12, జులై 2017, బుధవారం

తిమిరపు తిథులు...!!

అక్షరాలు అలసిపోతూ
అనుభవాలను అనునయిస్తూ
ఆత్మీయతను కోరుకుంటున్నాయి

ఆపేక్షలు అద్దుకుంటూ
అనుబంధాలను చేరుకోవాలని
గతాల వెంట పరుగెడుతున్నాయి

బాంధవ్యాలు కనుమరుగౌతూ
గుర్తు లేని జ్ఞాపకాల లెక్కల్లో చేరుతూ
బాహాటంగానే వెలితి పడుతున్నాయి

వ్యధల దోసిళ్ళలో దాగుతూ
వెతల కన్నీళ్ళు రెప్పల మాటుగా
దాగిపోవాలని చూస్తున్నాయి

తిమిరపు తిథులెన్ని చేరినా
తీరం చేరాలని ఆరాటపడుతూ
అలలపై ఆటలాడే గుండె గురుతులు

మౌనాలే మాటలు నేర్చినా
మూగబోయిన మది సవ్వడి
మరల వినిపించే క్షణాలెన్నడో..!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner