1. పదాలు
కావివి
మనసు
మౌనాలు
పరిచయమున్న
కల’వరింతలు..!!
2. మరపు
మనసుకి తెలియదు
సంద్రం
దేనిని వద్దనదు
కాలం
నిర్విరామం..!!
3. పరిచయం
క్షణకాలమే
బంధం
అచిరకాలం
అక్షరమైత్రి
అజరామరం..!!
4. తడబడే
అడుగులు
తెలిసిన
గమ్యము
పాదాలెప్పుడూ పసివే
వయసుడిగినా..!!
5. చిత్తం
చిత్రమైనదే
అనంతం
అంతుచిక్కనిది
కాలం
చురుకైనది..!!
6. చాటుమాటు
బతుకులు
సన్నాయి
వాయిద్యాలు
మహా గొప్ప
వ్యక్తిత్వం..!!
7. అబద్ధానికి
అండెక్కువ
నిజమెప్పుడూ
ఒంటరే
కాలమే
తీర్పు..!!
8. దారులు
బహు విధాలు
రహదారి
ఒక్కటే
ఎంచుకోవడమే
విజ్ఞత..!!
9. ఒకప్పుడు
నమస్కారం
ఇప్పుడు
కరచాలన ఆలింగనాలు
ఆధునికత
పల్లెల్లోనూ..!!
10. దయదలిస్తే
ఇంటికూడు
కాదంటే
చిప్పకూడు
మదపుటేనుగైనా
మావిటికి మాలిమే..!!
11. విజన్
కలిగినోడు
ప్రిజన్ లో
ఉన్నోడు
నాయకుడు
ఎవరు..?
12. ఏలిముద్రల
ఇలువ
సదూకున్నోడి
సంస్కారం
అధికారానిది
రాజభోగమే..!!
13. పిల్లలు
తల్లిదండ్రులు
అనాథలు
ఎవరు?
ఆశ్ర(యా)మాలు
అవసరమెవరికి..?
14. ఎవరు
ఎవరిని పోషించారు
ఎవరిది
ఎవరు తింటున్నారు
పైవాడికన్నీ
ఎరుకే..!!
15. పెంచుకుంటే
దూరం
పంచుకుంటే
అనుబంధం
నిర్ణయం
మనదే..!!
16. పెద్ద
కల
చిన్న
ఆశ
అవసరం
మింగేసింది..!!
17. కూర్పుకు
ఓర్పు
భాషకు
నేర్పు
వాగ్దేవి
వరమే..!!
18. వరమైన
శాపం
మనసుని
ఓదార్చడం
కాలంతో స్నేహిస్తున్న
అక్షరాలు..!!
19. కొన్ని బంధాలకు
తులసినీళ్ళు వదిలేయడమే
అనుబంధాలను
సం’బంధాలుగా మార్చేసాక
కాలానికి
అతీతులు కారెవ్వరూ..!!
20. ఏమున్నది
ఏ బంధంలోనైనా
ధనసం’బంధం
మనదయ్యాక
బుుణపాశాలు
వీగిపోతున్నాయి..!!
21. ముడుపుల
చెల్లింపు
పాలెస్
ఫ్యూచర్
ఆకాశయానం
ఆంతర్యం..!!
22. చీమా
పామా
ఏ గుట్టలో
ఏ గుట్టుందో
పెట్టించింది
పైవాడే..!!
23. వాయిదాలు
వద్దనలేము
తీర్మానాలు
చేయకుండలేము
బతుకు
భయమది..!!
24. మాజీలు
అవడం
తాజాలు
కావడం
కాలం
గారడీ..!!
25. న్యాయానికి
ఒకే దారి
అన్యాయానికి
రాచబాటలు కోకొల్లలు
వ్యవస్థలు
అధికారానివే..!!
26. అక్రమం
సక్రమం
ఏదైనా
ఓ క్రమమే
ని’ర్వచనమే
తేడా..!!
27. దాటించడం
దాటేయడం
సుళువైన
పనే
కొందరికే అబ్బే
చతురత..!!
28. దార్శనికత
కనబడుట లేదు
దరిద్రం
వద్దన్నా వెంటబడుతూనే వుంది
కలి
ప్రభావం..!!
29. సాక్ష్యం
చెల్లదు
అభియోగం
అత్యం బలమైనది
నేటి
వ్యవస్థ..!!
30. ఏలిముద్రల
ఎకసెక్కాలు
మేధావి
మౌనం
వ్యక్తిత్వం
తేటతెల్లం..!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి