1. చిత్రమైనదే జీవితం_విచిత్రాలను వినీలాకాశానికి పరిచయం చేస్తూ...!!
2. ఏ జ్ఞానమున్నా ఏమున్నది గర్వకారణం_అజ్ఞానం మన ఇంటిపేరైనప్పుడు...!!
3. ప్రేమంతా పదిలమే_అతివ మదిలో అక్షయమై...!!
4. మానసిక వైకల్యాన్ని చూపుతాయి_పరిణితినెరుగని రాతలు కొన్ని...!!
5. మమతలల్లుకున్న మాటలే అన్నీ_మనసు మౌనం వీడకున్నా...!!
6. మనసైన మౌనం మనకలవాటైందే కదా_మాటల మమకారపు నెలవులో...!!
7. గాయాల లెక్కలు తేలనివే_మౌనంగా భరించే మది మాటున..!!
8. మాటలకు గుబులైందట_మౌనం వీడని నీ మదిని తలచి..!!
9. గాయం తెలుపుతుంది_మన గమ్యమేమిటని...!!
10. మెాపలేని భారమంతా మనసుదే_కన్నీరు కనురెప్పల మాటున చేరినా..!!
11. భాష్యమక్కర్లేని భావాలివి_అనుబంధాలై అల్లుకుపోతూ...!!
12. సారూప్యతెప్పుడూ సన్నిహితమే_అనుబంధపు ఆనవాళ్ళు లేకున్నా...!!
13. దగ్గరగా చూపేవీ ఆ స్వప్నాలే_దూరాలను భారం కానీయక..!!
14. అలిగినా అందమైనదే స్వప్నం_చీకటిలో వెన్నెలను చూపిస్తూ..!!
15. దిగులు దుప్పటి తొలుగుతుంది_ఆశల వెలుగులు అందుతుంటే..!!
16. మౌనమేమి చెప్పదు_మనసు తెలుపుతుందంతే..!!
17. ఎదురుచూపులు యదార్థమే_మనసు చేస్తున్న మాయకు లోనైన మౌనానికి...!!
18. వేకువై వెంటబడుతూనే ఉన్నా_చెదిరిన స్వప్నాన్ని సర్దడానికి...!!
19. వాస్తవం వెన్నంటే ఉంది_బాధ్యతలను గుర్తుచేస్తూ...!!
20. చేరువైన కలలే అన్నీ_వెన్నలద్దిన వన్నెల్లో మెరుస్తూ...!!
21. పదమై పరవశించెను_పరితాపమెరుగని భావజాలమై...!!
22. కుళ్ళు కంపు కొట్టేది కులం కాదు_మనమనుకునే మన మంచి బుద్ది...!!
23. కొన్ని పరిచయాలంతే_పలకరింతలవసరమే లేదన్నట్టుగా..!!
24. కుదింపులు తప్పని జీవితాలు_వస్తువు పాతదైనా సరికొత్త కథనంతో...!!
25. అజమాయిషీ కాదది_హితమైన అదలాయింపు...!!
26. మౌనం దాచిన విషాదమది_రాగమేదయినా భావాన్ని స్వరపరుస్తూ...!!
27. ఆత్మీయంగా హత్తుకోవడమే అక్షరానికి తెలుసు_ఏ కుతంత్రాలు ఎలా ఉన్నా...!!
28. మనసు రాగమది_మౌనం నేర్చిన మాటల మాటున చేరుతూ...!!
29. స్వరాలాపన అద్భుతమే_పద కమలాలు పాద మంజీరాలైన వేళ...!!
30. ఊహలలాగే ఊసులాడతాయి_ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా...!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి