమే అని, జీవితానికి వెలకట్టే విలువకు కొరవడ్డారని, మరణించే క్షణాల్లో కూడా తెలుసుకోలేరేమో..!!
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner