“ముసుగేసిన ఆకాశం”
“ముసుగేసిన ఆకాశం” అంటూ జీవితపు ముసుగుని తొలగించి నిర్మలమైన జీవితాకాశాన్ని తనదైన శైలిలో మన ముందు పరిచిన ముండూరు సాయిలక్ష్మి గారికి హృదయపూర్వక అభినందనలు.
ఓ సగటు మనిషి జీవితం అదీ మహిళైతే ఆ జీవితంలో ఎన్ని పార్శ్వాలు ఉంటాయో అన్నింటిని స్వచ్ఛంగా తనకు తెలిసిన, అలవాటున్న భాషలో “ముసుగేసిన ఆకాశం” అంటూ తన జీవితంలో ఇప్పటి వరకు జరిగిన సంఘటనలను పుస్తకంగా తీసుకువచ్చారు. పూర్వుల వివరాల నుండి తరాల సంగతులు, ఆచార, వ్యవహారాలు, చదువులు, సంప్రదాయాలు, ఉమ్మడి కుటుంబాల ఆనందాలు, అనుబంధాలు ఇలా ప్రతి విషయాన్ని చక్కగా వివరించారు. తన చిన్ననాటి నేస్తాలను, అల్లరి,ఆకతాయితనాన్ని, తన మెుండి ధైర్యాన్ని, తను పాటించిన జీవితపు విలువలను, తప్పుని సహించలేనితనాన్ని ఇలా ఒకటేమిటి..అన్నింటిని ఏ అరమరికలు, హంగులు, రంగులు లేకుండా స్వచ్ఛమైన మనసుని అక్షరాల్లో ఒదిగారు. అందుకేనేమో చదవడం ఆలశ్యమౌతుందని చెప్పి కూడా మెుత్తం చదివేటట్లు చేసారు. తన సాహితీ ప్రయాణాన్ని వివరిస్తూ కొన్ని కవితలను కూడా ఈ పుస్తకంలో అందించారు. ఈ చక్కని ప్రయత్నానికి హృదయపూర్వక అభినందనలు..
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి