మీ పధకాలు మీరే దాచుకోండి సామి. ఎందుకు ఇలా చేయడం? ఇదిగో ఇచ్చేస్తున్నామంటారు. ఆధార్ కి ఫోన్ నెంబరు లింక్ చేయండంటారు. ఏలిముద్రలేయండంటారు. నిజంగా ఎకరం, అరెకరం పొలమున్నవారిని ఇలాంటి ఆశలు బోలెడు పెట్టి, గవర్నమెంటు ఆఫీసుల చుట్టూ ఎన్నిసార్లు తిప్పించుకుంటున్నారో మీకు తెలియదా ఏలికా! పంట బదులుగా ప్రింటింగ్ మెషిన్ కొనుక్కుంటే ఆధార్ కాపీల ఖర్చుతో కుటుంబం దర్జాగా గడిచిపోయేది. ఆ విషయం మీకూ తెలుసు.
ఇవన్నీ తెలిస్తే పల్లెలో అరెకరం పొలంతోనే అద్భుతాలు చేసేవారు కదా! అందరికి ఫోన్లు ఉండవు నాయకా! పేరుకే పధకాలు. మీ ఓట్ల కోసం రైతులను ఆ భీమా ఈ భీమా అంటూ మోసం చేయకండి. పంటకు కనీస ధర నిర్ణయించుకునే హక్కు రైతుకివ్వండి చాలు.
నా కంఠసోషే కాని గిట్టుబాటు ధర లేనిదే పంట వేయకయ్యా అంటే రైతూ వినడు. కనీస ధర నిర్ణయించుకునే వెసులుబాటు రైతుకివ్వమంటే మీరూ వినరు. షాపుల్లో, షోరూములలో వెలిగే రూపాయి, రైతు రక్తానికి విలువనివ్వడం లేదు.
ఓ రైతూ వినరా నా మాట…ఓ సంవత్సరం ఏ పంటలు వేయకు. నీ చేతి బువ్వ తింటూ నిన్ను హేళన చేసే ఈ దగాకోరు సమాజానికి నువ్వేంటో తెలియజెప్పు.
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి