1. అరచేతిలో అన్నీ_మనిషి మాత్రమే మరయంత్రమిప్పుడు..!!
2. కథలన్నింటా విశేషాలే_సశేషాల కొనసాగింపుతో..!!
3. నమ్ముతున్నా_నేననుకున్న ఆ భావమేదో నీలో వుందని..!!
4. మనసొక మంత్రజాలమే_తపమాచరిస్తే..!!
5. వెలితిగా అనిపించలేదెప్పుడూ_నీతో నెయ్యమందుకున్నాక..!!
6. ప్రతి అక్షరమూ ఆత్మీయమే_అనుభవాల సారం అందిపుచ్చుకున్నంత కాలమూ..!!
7. క్షణాల సాహచర్యం చాలదూ_దశాబ్దాల జ్ఞాపకాలను ప్రోది చేసుకోవడానికి..!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి