22, ఫిబ్రవరి 2025, శనివారం

అసలైన సంస్కర్తలు..!!

 నేస్తం,

           మన దేశంలో అందరూ లౌకికవాదులేనబ్బా! ఎన్నెన్ని నీతి వాక్యాలు చెప్పేస్తున్నారో. వారి రాతల్లో, చేతల్లో ఒక మతాన్ని, ఒక కులాన్ని ద్వేషించినంతగా మరే ఇతర కులమతాలను ద్వేషించడం కాని, హేళన చేయడం కాని మనం చూడటం లేదు. ఎందుకు ఆ మతం మీద, కులం మీద అంత విద్వేషం?

        ఒకడేమో ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తాడు. మరొకడేమో తన మతాన్ని తప్ప మిగతా అన్ని మతాలను హేళన చేయడం  గొప్ప అనుకుంటాడు. 

        కొంతమందేమో  లోపాలన్నీ హిందూమతంలోనే వున్నాయంటారు. పాపం వారికి మిగతా ఏ (అ)రాచకార్యాలు గుర్తుకే రావన్నమాట. ఏది జరిగినా దానికి మతాన్నో, కులాన్నో అంటగట్టడం తమ తక్షణ కర్తవ్యమని భావిస్తారు. 

         రాయడం అందరికి వచ్చని మర్చిపోతున్నారు సదరు సంస్కర్తలు. ముందు ఎవరి కొంపలో కుంపట్లు వాళ్ళు ఆర్పుకుని, ఆ తర్వాత మిగతావారి మీద పడి ఏడవండి..!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner