9, సెప్టెంబర్ 2023, శనివారం

ఎదురీత పుస్తక సమీక్ష..!!


                         కొందరికి  ఎదురీతగెలుపు బావుటా..!!

       ప్రతి మనిషి జీవితంలో ఆటుపోట్లు అనేవి సహజం. అలా అని విధికి ఎదురు నిలిచి జీవన పోరాటం సాగించి విజయ బావుటాలను ఎగురవేసేవారు చాలా కొద్దిమంది మాత్రమే. తను నమ్మిన సిద్ధాంతాల కోసం ఎక్కడా రాజీ పడకుండా, సమాజానికి మంచి చేయాలన్న తలంపుతో ఏటికిఎదురీదినఉన్నతుడుఉన్నం వెంకటేశ్వర్లు గారు. కమ్యూనిజానికి సరైన అర్థం చెప్పిన సాహసి. వీరి సహచరి ఉష గారు కూడా ఉన్నం వెంకటేశ్వర్లు గారి  “ ఎదురీతలో సహ భాగస్వామి. అర్ధ నారీశ్వర తత్వానికి సరైన నిర్వచనం వీరిద్దరు. వీరిరువురిని ఇక్కడ ఇలా పోల్చకుండా ఉండలేక పోతున్నాను.

     శారీరక అంగ వైకల్యాలు ఏవి తాము నమ్మిన సిద్ధాంతాలకు అడ్డు గోడలు కావని ఉన్నం వెంకటేశ్వర్లు గారి జీవితాన్ని కాస్త చూసిన మనకు అర్ధమైపోతుంది. చిన్నతనం నుండే విధితో పోరాటం మెుదలు పెట్టి, కమ్యూనిజం భావజాలాలకు ఆకర్షితులై, చదువు, ఆటపాటల్లో మేటిగా ఉంటూ, సవ్యసాచిగా అందరి మన్ననలు పొందిన అనితరసాధ్యుడు. చిన్ననాటి నుండి జరిగిన ప్రతి చిన్న విషయాన్ని తనదైన శైలిలో వివరిస్తూ, సమాజ అభ్యున్నతికి  తాము చేసిన పనులను భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా అందించాలన్న సదుద్దేశ్యంతోఎదురీతను చాలా గొప్పగా ఆవిష్కరించారు. అసలైన కమ్యూనిజాన్ని, దాన్ని అమలు పరిచిన నాయకులను ఇలా ఉద్యమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని నెనుపు చేసుకుంటూ, తాము అధిగమించిన కష్టనష్టాలను కూలంకషంగా వివరించారు. కొన్ని విలువైన ఫోటోలను కూడా అందించారు

   ఏదైనా ఒక సిద్ధాంతం రూపుదిద్దుకోవడానికి, జనంలోనికి వెళ్లడానికి వెనుక ఎంత శ్రమ, కఠోర దీక్ష అవసరమౌతాయో మనకు ఎదురీతచెబుతుంది. మన చుట్టూ ఉన్న ఎంతోమంది మానసిక వైకల్యమున్న వారికన్నా, ఉన్నం వెంకటేశ్వర్లు గారు ఉన్నతులు. సంకల్పం దృఢమైనదైతే శారీరక వైకల్యమైనా చేరాల్సిన లక్ష్యానికి అడ్డంకి కాదని వీరి జీవితం చెబుతుంది. మనసున్న ప్రతి ఒక్కరు తప్పక చదవాల్సిన పుస్తకంఎదురీత “.

అభిమానంగా పుస్తకం పంపినా, పుస్తకం చదివి కాస్త నా మాటలు రాయడానికి జరిగిన ఆలశ్యానికి ఉన్నం వెంకటేశ్వర్లు గారిని మన్నించమని కోరుతూవారికి ఆయురారోగ్యాలు పరిపూర్ణంగా కలహాలని కోరుకుంటూ, హృదయపూర్వక అభినందనలు..!

         

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner