9, జులై 2017, ఆదివారం

జీవితానికి వెలకట్టే...!!

నేస్తం,
       అంతర్లీనంగా కొన్ని భావాలు మనతో మాట్లాడుతూనే ఉంటాయి ఎప్పుడూ. పిలిచినా పలుకలేని బాంధవ్యాలు ఎన్నో మన చుట్టూ ఉన్నా పిలువకనే మనతో మిగిలిపోయే అనుబంధాలు మరెన్నో. అంపశయ్య మీద నిలబడినప్పుడు ఆర్తిగా ఆదుకున్న స్నేహ హస్తాలు, ఆసరాగా నిలిచిన ఆప్తుల అండదండలు, తడబడుతూ తప్పటడుగులేస్తున్న మరో ప్రస్థానానికి చేయూతగా మారిన చేదోడువాదోడులు, చెదరని గురుతులుగా గుప్పెడు గుండెలో చేరుకున్న జ్ఞాపకాల సవ్వడులు మరో జన్మకు సరిపడా మిగిలిపోయిన ఆ పాత మధురాలుగా మారి మనలను పరామర్శిస్తుంటే.. ఎన్ని నవ్వులు సందడి చేస్తూ చుట్టాలుగా మారాయో, ప్రతిసారి మళ్ళి రమ్మని మృత్యువుని గుమ్మం బయటినుంచే పంపేయడం అలవాటైపోయి కన్నీరూ ఆనంద భాష్పమై కలవరిస్తోంది. మనసుని అక్షరాలుగా తర్జుమా చేస్తే ఎంత బావుండు అనిపిస్తోంది చెప్పడానికి మాటలు దొరకని ఆ క్షణాల సంతసం ఇంకా మనతోనే ఉన్నట్లుగా. మనసు తూట్లు పడినా మరచిపోయే మందు జ్ఞాపకాల నుండి అక్షయపాత్రలా అందుతుందని ఎంతమందికి తెలుసు..? అవసరానికి అనుబంధాన్ని నటించే ముసుగులకు అర్ధంకాని అభిమానం, వారి జీవితాల్లో అందని మకరండమే అని, జీవితానికి వెలకట్టే విలువకు కొరవడ్డారని, మరణించే క్షణాల్లో కూడా తెలుసుకోలేరేమో..!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner