10, సెప్టెంబర్ 2023, ఆదివారం

ఏమైంది..?

  బాబుగారు,

                   ఏమైంది ఇన్నాళ్ళ మీ రాజకీయ అనుభవం? తమ్మక్కాయిలు ఉన్నారని తెలిసినప్పుడు కాస్తయినా జాగ్రత్తగా ఉండాలి కదా! పునాదులు వేసినప్పుడు మరొకడెవడూ దానిని పెకలించడానికి లేకుండా చేయాలి. అధికారం ఏం చేయగలదో తెలిసి కూడా మీరింత నిర్లక్ష్యంగా ఉండబట్టే కదా రాష్ట్రానికి, తద్వారా మీకు, మాకు ఇన్ని సమస్యలు. ఒకప్పుడు మాది ఆంధ్రరాష్ట్రమని గర్వంగా చెప్పకున్న మేము ఇప్పుడు పరిస్థితిలో ఉన్నామో మీకే కాదు అందరికి తెలిసిన విషయమే. రాజధాని లేని రాష్ట్రంగా ప్రపంచ చరిత్రలో నిలిచిపోవడానికి మీరూ కారణమే..కాదంటారా

          భవిష్యత్ తరాలు బావుండాలన్న ముందుచూపు మంచిదే. అదే సమయంలో ప్రస్తుత స్థితిగతులు, మన చుట్టూ ఉన్న వలయాలపై కూడా కన్ను వేసి ఉంచాలి కదా. ఎన్నికలకు ముందు నుండి మేము మెుత్తుకుంటూనే ఉన్నాము. మీ నిర్లక్ష్యానికి మూల్యం ఇప్పటి అంధప్రదేశ్. ప్రతి క్షణం అవమానాలు ఎదుర్కొంటున్న మీ మద్దత్తుదారులు. సమస్య వచ్చినప్పుడు ఆలోచించడం కాదు, అసలు సమస్య పుట్టకుండా చేయగల సత్తా మీకుందని నమ్మిన జనాలు, చాలా బాధ పడుతున్నారిప్పుడు. అధికారం కోసం దారులలోనైనా వెళ్ళగల ప్రత్యర్థులు ఉన్నారని మీకు తెలియదా

            మీరు చేసే మంచి ఎవరికి అవసరం లేదిప్పుడు. క్షణం మాకు గడిచిందా లేదా అన్న ఆలోచన మాత్రమే మాది. మేం సామాన్యులం. రోజు అమెరికా అవకాశాలు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చాయంటే కారణమెవరని మేం ఆలోచించం. ఎవరు రహదారులు వేసారన్నది అప్రస్తుతం మాకు. భవిష్యత్ తరాలు ఎలా పోతే మాకెందుకు? మేం ఇప్పుడు ఎలా ఉండాలన్నదే మాకు ముఖ్యం. ఎందుకంటే మూడు ముక్కలాటలు, మద్యం సిండికేట్లుఇలాంటివి మాకుంటే చాలు. ఇచ్చే వాటి లెక్కలే చూస్తాం కాని తీసుకునే వాటి లెక్కలు మాకెందుకు

          మేమింతే ఉంటాం. మమ్మల్ని బట్టి మీరుండాలి కాని మిమ్మల్ని బట్టి మేముండం. ఇది గుర్తుంచుకోండి. ఇక్కడి సంగతి, పైవాడి సంగతి, పక్కవారి సంగతి మీకు తెలుసు. తెలిసి పరిస్థితి వచ్చిందంటే తప్పెక్కడో ఆలోచించండి. మాకు మంచి రోజులు రాకపోయినా పర్లేదు. చూపించే వేళ్ళ సంగతి చూడండి ముందు.


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner