నేస్తం,
జీవితంలో మార్పు సహజమే. అది వ్యక్తుల మీద, వ్యవస్థ మీద ఏ విధంగా ప్రభావంచూపుతుందన్నది మనకు తెలియదు. కొన్ని మార్పులు సమాజ పురోభివృద్ధికితోడ్పడుతుంటే, మరికొన్ని మార్పులు వ్యవస్థ మూలాలను దెబ్బ తీస్తున్నాయి. ఉదాహరణకుసాంకేతిక మార్పులు మనిషి బుద్ధికుశలతకు గీటురాళ్ళుగా మారుతుంటే, పాశ్చాత్యఆధునిక పోకడలు మన కుటుంబ వ్యవస్థ మూలాలను దెబ్బ తీస్తోంది. మనిషి విజ్ఞానంఅంతరిక్షానికి పయనిస్తుంటే, మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మిగిలిపోతోందీనాడు. పూర్వకాలం విజ్ఞానం మనిషి వికాసానికి దోహదపడితే, ఈనాటి మేధస్సు అణుయుద్ధాలకుఆజ్యం పోస్తూ, సహజసిద్ధమైన ప్రకృతిని పరిహసించడమే కాకుండా , మానవజాతి వికృతచేష్టలకు సాక్ష్యంగా నిలుస్తోంది.
మితిమీరిన స్వేచ్ఛ, అవసరానికి మించిన ధనం కొందరికుంటే, ఆకలి కడుపులఆక్రందనలు కొందరివి. యుగాలు మారుతున్నా ఈ అంతరాలలో మార్పు లేదు. అలాగేఆడ, మగ మధ్యన అహంలో కూడా మార్పేం లేదు. రాతియుగం నుండి ఈ ఆధునికయుగం వరకు ఆధిపత్యపు పోరు అలాగే ఉంది. అది కుటుంబ పరంగానైనా, సామాజికపరంగానైనా, రాజకీయ పరంగానైనా అధికారం పెత్తనం చెలాయిస్తూనే వుంది. విలువలతోబతికేవారికి ఈ సమాజమిచ్చిన బిరుదు చేతగానితనం. ఆ చేతగానితనమే కొందరి పాలిటవరంగానూ, మరికొందరి పాలిట శాపంగానూ మారిపోయింది.
ఓ మతాన్నో, కులాన్నో ద్వేషిస్తే మనకేం ఒరుగుతుంది. అదే వాటిలో మంచిని మనంగ్రహించ గలిగితే మరో నలుగురికి, తద్వారా సమాజానికి కాస్తయినా మేలుచేసినవారమౌతాము. ఈమధ్యన మతద్వేషం బాగా ప్రబలిపోతోంది. మనకు రాయడంబాగా వచ్చని మన భారతీయ సనాతన ధర్మాలను, పురాణ, ఇతిహాసాలను ఇష్టంవచ్చినట్టుగా అవహేళన చేస్తూ, అదే తమ గొప్పతనంగా భావిస్తున్నారు కొందరు. మనకుఅమ్మ నేర్పిన సంస్కారాన్ని మర్చిపోతున్నామని గుర్తించకుండా, పనికిమాలిన సమూహాలునెత్తికెత్తుకుంటున్నాయని గొప్పలు పోతున్నారు. ఇలా కులమతాలను అవహేళన చేయడంవలన మీకు ఒరిగేదేమిటి? మీ చదువు నేర్పిన విజ్ఞత ఇదేనా? మనం ఒకటి అంటేఎదుటివారు నాలుగు అనగలరు అన్న విషయం మర్చిపోతే ఎలా!
సెక్షన్లు, చట్టుబండలు మనకే తెలుసునన్న అహంకారంతో విర్రవీగితే అన్ని సెక్షన్లుమనకన్నా బాగా తెలిసిన అజ్ఞాతశక్తి ఒకటుంది. మనకన్నా బాగా రాయడం ఆ శక్తికితెలుసు. మనం నమ్మినా, నమ్మకున్నా మన అహానికి విరుగుడు ఆ శక్తి ప్రయోగిస్తుంది. అవార్డులు, రివార్డులు కొందరికి ఎలా వచ్చాయన్నది అందరికి తెలుసు. కనీసంవాటికయినా విలువనిచ్చి మీ రాతలను సమాజ శ్రేయస్సుకు ఉపయోగించండి. కాదూకూడదు మేమిలాగే రాస్తామంటే మూల్యం చెల్లించక తప్పదు. మార్పు మంచికోసమవ్వాలి కాని నలుగురు మనల్ని అసహ్యించుకునేలా మన రాతలు ఉండకూడదన్నసత్యాన్ని ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది. వ్యక్తులుగా మీకున్న విలువమిగులుతుంది.
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి