16, జులై 2023, ఆదివారం

దాహం దాహం సమీక్ష

 దాహం దాహం..!!


మనిషిలో లోపాలను, సమాజంలో ప్రతి వ్యవస్థలోని లొసుగులను అద్దంలో చూపినట్లుగా చాలా చక్కగా చెప్పారు. “ మాటతో మెుదలైన దీర్ఘ కవిత్వం, మనసును అడిగే ప్రశ్నలకు తీరని దాహమై అక్షర దాహంగా మెుదలై, పదాలతో ప్రవహించి, మనిషిదాహాన్ని, మనసుదాహాన్ని కలిపి తాత్విక గవాక్షం నుండి వెలువడి విశ్వదాహంగా మన ముందుకుదాహం దాహందీర్ఘ కవితగా చిన్ని నారాయణరావు గారు వెలువరించారు. దాహ శీర్షికలకు తగ్గట్టుగా చిత్రాలతో చూడముచ్చటగా అనిపించింది

      మనిషి అహంతో మెుదలైన దాహం అధికారం, అహంకారం, బలం, బలగం, చదువు, వ్యాపారం, వైద్యం, ఆధునిక, అంతరిక్ష, విజ్ఞాన, విలాసాలు..ఇలా ప్రతి విషయాన్ని వివరిస్తూ, వాటిలోని లోపాలకు అక్షర చురకల దాహాన్ని అందిస్తూ తన దాహా ప్రయాణాన్ని సాగించారు. రాజకీయ దాహం నుండి సాహితీ దాహం వరకు సమాజంలోని ప్రతి కోణాన్ని స్పృశించారు. నాకు బాగా నచ్చినది మైకు దాహం

     దాహం దాహంతో మెుదలుబెట్టి పదమూడు దాహాలలో విశ్వదాహాన్ని గ్రోలమని అక్షర దాహార్తిని పదాలలో పొందుపరిచి మన ముందుకుదాహం దాహందీర్ఘ కవితనుంచారు. అద్భుతమైన అక్షర దాహతృష్ణకు హృదయపూర్వక శుభాభినందనలు చిన్ని నారాయణరావు గారు


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner