అడుగుల తడబాటు అర్థమౌతున్నా
ఆపలేని పయనంలో
సాయంగా వచ్చి చేరిన తాయిలాలివి
నిన్నల్లో జారిపోయిన గతాన్ని
రేపటి భవితలో అందిపుచ్చుకోవాలని
ఆశపడే మనసు తపన
కాలానికి తెలిసిన కథే అయినా
చరిత్ర పుటల్లో
ఛిద్రమైన చరితే ఇది
పోగొట్టుకున్న చోటునే
మెుదలైన దేవులాటలో
గెలవాలన్న ఆరాటం
ముగింపు వెదికే ప్రయత్నంలో
అసంపూర్ణంగా మిగిలిన
ఓ ఒంటరి కల
చాలా రోజుల తర్వాత రాసిన కవిత.అప్పుడప్పుడు కింద నుండి పైకి రాయడం అలవాటు..ఇది అలా రాసినదే..!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి