Prasad Doddapaneni బాబాయ్ మీ ఆత్మీయతాక్షరాలు మాకు ఎనలేని ఆశీస్సులు🙏
గుప్పెడు గుండె సవ్వడులు....
........తిరుపతి వేంకట కవులు
పింగళి కాటూరి వంటి వుద్దండ జంట కవుల వరవడిలో ఈనాటి వర్ధమాన ఆధునిక జంట కవులు మంజు--వాణి లు ఆవిష్కరించిన "గుప్పెడు గుండె సవ్వడులు " సాహితీ ప్రియుల గుండెలలో మంజీర నాదాలు సవ్వడి చేస్తాయనటంలో అతిశయోక్తి లేదు.
రసతప్త హృదయుల గుండెలలో వియోగాలు , విరహాలు ,వేదనలు, నిర్వేదనలు ,పరివేదనల సంవేదనలు సృష్టించే అలజడులు ...కల్లోలాలు... అత్యంత తీవ్రంగా ఉంటాయి....ముఖ్యంగా బుద్ధి జీవుల సున్నితమైన హృదయాలలో.....
సాధారణ వ్యక్తులను అవి అంతగా ప్రభావితం చేయ లేక పోయినా , మనిషితనం మూర్తీభవించిన కారణ జన్ములలో సాగర మధనం నుండి ఉద్భవించిన అమృతం వలె గొప్ప కవిత్వాలు ఆవిర్భవిస్తాయి...
అటువంటి అమృత ధారలే
మంజు వాణీల గుండె సవ్వడుల అక్షర మంజీర నాదాలు....
ప్రతి వాక్యం గుండెలో తాకుతుంది...అందరిలోనూ మానస వీణ ను తట్టి నవరసాల రాగాలను పలికిస్తుంది....
ఇది మంజు వాణి ల యజ్ఞ ఫలం..
తాము కొవ్వత్తి లా కరిగి పోతూ సాహితీ లోకానికి అందించిన వెలుగు రేఖలు..
.... జంట నారీ మణులకు ఆత్మీయ అభినందనలు...
......ప్రసాద్.
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి