27, ఏప్రిల్ 2023, గురువారం

యనమదల వారి వంశం..!!

 నరసింహాపురం యనమదల వారి వంశం..!!   


   ఉత్తరాది (గోదావరి జిల్లాల) యనమదల ఊరు నుండి నాలుగు పక్కలకు ఖమ్మం, నైజాం, పెదలంక వెళ్ళిన యనమదల వారి మూలాలు పెదలంక నుండి నరసింహాపురం వచ్చిన విప్పర్ల గోత్రం, యనమదల పకీరయ్య, సీతారావమ్మ గారి కొడుకు, కోడలు యనమదల వెంకయ్య, వెంకమ్మ గారితో మెుదలై, తొలి సంతానం ఆడపిల్ల కోటమ్మ, ఐదుగురు మెుగపిల్లలు  కిష్టయ్య, రామయ్య, రంగయ్య, భూషయ్య,  రాఘవయ్య,. గా ఏర్పడిన కుటుంబం ఇది.


రోజులలో గురువులు ఉండేవారట. వీరి గురువుగారు భారద్వాజ గోత్రం వేంకటేశ్వర చారు గారు.


ఆడపిల్ల కోటమ్మ, మల్లిపద్ది కోటయ్యలకు రాగమ్మ, గజేంద్రఇద్దరు అమ్మాయిలు, ముగ్గురు మెుగపిల్లలు. పేర్లు మల్లిపద్ది నారాయణం, బుల్లితాత(కృష్ణయ్య), సీతారామయ్య


రాగమ్మ రావి అప్పయ్యలకు ముగ్గురు కూతుర్లు సూర్యావతి, హైమావతి, మాణిక్యం, కొడుకు రావి వెంకటేశ్వరరావు 


సూర్యావతి, పర్చూరి రాఘవయ్యలకు  ఇద్దరు కొడుకులు ప్రసాద్, దిలీప్, ఓ కూతురు పార్వతి

వెంకట శివరామ ప్రసాద్, విజయలక్ష్మి కి కూతురు రాణి.

రాణి, చింతా మురళీ కృష్ణ లకు కొడుకు ఈశ్వర సాయి

దిలీప్, జోత్సల కొడుకు కన్నా(బాల సూర్య కిరణ్), రమ్యలకు రేయాన్


పార్వతి,గోగినేని రంగారావుల కొడుకు చైతన్య


మాణిక్యం, మల్లిపద్ది సుబ్బారావు కి ఓ కొడుకు, కూతురు మల్లీశ్వరి.

కొడుకు ప్రసాద్,అమ్మాజి కి ఇద్దరు ఆడపిల్లలు ప్రవీణ. ప్రశాంతి

ప్రవీణకు కొడుకు 

మల్లీశ్వరి, సోమవరపు శంకరరావులకు రజిత, అజాద్

రజిత, శ్రీరామ వెంకటాద్రిలకు పాప,బాబు భవ్య, సాయి కిరణ్

అజాద్, శ్రావణి కి కొడుకు రోషన్


రామయ్య కూతురు రాజమ్మ , మల్లిపద్ది నారాయణం గారికి ఇద్దరు కొడుకులు (కోమటి) కృష్ణమూర్తి, కోటేశ్వరరావు 

కూతురు సుశీల, దేవభక్తిని శివ శంకరరావులకు ఇద్దరు కూతుర్లు సుజాత, శివనాగ మల్లీశ్వరి ఓ కొడుకు నాగేశ్వరరావు

సుజాత, తలశిల వారి కోడలు. కొడుకు హరిష్, దివ్య లకు బాబు

శివ, మేకా రమేష్ ల కొడుకు కిషోర్, పూర్ణిమలకు ఇద్దరు ఆడపిల్లలు అమిత. అజిత(స్వీటి, లక్కీ )

నాగేశ్వరరావు, శ్రీకృష్ణ కుమారిలకు ఇద్దరు కూతుర్లు పూర్ణిమ(కిషోర్ మేకా), రజని. పోటుమర్తి శివరామకృష్ణలకు ఖ్యాతి వర్థన్, ఆద్యశ్రీ

కోటేశ్వరరావు, విజయకమారి ఇద్దరు కూతుర్లు రాధ(మమత), సరిత 

రాధ, యలవర్తి వెంకటేశ్వరరావులకు కొడుకు, కూతురు శరత్ చంద్ర, స్వాతి

సరితకి కీర్తన, విజయ్ 


కోమటి కృష్ణ, పాపమ్మ (వెంకటరత్నం)లకు కూతురు ,కొడుకు 

విజయలక్ష్మి, మండవ వెంకటేశ్వరరావు కి కొడుకు సాయి, కూతురు నళిని,

నళినికి కూతురు

కొడుకు వెంకటేశ్వరావు, దివ్యలతలకు  ముగ్గురు పిల్లలు

హనుమాన్ సాయి, శ్రావణి, 


(మేనకోడలు)హైమావతి, బుల్లితాత(కృష్ణయ్య) ఇద్దరు కొడుకులు రాంబాబు, మధుసూధనరావు. ఇద్దరు అమ్మాయిలు  కోటేశ్వరి, లక్ష్మి, 

కోటేశ్వరి, వడ్లమూడి నాగేశ్వరరావు లకు శైలజ, రాజేష్

శైలజ, రావి నాగేశ్వరరావు 

రాజేష్, రాణిలకు ముగ్గురు మెుగపిల్లలు సూర్య


లక్ష్మి, రావి బెనర్జీ లకు ఉషారాణి, ఆశ

ఉషారాణి, గోగినేని మురళిలకు పద్మజ, సాహితి, భార్గవి

ఆశ, వేమూరి వేమన లకు కూతురు మున్నీ

రాంబాబు, ప్రసూనలకు కూతురు 


మధుసూధనరావు, పద్మజకి ఇద్దరు కొడుకులు కృష్ణ తేజ, రవి తేజ


సీతారామయ్య,(చిన్న హైమావతి)ల కొడుకు కోటేశ్వరరావు. కోటేశ్వరరావు,విశాల, పద్మలకు ముగ్గురు మెుగపిల్లలు. ముద్దుకృష్ణ, పూర్ణిమలకు లాస్య, సారంగ్

ప్రమోద్, ప్రణతిలకు సాహితి

విశాల్, ధనలక్ష్మిలకు విష్ణువర్థన్, జ్యోతిక


వెంకయ్య గారి మెుగపిల్లలు కిష్టయ్య, రామయ్య, రంగయ్య, భూషయ్య, రాఘవయ్య

కిష్టయ్య, లక్ష్మికాంతమ్మలకు నాంచారమ్మ

నాంచారమ్మ, పాలేటి సూర్యనారాయణలకు ఇద్దరు అమ్మాయిలు పెద్దమ్మాయి సత్యవతి, చిన్నమ్మాయి శాంతకుమారి, తలశిల కామేశ్వరరావు

పెద్దమ్మాయి, జగన్మోహనరావు(మిల్లుబాబు)దొప్పలపూడి లకు ఇద్దరు అబ్బాయిలు బాలకృష్ణ, వంశీకృష్ణ

బాలకృష్ణ, జయశ్రీలకు (విక్కి)అభిషేక్ చౌదరి, తేజన్ చౌదరి(డాలి)

వంశీకృష్ణ, లలితలకు జ్యోత్స్న, రోహిత్


రామయ్య, రావమ్మలకు వెంకయ్య, చిన్న, రాజమ్మ, అన్నపూర్ణ, సూరమ్మ

అన్నపూర్ణమ్మ, చెన్నుపాటి మల్లయ్య(రావమ్మ తమ్ముడు)లకు ఇద్దరు కొడుకులు, కూతురు

కోటేశ్వరరావు, సుబ్బారావు,

సుబ్బారావుకి కూతురు, కొడుకు

కూతురు అనూరాధ, నరేంద్రలకు ఇద్దరు అబ్బాయిలు


సూరమ్మ కి పిల్లలు లేరు


వెంకయ్య,పద్మలకు ముగ్గురు అమ్మాయిలు రావమ్మ, జమున, కుమారి. కొడుకు భద్రయ్య

రావమ్మ, చెన్నుపాటి కోటేశ్వరరావులకు ఇద్దరు కొడుకులు వెంకట రమణ,ప్రవీణ్. రావమ్మను అన్నపూర్ణమ్మ పెద్దకొడుకుకి ఇచ్చారు. వీరి పెద్ద కొడుకు రమణ కొడుకు ప్రభవ్. 

కుమారి, గొర్రెపాటి నారాయణలకు ఇద్దరు కొడుకులు అనిల్‌, అజయ్. 

జమున, కఠమనేని పరమేశ్వరరావు కొడుకు వెంకట రమణ,సునీత

పిల్లలు పేర్లు భవ్యశ్రీ , అభిరామ్

కూతురు  విజిత, బాబూరావు

గోపికృష్ణ, శ్రావణి


భద్రయ్య, సుకన్యలకు ఇద్దరు కూతుర్లు గౌతమి, కళ్యాణి

 గౌతమికి ఇద్దరు అమ్మాయిలు తేజ, 

కళ్యాణి పిల్లల పేర్లు కనుష్క


(చిన్న)గోపాలకృష్ణ, నిర్మలమ్మలకు ఇద్దరు అబ్బాయిలు తిరుమలరావు, శ్రీనివాసరావు, ఓ కూతురు చంటి(చెంచులక్ష్మి), వారికి పిల్లలు తిరుముకు ఇద్దరు అబ్బాయిలు, ఒకడికి అబ్బాయి

శ్రీనివాసరావుకి పాప

చంటికి కూతురు నవీన. నవీనకు ఇద్దరు అబ్బాయిలు


రంగయ్య, మాణిక్యమ్మలకు ముగ్గురు ఆడపిల్లలు, ముగ్గురు మెుగపిల్లలు

పిచ్చయ్య, శ్రీకృష్ణం, సుబ్బారావు, సీతారావమ్మ, భారతి, కృష్ణవేణి

పిచ్చయ్య, రంగనాయకమ్మలకు అమ్మాయి,అబ్బాయి వెంకట రమణమ్మ, రాజా(వెంకట కృష్ణారావు)

అమ్మాయికి కూతురు ఉజ్వల , ఆ కూతురికి కూతురు

రాజా, సత్య కి కొడుకు సాయి

శ్రీకృష్ణం, శేషులు కి ముగ్గురు కొడుకులు రంగారావు,శాంతి, పరంజ్యోతి, రంగనాయకమ్మ, సుధాకర్, విజయశ్రీ

వారికి ముగ్గురు పిల్లలు ఇద్దరు అబ్బాయిలు నవీన్, సాయి భరత్, ఓ అమ్మాయి ప్రవల్లి, నీరుకొండ పునీత్

వారిలో నవీన్,రూప కి ఇద్దరు పాపలు ఆద్య, ఆన్య


సుబ్బారావు, సామ్రాజ్యంలకు కూతురు మంజు

మంజు, యార్లగడ్డ రాఘవేంద్రరావులకు ఇద్దరు కొడుకులు  మౌర్య చంద్ర, శౌర్య చంద్ర


కాసరనేని సీతారావమ్మ, నాగేశ్వరరావులకు సామ్రాజ్యం, రమణ

సామ్రాజ్యానికి, సుబ్బారావు(సీతారావమ్మ తమ్ముడు)కి  మంజు,  తనకి ఇద్దరు కొడుకులు 

రమణ, బేబిలకు ఇద్దరు కూతుర్లు ప్రియాంక, తేజశ్విని


దోనేపూడి భారతి, నాగేశ్వరరావులకు ముగ్గురు కూతుర్లు విశాలి, కృష్ణకుమారి, అనిత

కందిమళ్ళ విశాలి, వెంకటేశ్వరరావులకు కొడుకు రవితేజ, తేజ, ప్రశాంతిల కొడుకు వివాన్

ఘంటా కుమారి, రమేష్ లకు కొడుకు సందీప్, దీపు,దివ్యల కూతురు  ధార్వి

గోగినేని అనిత, సుధీర్ లకు కు కొడుకు భార్గవ్ సాయి, కూతురు సుష్మ

సుష్మ, నాగళ్ళ రాజేష్ లకు కొడుకు మోనీష్


దాసరి కృష్ణవేణి, రాధాకృష్ణలకు ఇద్దరు కొడుకులు

వెంకట కృష్ణారావు, శివ ప్రసాద్

కృష్ణారావు,నీలిమలకు ఇద్దరు కొడుకులు బాబి, పండు

శివ ప్రసాద్, లక్ష్మిలకు కూతురు భావన


భూషయ్య, నాగమ్మలకు ఆడపిల్ల వెంకటరత్నం, దేవినేని శేషయ్యకు ఇద్దరు కొడుకులు సత్యన్నారాయణ, పాండురంగారావు,ఇద్దరు కూతుర్లు

పెద్దమ్మాయి, గద్దె వెంకట సత్యన్నారాయణలకు ఇద్దరు అబ్బాయిలు, ఒకమ్మాయి , వారికి పిల్లలు

చిన్నామె విజయ, యలవర్తి రామారావు లకు ఇద్దబ్బాయిలు కృష్ణప్రసాద్, సతీష్

కృష్ణప్రసాద్, సరస్వతి లకు పాప, బాబు.


అబ్బాయి కోటేశ్వరరావు, భారతి లకు ఇద్దరు కూతుర్లు

పెద్దమ్మాయి సామ్రాజ్య లక్ష్మి, పాండురంగారావు (భూషయ్య గారి కూతురు కొడుకు దేవినేని పాండురంగారావు)కి కొడుకు సత్యకృష్ణ, కూతురు సుజని, నాగ రాజకుమార్ కు ఇద్దరు ఆడపిల్లలు లాక్షణ్య, సోహిత

చిన్నామెకు(భారతి తమ్ముడికి ఇచ్చారు) 

మండవ శ్రీనివాసరావు - వెంకట రమణ ల కూతుర్లు 

మమత - ధనుంజయ రావు ల పిల్లలు దార్షిక్, చరిత్

మంజుల - సుబ్రహ్మణ్యం ల పిల్లలు రిషిక్, భాష్విక

 లక్ష్మి - ఆనంద్ ల కూతురు యామిని


రాఘవయ్య, గజేంద్ర(మేనకోడలు), స్వరాజ్యలక్ష్మిలకు ఓ అబ్బాయి రాధాకృష్ణ, ముగ్గురు ఆడపిల్లలు పార్వతి, గజేంద్ర, కోటేశ్వరి

రాధాకృష్ణ, బసవేశ్వరిలకు నలుగురు కూతుర్లు రాధ, కృష్ణ, లీల, లక్ష్మి, కొడుకు రాజా వరద రాఘవయ్య(బుడ్డి)

వల్లభనేని సత్యనారాయణ, రాధల కొడుకు నవీన్, కూతురు సిందు

సిందు,కార్తీక్ ల కొడుకు వేద

దాసరి మురళికృష్ణ, కృష్ణకు ఇద్దరు కొడుకులు అనుదీప్, తేజ

అనుదీప్, పూర్ణిమల కొడుకు అభయ్

లీల, వల్లభనేని శ్రీనివాస్ లకు ఇద్దరు కొడుకులు శ్రీకర్, అనిరుద్

లక్ష్మి(చిన్ని), గొట్టుముక్కల రవి కుమార్ ల కూతురు హరిత

రాజా వరద రాఘవయ్య, బబితలకు ఇద్దరు కొడుకులు సుహాస్, సాయి నిహాస్


నాగళ్ళ ఉమా మహేశ్వరరావు, పార్వతిలకు ఇద్దరు కొడుకులు సూర్య వర్థనరావు, సుధాకర రావు,

వర్థన, నళిని కుమారిలకు ఇద్దరు కూతుర్లు సుశ్రుత, సుదీప్తి, 

సుదీప్తి, పాతూరి రవీంద్రనాథ్ లకు మిృదన్ చంద్ర, భార్గవి 

సుశ్రుత, ధూళిపాళ ప్రత్యూష్ లకు కూతురు ఆశ్రిత

సుధాకర్, విజయలకు కూతురు రాధిక, కొడుకు రాజా(రాంగోపాల్)

రాధిక, కుర్రా సీతారామకృష్ణలకు ఇద్దరు కూతుర్లు రోహిత, దక్షిత 

ఆడపిల్లలు 

రాణి ( లక్ష్మి రాజ్యం), వేమూరి వెంకట కృష్ణ వరప్రసాద్ లకు ఇద్దరు కొడుకులు

వంశీకృష్ణ, శిరీషలకు నికిత్, లికిత్

నరేష్, భవానిలకు జస్మంత్, వినీత్

గజేంద్ర కుమారి,గొర్రెపాటి(కోటేశ్వరరావు)బాబుకి కూతురు సరిత, కొడుకు గోపాలకృష్ణ(బాబు)

సరిత, మధులకు ఇద్దరు కొడుకులు ఉదిత్ చౌదరి, రోహిత్ చౌదరి

బాబు, లక్ష్మీభవానిలకు  కొడుకు భరత్ సాయి, కూతురు హాసిని

గుణ( ప్రమీలారాణి), పాలడుగు విశ్వనాథ్ లకు అనూష , అభినాష్

అనూష, హర్ష కిరణ్ లకు సుధీక్ష, సమీక్ష

అభినాష్, ప్రియాంకలకు ఈశాన్య, శ్రీఅయాన్

కృష్ణ కుమారి, అన్నె కృష్ణలకు ఇద్దరు కొడుకులు

సుబ్రమణ్య నవీన్, నాగ వెంకట హారికకు కొడుకు లలిత్ ఆదిత్య

మదన్  రాజకుమార్, వందితలకు కొడుకు హార్య దేవ్


గజేంద్ర, రావి నాగేశ్వరరావులకు ఇద్దరు కొడుకులు శ్రీనివాస్, సతీష్, కూతురు రాణి రత్న

శ్రీను, అజితలకు కూతుర్లు గనకొర, శ్రీనా చౌదరి, 

సతీష్‌, ఆశ్లేషలకు ఇద్దరు కొడుకులు ప్రభాస్, కుశాల్

కోటేశ్వరి, మేకా ధనుంజయరావులకు కూతురు స్వరాజ్యలక్ష్మి (పాప) వేములపల్లి శ్రీనివాసరావులకు కూతురు, కొడుకు

కూతురు  సుజన, కంఠమనేని కృష్ణ సందీప్ లకు శ్లోక, సాత్విక్

విజయ కృష్ణ, సుష్మ 


ఏడు తరాల సమాచారం, సమాచార సేకరణలో సహకరించిన అందరికి ధన్యవాదాలు..


నాకు తెలిసిన సమాచారమిది.

16, ఏప్రిల్ 2023, ఆదివారం

అయోమయం..!!

ఏ కన్నుని ఏ కన్ను పొడిచిందో!

ఏ చెయ్యి ఏ మెడను నరికిందో!

ఏ మాయ ఎందరిని అయోమయంలో పడేసిందో!

ఏ ముక్క ఎవరిదో!

ఏ చుక్క ఎవరి గొంతుని తడిపిందో!

ఏ ధనము ఎక్కడ చేరిందో!

ఏ నవ్వు వెనుక ఏ ఏడుపో!

ఏ బెణుకు ఎందుకో!

ఏ వణుకు దేనికో!

ఏ ప్రయాణమెందుకో!

ఏ ఆత్మ ఎప్పుడెవరితో మాట్లాడుతుందో!

ఏ మార్పు ఎందుకోసమో పరమాత్మా!

జీవన మంజూష మే 23

నేస్తం,

       “ తప్పులెన్నువారు తమ తప్పులెరుగరుఅని వేమన చెప్పిన మాట నిజమని మనకు తెలుసు. అయినా మన లోపాలు మనకి తెలిసినా వాటిని దాయాలని యత్నిస్తూ, ఎదుటివారి తప్పులను ఎంచడానికి భలే సరదా పడతాం. మనిషి నైజం ఇంతగా అభివృద్ధి చెందడానికి కారణాలు సవాలక్ష. “ మనంఅన్న పదం మనం మర్చిపోయి రెండు తరాలు కావచ్చిందనుకుంటా. గూడు ఒకటే అయినా గూటిలో గువ్వలు బోలెడు రకాలు. కష్టం నాది కానప్పుడు ఎవరెలా పోతే నాకేంటి? అన్న మనస్తత్వాలు మన చుట్టూనే ఎన్నో తిరుగాడుతున్నాయి. కలికాలం ఇంతేననుకుంటూ సరిపెట్టేసుకు బతికేస్తున్నామిప్పుడు.

          ఎదుటివారిలో లోపాలు ఎత్తి చూపినంత త్వరగా మన తప్పును మాత్రం ఒప్పుకోలేం. మన చూపు ఎంత తీక్షణమంటే తెల్ల కాగితంలో చిన్న నల్ల చుక్కను చూసినంత బాగా కాగితంలో తెలుపు కనబడదు మరి. మనిషన్నాక లోపాలు సహజమే. అసలు లోపం లేకపోతే మనిషే కాడు. మనం చేస్తే ఒప్పు, ఎదుటివాడు అదే పని చేస్తే తప్పు కాదు కాదు భరించరాని నేరమని మనం భావించడంలో అస్సలు మన తప్పే లేదు గాక లేదు. సమస్య తలుపు తట్టని గుమ్మం భూప్రపంచంలోనే ఉండదు. కాకపోతే కాస్త సమయమటూ ఇటూ అవుతుందంతే. కాస్త సమయానికే మన మిడిసిపాటును మనం బయటేసేసుకుంటాం.

            ధనమయినా, పేరయినా మనకు చెప్పి రాదు. చెప్పి పోదు. కర్మానుసారం జరిగే మంచి చెడులకు మనం గొప్పలు చెప్పుకోవడం ఎందుకో! మూలాలను మరిచిపోతున్న మనకు, మన పేక మేడలు కూలిపోవడానికెంత సమయం కావాలో తెలుకోలేక పోవడం విచారకరం. వస్తూ ఏమి తీసుకురాని మనకు పోతూ కూడా ఏమి తీసుకుపోలేమనీ తెలుసు. అయినా మన నైజాలను కాస్తయినా మార్చుకోలేం. ఇది మన బలహీనత కావచ్చు. బంధాలు బలహీనమవడానికి మన ప్రవర్తనే ముఖ్య కారణం. మనం సరిగా ఉంటేనే కదా మన తరువాత తరాలకు మంచేదో, చెడేదో చెప్పగలం. అలా చెప్ప గలిగిన అర్హత మనకు ఉందా! చెప్పాల్సిన అవసరం లేదని మనం వదిలేసినప్పుడు మనమెలా వున్నా తప్పు లేదు. ఎవరెలా పోయినా మనకు సంబంధ బాంధవ్యాలు కూడా ఉండవు

               బంధాన్ని నిలుపుకోవడం చాలా కష్టమైన పని. అదే బంధాన్ని దూరం చేసుకోవడం చిటికెలో అయిపోతుంది. మన అవసరాలకు అనుబంధాలను కలుపుకుంటూ, అవసరం తీరాక అనుబంధమంటే ఏమిటో ఎరగని జీవాలు కోకొల్లలు ఇప్పుడు. వారికి గురుతులంటూ ఏమి ఉండవు, జ్ఞాపకాలసలే ఉండవు. దీనిలో వారిని తప్పు పట్టడానికి కూడా ఏమి లేదు. పాపం వారి సహజ లక్షణమది అని సరిపెట్టేసుకుని మన దారిలో మన ప్రయాణం సాగించడమే నేటి రోజుల్లో మంచి పని





           

14, ఏప్రిల్ 2023, శుక్రవారం

మారని నైజాలు..!!

నేస్తం 

       పొద్దుపొద్దున్నే కొందరు జనాల తీరు చూసి చీదర వేస్తోంది. చాన్నాళ్ళ నుండి ఎదురౌతున్న మనస్తత్వాలే కాని, బాగా కోపం వచ్చేస్తోంది. పొద్దున్నే బోలెడు మంచిపనులు చేసేయాలని, సమాజాన్ని ఉద్దరించేయాలని, పూజలు పునస్కారాలని ఇలా బోలెడు పనుల్లో తలమునకలౌతుంటాం మనం. 

        చిన్నవాళ్ళో, తెలియని వాళ్ళో అయితే మనమూ సరిపెట్టుకోవచ్చు. మనం పట్టణాల్లో అపార్ట్మెంట్లలో చాలా నాగరికంగా బతికేస్తున్నామని ఓ..తెగ ఫీల్ అయిపోతున్నామిప్పుడు. కొత్త పిచ్చోడు పొద్దెరగడన్నట్టన్న మాట. మనమెక్కడి నుండి వచ్చామన్న మూలాలను మరిచిపోయాం. మన బాధ్యతలు, బంధాలు గుర్తుండవు కాని స్వచ్ఛ సేవలు మాత్రం పొంగుకు వస్తాయి. మనం ఆధునికంగా బతుకుతున్నామనుకుంటే సరిపోదు. మన ప్రవర్తన అలాగే కూడా ఉండాలి కదా. 

       మనకి అత్యాధునిక సౌకర్యాలతో ఇల్లున్నా, బయట ఒకటి, రెండు వగైరాలు ఎక్కడబడితే అక్కడ చేయవచ్చు. ఏ పెంపుడు జంతువులు కూడా మన ఇంటి చుట్టుపక్కల ఓ నాలుగు కిలోమీటర్ల వరకు తిరగను కూడా తిరగకూడదు. బయట ఖాళీ స్థలాలు, రోడ్లు కూడా మనవే మరి. మన అమ్మాబాబు ఇచ్చిన ఆస్తులు కదా. రేపోమాపో పోయేవాళ్ళ దగ్గర నుండి కాస్త మధ్య వయసు వారి వరకు చాలామంది ప్రవర్తన ఇలానే వుంది. 

         ఊరకుక్కలు దాడి చేస్తున్నాయి. వాటిని చంపేయమంటున్నారు. సరైన పనే అది. మరి అదే చట్టం ఊరమనుషులకు కూడా అమలు చేయమని ఎవరూ మాట్లాడరు ఎందుకని. పిల్లలను బయట వదిలేయడం మన తప్పు. పిచ్చికుక్కలు దాడి చేస్తాయి. మన పిల్లల సంరక్షణ మనమే చూసుకోవాలి. ఒక్కోసారి ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్ని అమానవీయ సంఘటనలు జరుగుతాయి. అన్నీ తెలిసిన మనుషులకే మంచి చెడు అని లేనప్పుడు ఊరకుక్కలు ఎంత చెప్పండి? 

          ఇప్పటికి చెత్త పన్ను కూడా కడుతున్నాం. రేపటి నుండి మనిషికి, పెంపుడు జంతువులకు కూడా పన్ను కట్టించుకుంటారేమో. పోయేదేముంది కట్టేద్దాం కట్టేద్దాం. ఉచితాలకు అలవాటు పడిన ప్రాణాలు కదా. ఏ పన్ను వేస్తే మనకేంటి? మనదంతా అర్ధరాత్రి పాలనే కదా..!! యథా రాజా..తథా ప్రజా…!!

6, ఏప్రిల్ 2023, గురువారం

రెక్కలు

​1.  పదాలు 

కావివి

మనసు

మౌనాలు


పరిచయమున్న

కల’వరింతలు..!!

2.  మరపు

మనసుకి తెలియదు

సంద్రం

దేనిని వద్దనదు


కాలం

నిర్విరామం..!!

3.  పరిచయం 

క్షణకాలమే

బంధం

అచిరకాలం


అక్షరమైత్రి

అజరామరం..!!

4.  తడబడే

అడుగులు

తెలిసిన

గమ్యము


పాదాలెప్పుడూ పసివే 

వయసుడిగినా..!!

5.  చిత్తం

చిత్రమైనదే

అనంతం

అంతుచిక్కనిది


కాలం

చురుకైనది..!!

6. చాటుమాటు

బతుకులు

సన్నాయి

వాయిద్యాలు


మహా గొప్ప

వ్యక్తిత్వం..!!

7.  అబద్ధానికి

అండెక్కువ

నిజమెప్పుడూ

ఒంటరే


కాలమే

తీర్పు..!!

8.  దారులు

బహు విధాలు

రహదారి

ఒక్కటే


ఎంచుకోవడమే

విజ్ఞత..!!

9.  ఒకప్పుడు

నమస్కారం

ఇప్పుడు

కరచాలన ఆలింగనాలు


ఆధునికత

పల్లెల్లోనూ..!!

10.  దయదలిస్తే

ఇంటికూడు

కాదంటే

చిప్పకూడు


మదపుటేనుగైనా

మావిటికి మాలిమే..!!

11.  విజన్

కలిగినోడు

ప్రిజన్ లో

ఉన్నోడు


నాయకుడు

ఎవరు..?

12.  ఏలిముద్రల

ఇలువ

సదూకున్నోడి

సంస్కారం


అధికారానిది

రాజభోగమే..!!

13.  పిల్లలు

తల్లిదండ్రులు

అనాథలు

ఎవరు?


ఆశ్ర(యా)మాలు

అవసరమెవరికి..?

14.  ఎవరు

ఎవరిని పోషించారు

ఎవరిది

ఎవరు తింటున్నారు


పైవాడికన్నీ

ఎరుకే..!!

15.  పెంచుకుంటే

దూరం

పంచుకుంటే

అనుబంధం


నిర్ణయం

మనదే..!!

16.  పెద్ద

కల

చిన్న

ఆశ


అవసరం

మింగేసింది..!!

17.  కూర్పుకు

ఓర్పు

భాషకు

నేర్పు


వాగ్దేవి

వరమే..!!

18.  వరమైన

శాపం

మనసుని

ఓదార్చడం


కాలంతో స్నేహిస్తున్న 

అక్షరాలు..!!

19.  కొన్ని బంధాలకు 

తులసినీళ్ళు వదిలేయడమే

అనుబంధాలను 

సం’బంధాలుగా మార్చేసాక


కాలానికి

అతీతులు కారెవ్వరూ..!!

20.  ఏమున్నది

ఏ బంధంలోనైనా

ధనసం’బంధం

మనదయ్యాక


బుుణపాశాలు

వీగిపోతున్నాయి..!!

21.  ముడుపుల

చెల్లింపు

పాలెస్

ఫ్యూచర్


ఆకాశయానం

ఆంతర్యం..!!

22.  చీమా

పామా

ఏ గుట్టలో

ఏ గుట్టుందో


పెట్టించింది

పైవాడే..!!

23.  వాయిదాలు

వద్దనలేము

తీర్మానాలు

చేయకుండలేము


బతుకు

భయమది..!!

24.  మాజీలు

అవడం

తాజాలు

కావడం


కాలం 

గారడీ..!!

25.  న్యాయానికి

ఒకే దారి

అన్యాయానికి

రాచబాటలు కోకొల్లలు


వ్యవస్థలు

అధికారానివే..!!

26.  అక్రమం

సక్రమం

ఏదైనా 

ఓ క్రమమే


ని’ర్వచనమే

తేడా..!!

27.  దాటించడం

దాటేయడం

సుళువైన 

పనే


కొందరికే అబ్బే

చతురత..!!

28.  దార్శనికత

కనబడుట లేదు

దరిద్రం

వద్దన్నా వెంటబడుతూనే వుంది


కలి

ప్రభావం..!!

29.  సాక్ష్యం

చెల్లదు

అభియోగం

అత్యం బలమైనది


నేటి

వ్యవస్థ..!!

30.  ఏలిముద్రల

ఎకసెక్కాలు

మేధావి

మౌనం


వ్యక్తిత్వం

తేటతెల్లం..!!

5, ఏప్రిల్ 2023, బుధవారం

అవ్యక్తం నవమల్లెతీగలో

​ధన్యవాదాలు కలిమిశ్రీ గారికి



జీవన మంజూష ఏప్రియల్ 23

నేస్తం,

         బంధాలు, అనుబంధాలు అనేవి మనం పెంచుకునేదాన్ని బట్టి వుంటాయి. వీటికి ప్రాణమున్న జీవులా లేదా వస్తువులా అని వుండదు. సృష్టిలో బంధాలు సుళువుగానే ఏర్పడతాయి, తెగిపోతాయి. కాని అనుబంధం ఏర్పడితే అంత సుళువుగా తెంచుకోలేము, అది వస్తువయినా, మనిషయినా, జంతువయినా, మెుక్కయినా. దీనికి సమయంతో పని లేదు. క్షణాలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాల తరబడి మనం వాటితో గడపనక్కర్లేదు. కొన్ని పరిచయాలు అనుబంధంగా మారడానికి క్షణాల సాహచర్యం సరిపోతుంది. మరికొన్ని బంధాలు సంవత్సరాల తరబడి కలిసున్నా అనుబంధంగా మారలేవు. వీటికి మనసుల మధ్యన ఆంతర్యాలు, అపోహలు కారణాలుగా మిగిలిపోతున్నాయి.

           ఈరోజుల్లో పిల్లలు, పెద్దల మధ్యన దగ్గరతనం అంతగా వుండటం లేదనే చెప్పాలి. ఆధునిక టెక్నాలజీ వచ్చి అనుబంధాన్ని తనతోనే తీసుకు వెళిపోతోంది. అమ్మానాన్న లేకున్నా పిల్లలు పట్టించుకోరు కాని, సెల్ ఫోను లేకపోతే వారికి ప్రపంచమే చీకటిగా మారిపోతున్న రోజులివి. అమ్మానాన్న అవసరాలకు మాత్రమే అనుకుంటూ, కాలంతోపాటుగా తామూ పరిగెడుతున్నామని సంబరపడిపోతున్నారు. మనమేమో మనం కష్టపడ్డాం కదా, మన పిల్లలకి కష్టం తెలియకుండా వుండాలని, వారు అడిగినవి సమకూర్చే పనిలో పిల్లలను పట్టించుకోవడం తగ్గించేస్తున్నాం. ఇది ఇలానే జరుగుతూ పోతే మన పిల్లలు కూడా మనల్ని గుర్తించని పరిస్థితి రావచ్చేమో రేపటి రోజున.

           కాలానికి కట్టుబడిపోతూ మనమూ కాల ప్రవాహంలో కొట్టుకుపోతున్నాం. దానినే పురోభివృద్ధి అనుకుంటున్నాం. సాంకేతికంగా ఎదుగుదల మంచిదే కాని మనిషి మనుగడకే ప్రమాదకరమౌతున్న శాస్త్రీయత ఎంతవరకు మంచిది అన్న ఆలోచన కూడా పొడజూపుతోందిప్పుడు. రాతియుగం నుండి నేటి అంతరిక్ష పయనం వరకు చూసుకుంటే మనిషి మేధస్సు ఎంతో అభివృద్ధి చెందింది. మానవ జీవన అవసరాలకు అనుగుణంగా. కాకపోతే మేధస్సు కొందరి వికృత ఆలోచనలకు పరాకాష్ఠగా ప్రపంచ వినాశనానికి, మానవ మనుగడకు ప్రమాదకారిగా మారుతోంది

              ఏదేమైనా అతి అనర్ధదాయకమన్నది మాత్రం నిజం. అది విషయంలోనైనా వర్తిస్తుంది. సమాజం బావుండాలంటే సదరు వ్యక్తుల మధ్యన సత్ సంబంధాలు నెలకొనాలి. అది ఇంటా బయటా కూడా వుండాలి. మనం మాత్రమే బావుంటే చాలన్న ఆలోచన నుండి మనతోపాటా మరో నలుగురు కూడా బావుండాలని కోరుకునేంతగా మనం ఎదగాలి. ఆధునికంగా ఎదగడం కాదు అనుబంధాలతో ఎదగడంలోనే అసలైన ఆనందం వుంటుందని మనమెరిగిన నాడు మనిషిగా మనం గెలిచినట్లే..!!






 

చెప్పలేనితనం..!!

బాధ్యత 

భరించలేనంత

బరువుగా మారుతుందని

బంధానికి తెలియలేదప్పుడు


కష్టాన్ని

ఇష్టంగా మలుచుకుంటే

నష్టపోతున్న కాలం 

మృష్టాన్న భోజనాన్ని తలపిస్తుందేమో


కోపం

శాపంగా మారక మునుపే

శాంతం చుట్టమైతే

భారం మనసు భరించేస్తుందేమో


ముందు తరానికి

మునుముందు వారసత్వానికి

నడుమ మిగిలి నలుగుతూ

నవ్వుల కన్నీరు అలంకారమైందిప్పుడు


వెలుతురు చుక్కలు

రాతిరి రవ్వల రేఖలు

ఏ కాంతి పుంజాలను తలపిస్తాయోనని

ఆశల ఆకాశాన్ని అడిగేయడమే..!!

2, ఏప్రిల్ 2023, ఆదివారం

ఏమో..!!

ఆంతర్యాన్ని

ప్రతి క్షణమూ

సముదాయిస్తూ

రాసానేమో..


అక్షరాల

సహవాసంతో

శూన్యమూ

చుట్టమై పోయింది..!!

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner