6, జులై 2023, గురువారం

ఏకాకి..!!


ఏకాకి మేఘమెుకటి

ఎగిరెగిరి పడుతోంది

అహపు కళ్ళాలను

అటు ఇటు విసురుతూ


తాటాకు చప్పుళ్లకు

తల్లకిందులు కావేవి

తలవిసురు గాలులకు

తడబడిపోరెవ్వరూ


గుట్టుగా గుప్పెట్లో

దాయాలనుకోవడమంటే

అనంతాన్ని అలవోకగా

ఏలేద్దామన్న అత్యాశేగా


అందలాలెక్కామన్న

అతిశయం చూపిస్తూ

ఆంతర్యాన్ని నిద్రపుచ్చి

క్రోధపు కోరలను విసరడమే లక్ష్యం


ఎందరితో తానున్నా

ఎవరికి ఏమి కాని చుట్టరికమే

తన చుట్టూ బంధాలెన్నున్నా

అనుబంధాలతో మనలేని ఒంటరే ఎప్పుడూ..!!


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner