1. ఎన్నో వ్యథలు
రాయని అక్షరాలు
కాగితంపై..!!
2. తన మానసం
మూగబోయింది
మాటల తూటాలతో..!!
3. మానసానికా
మమతల బంధానికా
అడ్డుగోడలు..!!
4. తుంటరితనమే
ఒంటరి పయనంలో
తుషారమై..!!
5. తన ద్వేషమూ
మర్చిపోని తనమే
మది అరల్లో..!!
6. భరించలేని
బాధ కల్గినప్పుడే
రాతకి రూపం..!!
7. ఆత్మాభిమానమే
ఆమె ఐశ్వర్యమైంది
అలంకారం..!!
8. రేపటి ఆశ
నిన్నల గమనింపు
జీవితపాఠం..!!
9. మనసులను
కుదిపేసిన మాట
శిలాక్షరాలై..!!
10. మది పొరల్లో
తచ్చాడే జ్ఞాపకాలు
నెమలీకలు..!!
11. మలిపొద్దులో
మబ్బుల మాటున
రాతిరి తాయిలం..!!
12. ఎన్నో బంధాలు
కొన్నే అనుబంధాలు
కాలం కొసలు..!!
13. కలనైపోయా
కలత నిదురలో
వెన్నెలగువ్వ..!!
14. మనసుపడ్డ
బంధాలే కొన్ని ఇలా
గాయపడ్డాయి..!!
15. ఎంత ఆనందం
కాగితాల నడుమ
అక్షరయానం..!!
16. ఎంత విధ్వంసం
వాస్తవ ప్రపంచంలో
రుధిర వర్ణం..!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి