నేస్తం,
పెద్దోరికి బాగా పద్ధతులు తెలుసన్నారు? మరొకరికి సెప్పడం కాదండి. మనదాక వత్తే ఏటన్నది సూసుకోవాలి గదేటండి! కుటుంబం, విలువలు వగైరాల గురించి మాట్లాడే అర్హత మనకేపాటుందో ఈరోజు అందరికి తెలిసిపోనాది గదేటి!
రోజులెప్పుడూ ఒకలానే వుండవండి. కాలం చేతిలో మనందరం కీలుబొమ్మలమని తెలుసుకోండి. కాదుకూడదంటారా మీ అహంకారం మీదేనంటే రేపటి రోజు కాదండి ఈరోజే ప్రశ్నార్థకం. ఈ సంగతి మీకీపాటికే అర్థమైయ్యుండాలి.
ఏ ఆట మనమాడాలన్నా ఆ భగవంతుని చూపుండాలి మన మీద. అది తెలుసుకోకుండా మన అహం మనదేనని విర్రవీగితే, ఎదుటివారిని మనమన్న మాటలకు, మనం చేసిన చేతలకు చక్రవడ్డీతో సహా మనకు తీర్చడానికి భగవంతుని స్కెచ్ రడీగా వుందండోయ్. కనీసం ఇదన్నా గుర్తెట్టుకోండి మరి..ఉంటానండి ఆయ్ఁ..!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి