స్వార్ధం రూపాలు ఎంతగా మారినా దాని అంతిమ లక్ష్యం ఏమిటనేది జగమెరిగిన సత్యం. గత కొన్నేళ్లుగా గుర్తుకే లేని ఊరి బాగోగులు అన్ని తామే తమ పలుకుబడితో చేయించామని చెప్పుకుంటున్న ఊరిలోని వాళ్ళు ఇన్నాళ్లు ఎక్కడికి వెళ్ళారో. మోకాళ్ళ లోతు బురద, తాగడానికి మంచినీళ్ళు కూడా కరవైన రోజులు, పాడుబడిపోయిన రామాలయం ఉన్నప్పుడు కనిపించని ఊరి పరిస్థితి ఒక్కసారిగా సిమెంట్ రోడ్లు, పల్లంలోని గుడి, మంచినీళ్ళు ఇలా కొన్ని ఊరికి అవసరమైనవి అన్ని పదవి వచ్చాక తమ బంధువులతోనే చేయించామని చెప్పుకోవడంలో నిజం ఎంత. పంచాయితీ స్థలాన్ని కలుపుకోవడంలో చాలా నైపుణ్యం చూపించి, అడిగిన వాళ్ళపై నోరు పారేసుకుంటే తప్పు ఒప్పై పోదు. రాళ్లు రువ్వడం కాదు, నోరుందని అరవడం కాదు, మీకు పదవులు కట్టబెట్టినప్పుడు గుర్తుకు రాలేదా మీ ఊరివాడు కాదని. ఒకడేమో ఏంటి మీ పార్టీ వాళ్ళే కొట్టుకుంటున్నారంట అనడం, మీ పన్నాగాలు, గోతులు అన్ని అందరికి తెలుసు. మాడం గారు కొత్తగా ఇప్పుడు వాళ్ళ అన్నయ్యతో చెప్పి పాపం రోడ్లకి డబ్బులు ఇప్పించారంట. ఆ డబ్బులు ఎలా వచ్చాయి అన్న దానికి ప్రత్యక్ష సాక్షిని నేను. మీ జీవిత చరిత్రలు తిరగేయడం మొదలుబెడితే ఏమౌతుందో అందరికి తెలుసు. ఆ ఊరిలో ఎవరికి తెలియని చరిత్ర కాదుగా.
ఒకప్పుడు ఉరి గురించి ఆవేదన చెందితే పెద్దలు అన్నారు ఊరు చాలా బావుంది ఊరు రోడ్లు, చెరువు, గుడి ఇలా అన్ని రకాలుగా ఊరు అభివృద్ధి చెందితే ఈవిడ ఊరు మారాలి, ఊరి జనంలో మార్పు రావాలి అంటోంది అని. ఊరిలో వాళ్ళు తినేది అన్నమే అయితే తప్పుని తప్పు అని చెప్పండి. ఒప్పుని ఒప్పు అని చెప్పండి అంతే కాని మీ అవసరాలకు మనుష్యులను వాడుకోకండి. ఒకప్పుడు నా దగ్గర డబ్బు లేదని అదే ఊరిలో జనం, బంధువులు నాతో ఎలా ఉన్నారో నాకు తెలుసు. ఇప్పుడు ఎలా ఉంటున్నారో తెలుసు. పైకి మంచితనంగా ఉంటూ గోతులు తవ్వాలని చూస్తే ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు. బంధువులన్నాక కొట్టుకోకుండా, తిట్టుకోకుండా ఉండరు, అవి పనిమాలా వేరే ఊర్లకి జారవేయడాలు, మన దగ్గరేమో అక్కా తొక్కా అంటూ మాటలు. మంచి చెడు అన్నవి అన్ని కుటుంబాలలో ఉంటాయి. ఈ రోజు గడిచింది లెక్క కాదు రేపటి రోజన్నది ఒకటుంటుంది అది గుర్తుంచుకోవాలి. నటించడం మానేసి కాస్తయినా నిజాయితీగా బతకడం మొదలెట్టండి. కనీసం మన పిల్లలయినా బావుంటారు.
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి