మనసునే కమ్మేసింది
మనిషినే మార్చేసింది
మాటల గారడి చేస్తూ
మౌనమై తాను మిగిలింది
బంధమై అల్లుకుంది
బాధ్యతలు నేర్పింది
బాసలను గుర్తుజేస్తూ
సరికొత్త జీవితాన్నిచ్చింది
చుట్టమై చేరింది
బంధుత్వాలను కలిపింది
కోపాన్ని మాపేస్తూ
సంతోషమై కొలువైంది
కాలానికి గాలమేసింది
జ్ఞాపకాల తాయిలాలిచ్చింది
ప్రపంచానికి నన్నిలా..
పరిచయం చేసింది..!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి