12, జులై 2017, బుధవారం

జీవన 'మంజూ'ష(1))...!!

 నేస్తం,
మనకు ఆధునిక సౌకర్యాలు వచ్చాక అసలు మూలాల్ని మర్చిపోతున్నాము. ఇప్పటికే అర్ధాలు మార్చుకుంటున్న బంధాలు, నైతిక విలువలు మనకు ఎదురుపడుతూనే ఉన్నాయి. సప్తపదికి, ఏడడుగులకు కొంగ్రొత్త భాష్యాలు చెప్పేస్తున్నారు వయసుతో నిమిత్తం లేకుండా. ఒకప్పుడు పుస్తకాలు, ఉత్తరాలు మనుష్య సంబంధాలతో ఎంతో పెనవేసుకుపోయాయి. ఇప్పుడు ముఖ పుస్తకం లేకపోతే మనం బ్రతకలేని పరిస్థితి. ఎన్నో వైవాహిక జీవితాలు విచ్చిన్నం కావడానికి, అర్ధం పర్ధం లేని అనుబంధాలు పెంచుకోవడానికి తద్వారా జీవితాలు నాశనం చేసుకోవడాలు.
అన్నింటికీ కారణం రాహిత్యం. అది ప్రేమ కావచ్చు మరేదైనా కావచ్చు. మనసు దొరకని దాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తూ తప్పటడుగులే కదా అనుకుంటూ తప్పుటడుగులు వేస్తున్న ఎన్నో జీవాలు. నిర్లక్ష్యానికి గురై నైరాశ్యంలో కూరుకుపోతే అది అలుసుగా తీసుకునేవాళ్ళు కోకొల్లలు. తమలో లోటుపాట్లు కనిపించకుండా ముసుగు వేసుకుని దానికి కులాలు, మతాలు అంటూ రంగులు పులుముతుంటారు మరికొందరు. ఇక మరికొందరేమో మానసికరోగులు వీరి జాడ్యానికి అక్షరాలని ఆశ్రయించి ఆ అక్షరమే ఆక్రోశపడే రాతలు రాస్తూ, ఎవరికీ రాయడమే రాదన్నట్టుగా ప్రవర్తిస్తారు. ఇక అవార్డులు, రివార్డులు అధికారానికి, డబ్బుకు అమ్ముడుబోతూ ఉన్నాయి. బిరుదులూ బిక్కుబిక్కుమంటూ బేల చుపులు చూస్తూ బాధపడుతున్నాయి.
ఇప్పటికి ఈ ముచ్చట్లకు సశేషం.

నవ మల్లెతీగ సాహిత్య మాసపత్రికలో నా శీర్షిక. సంపాదక వర్గానికి, సాహిత్య బంధువులకు కృతజ్ఞతలు. 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner