1. రాత
రాయడం
అచ్చు
వేయడం
ఎవరి పనితనం
వారిది..!!
2. మాట
విరుపు
మనసు
ముక్కలు
బంధం
బలహీనత..!!
3. తీసుకున్నది
తిరిగి ఇవ్వడం
మనది కానిది
మనదనుకోవడం
సంస్కారం
ఎవరిది?
4. పిలుపు
వినబడదు
మనిషి
కనబడడు
శూన్యం
చిత్తరువు..!!
5. చరిత్ర
వైశాల్యం
మనసు
చుట్టుకొలత
పంచేద్రియాల
పంచతంత్రం..!!
6. మనసు
మనిషిదే
ప్రవర్తన
పెంపకానిది
లలాట లిఖితం
కర్మానుసారం..!!
7. వచనం
అవసరం లేదు
మనసు
చదవగలిగితే చాలు
ఓ జీవితకాలం
నీదే..!!
8. ప్రభుత్వాలు
మారుతుంటాయి
తీరుతెన్నులు మారనిది
వ్యవస్థలోనే
లోపం
ఎక్కడో..!!
9. పురస్కారం
గొప్పదే
తిరస్కారం
స్వీకరించలేనిది
స్థితప్రజ్ఞత
కొందరిదే..!!
10. ఆస్వాదన
మనిషికి
అంతర్యుద్ధం
మనసుకి
ప్రకృతిలో
మమేకం..!!
11. అడిగితే సాయమందించేవారు
స్నేహితులు
అడగకుండానే ఆదుకునేవారు
ఆత్మీయులు
ఎవరికి
ఎవరేమౌతారో..!!
12. అక్షరబద్దమే
నేనంతా
మాటలయినా
చేతలయినా
తెరచిన
పుస్తకం..!!
13. బంధాలకు
బందీలం
బాధ్యతలకు
బద్ధులం
అనుబంధాల
పొదరిల్లు..!!
14. గుర్తింపు
అవసరమే
మనుగడ
కోసం
సమాధానం
కాలానికెరుక..!!
15. బతకడం
ఓ కళ
మనసారా జీవించడం
ఓ వరం
మార్పు
ఆస్వాదనలో..!!
Art of
Living
Heart of
Living
Difference in
Thoughts..!!
16. అరువు
పలకరింపులు
నేతిబీరకాయ
నెయ్యాలు
మనసుకు
భారమే..!!
17. కాగితపు పువ్వుల
సువాసనలు
పెదవంచు
ప్రేమాభిమానాలు
ఆస్కార్ అవార్డులే
తక్కువ..!!
18. బంధాలంటని
అనుబంధాలు
ఆత్మీయతలంటని
ఆత్మబంధువులు
ఏ చుట్టరికం
ప్రామాణికం?
19. కొన్ని
బంధాలు
మనసుకు
చుట్టాలు
గతజన్మ
ఋణానుబంధాలు..!!
20. తీరని
ఋణపాశాలు
వీడని
చిక్కుముడులు
మరణం
మరో పుట్టుక..!!
21. నచ్చినవారు
ఏది చేసినా
జయహో
అనడమే
మహామహుల
ఉవాచ..!!
22. పెడితే
పిండం
పెట్టకపోతే
శ్రాద్ధం
మనిషి
నైజం..!!
23. సమాలోచనల
సాహిత్యం
పుట్టినరోజొకటైన
అంతరంగం
అందరిలో
ప్రత్యేకం..!!
24. దేశ
రక్షణ
వ్యవస్థలో
మార్పు
ఒకే వరలో
ఇమడవు..!!
25. ప్రస్తుతమే
కాదు
ఫ్యూచర్
కూడా
బాడ్ టైమే
కొందరికి..!!
26. మనసు కథలు
కొన్ని
మనిషి కథనాలు
అందరివి
వెరసి
అనగనగా..!!
27. బంధం
బలపడుతోంది
సం’బంధం
చులకనయ్యింది
గాలివాటపు
ప్రేమలు..!!
28. మధ్యతరగతి
పేదవాడు
దిగువతరగతి
ధనవంతుడు
రాజకీయ
మాయాజాలం..!!
29. చెప్పే వయసు
మనది
చెప్పించుకునే
సమయం కాదు
నిజాయితి
మనస్సాక్షికి తెలుసు..!!
30. రాతి
మనసు
సగటు
మనిషి
పరిస్థితుల
ప్రభావం..!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి