1. అక్షరాలు నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తున్నాయట_మాటల యుద్ధానికి విరామమంటూ..!!
2. వర్తమానంతో పనేముంది_వాస్తవంలో మనమున్నప్పుడు..!!
3. ఇద్దరి ఆలోచనా ఒకటే_ఏ వైపున ఎవరున్నా..!!
4. కథలుగా అల్లినప్పుడు కలగనలేదు_కఠోర సత్యమై నిలుస్తావని..!!
5. అంతరాల అడ్డుదేముంది_ఆంతర్యాలు ఒకటైనప్పుడు..!!
6. కనులొలికించే భావమెుక్కటే_కలవని తీరాలు తమవైనా..!!
7. బంధాలకు అడ్డం పడుతోంది_చూడొద్దనుకున్నప్పుడల్లా చూపు మరలక..!!
8. నిదుర నిండుకుండయ్యింది_రాతిరి కలలకు చోటీయకుండా..!!
9. కాగితపు పూలకూ సువాసనే_నీ ప(పు)లకరింపులు చేరి..!!
10. చీకటి చుట్టం_చుక్కల వెలుతురుకు చోటిస్తూ..!!
11. నీ ముందర అందరు భావుకులే_ఆస్థానం ఎవరిదైనా..!!
12. అపురూప క్షణాలను అందిపుచ్చుకుంటున్నా_చేజార్చుకోవడానికి మనసు రాక..!!
13. చదువుతూనే వుంటా_చివరి క్షణాలకు సైతం చిరునవ్వును అద్దుతూ..!!
12. పునః పరిచయం చేసుకుంటూనే ఉన్నా_మరుజన్మకు మరల వరమిస్తావని..!!
13. కల్పనలెప్పుడూ కనుల పండుగే_వాస్తవమై ఊరిస్తున్నట్టుగా..!!
14. కాలం కనికట్టిది_దగ్గరతనాన్ని దూరం చేస్తూ..!!
15. గురుతే లేదు ఏ కాలమూ_నీతోనున్న ఈ క్షణాలు నావని తలచి..!!
16. కలత పడ్డ మనసు_కలల విహారంలో విహరిస్తూ..!!
17. రహస్యమెప్పుడూ బహిరంగమే_విశ్వానికి తెలియకున్నా..!!
18. అనుబంధం అందని ఆకాశమే_బంధాన్నే కాదనుకున్నప్పుడు..!!
19. కడవరకు కలిసే నడవాలనుకున్నా_తడబాటును కనబడనీయక..!!
20. మనోకాశాన్ని పరికిస్తున్నా_కోల్పోయిన క్షణాలను తాకాలని..!!
21. అక్షరానికెంత మమకారమో_అమ్మ ప్రేమనంతా ఒలికించేస్తూ..!!
22. అన్నీ మరవాలన్న తపన_కాలం కొనల చిక్కుముళ్ళలో సతమతమౌతూ..!!
23. దగ్గరనే అనుకున్నా_దూరం పెంచుతారని తెలియక..!!
24. ఆ’దేశం అమలయ్యింది_నిర్ణయం, నిరీక్షణ మాటలు కలిపాక..!!
25. అక్షరం ఆలంబన అవుతూనే వుంది_చీకటి చిత్రానికి వెన్నెల రంగులద్దుతూ..!!
26. గగనం పరుగులెడుతూనే వుంది_కాలానికి ధీటుగా..!!
27. మనసు భారమనుకుంటా_మోపలేని బరువుగా..!!
28. కాలానికన్నీ సమానమే_స్థితప్రజ్ఞత తనదంటూ..!!
29. మనసు సేదదీరే చోటిది_మౌనం సాహచర్యంలో..!!
30. తప్పని యుద్ధమే మరి_తప్పించుకునే వెసులుబాటు తెలియక..!!