1. సారాయో
గంజాయో
ఎవడి యాపారం
వాడిది
ప్రపంచాన్ని
ఆక్రమించేయడమే..!!
2. వెలుతురు
చూడలేని వాస్తవాలు
చీకటి చుట్టాలై
బతికేస్తూ
ఆశల
విహంగాలు..!!
3. అహం
అదిలిస్తుంది
ఆప్యాయత
అక్కున చేర్చుకుంటుంది
ఏదైనా
బంధమే మరి..!!
4. మనం
గుర్తుంచుకోవడం
మనల్ని
గుర్తించడం
తేడా తెలుసుకుని
మసలుకోవాలి..!!
5. క్షణాలను
గుప్పిట బంధించలేము
సమయపాలన
అవసరమే
కాలమెప్పుడూ
మన చుట్టం కాదు..!!
6. చెప్పుకోవడానికే
అన్నీ
చేతికి
అందేవి కాదు
మానవ
సంబంధాలు..!!
7. మనమేమన్నా
నిజాయితీపరులమా!
మనం రాసిన రాతలో
మనమూ వున్నాం కదా!
మర్చిపోతే
ఎలా మాస్టారూ..!!
8. అన్నీ
అందుబాటులోనే
అందుకునే
అవకాశమే లేదు
తత్వం
బోధపడాలి..!!
9. ఆకాశానికి
పాతాళానికి మధ్యలో
ధరాతలంపై
మనుగడ
మనిషి
తలరాత..!!
10. మారడం
తెలియదు
మార్చే ప్రయత్నం
ఆగదు
అభిమతం
ఎవరిది వారిదే..!!
11. వినడంతోనే
బతుకంతా
అస్తిత్వాన్ని
కోల్పోయాక
సగటు
మనిషి..!!
12. బంధం
వీగిపోయింది
బాధ్యతలు మాత్రమే
మిగిలాయి
మనసు
దృఢమైనది..!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి