"గాలి వాటం "
ఈ అక్షర సహవాసం
మంజు యనమదల గారి" రెక్కల" కవితలు పైకి సులభంగా కనిపించే సంక్లిష్ట కవితా ప్రక్రియ. వాస్తవానికి ఈ చిన్న చిన్న రెక్కల్లో అగాధమంత వర్తమాన జీవిత సత్యాలు ఇమిడి యున్నాయి. కవితకు "కీ" తెలిస్తే ఒక్కో కవిత ఒక్కో గ్రంథం. గ్రంథమంత విషయాన్ని ఒక చిన్న గుళికలో ఇమిడ్చటం ఒక యజ్ఞం.
అక్షరాలే ఆలంబనగా మొదలైన రచనలు చివరకు శరాఘాతాలుగా మారి వర్తమాన సాంఘిక, రాజకీయ వికృత పోకడలను చీల్చి చెండాడే దశకు చేరుకోవడం రచయిత పరిణితికి నిదర్శనం. కాక పోతే ఈ రెక్కల కవితలను పూర్తిగా ఆస్వాదించాలంటే చదివే వారికి వర్తమాన సాంఘిక రాజకీయ పరిణామాలపై పూర్తి అవగాహన ఉండాలి. ఆమె ఒక్క మాట రాస్తే వంద మాటలు రాసినట్లే . అదీ ఈ రచనా ప్రక్రియ. వేదనంతా తను అనుభవించి మనకు మాత్రం పంచదార గుళిక లాంటి రెండు మాటలు రెక్కల్లో పొదిగి పంపిస్తుంది. "గాలి వాటాన్ని" అక్షరాల సహవాసంతో తనకు వాలుగా మార్చుకున్న రచయిత్రి మంజు కు ఆత్మీయ అభినందనలు.
...... డా. డి. ప్రసాద్.
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి