19, మే 2014, సోమవారం

బావుండు అనిపిస్తోంది ఒక్కోసారి...!!

ఆత్మీయులు అనుకున్న ఆత్మ బంధువులు కలిస్తే ఆ సంతోషాన్ని చెప్పడానికి మాటలకి దొరకని అలౌకికానందం అనుభవించిన వారికే తెలుస్తుంది.... ఈ రోజుల్లో కూడా అలా అనిపించే అదృష్టం కొందరికి దక్కుతుంది...బంధాలు భాద్యతలు మనిషి అన్న ప్రతి  ఒక్కరికి ఉంటాయి....వాటిలోనే కష్టాలు సుఖాలు మనతో కలసి కాపురం చేస్తూ ఉంటాయి.. అన్నిటిని ఒకేలా అనుభవించే మనసు కొందరికే సొంతం....ఎదుటివాటి బాధను పంచుకుని కాస్త ఓదార్పును ఇవ్వగలిగే మానవత్వం ఎందరిలో ఉంటుంది...?? కన్నబిడ్డను పెంచలేక పురిటికందును అమ్ముకుంటున్న తల్లి మనసు గొప్పది అనుకోవాలో.... పదిమంది బిద్దలున్నా పదకొండో బిడ్డను ఇవ్వడానికి మనసు చంపుకోలేని తల్లి మనసు గురించి చెప్పాలో తెలియని ఆ రోజులకు ఈ రోజులకు మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని చూస్తూ ఉండిపోవాలో తెలియని అయోమయంలో ఉన్న అటు ఇటు కాని మధ్య తరంలో ఉన్నందుకు నిందించుకోవాలో తెలియని ఈ పరిస్థితి మరే తరానికి రాకుడదని....ప్రేమలు అభిమానాలు ఎక్కువగా పెంచేసుకుని పాత బంధాలను వదలలేక కొత్త అనుబంధాల కోసం వెళ్ళలేక ఉండిపోయిన ఈ మధ్యతరం గురించి ఆలోచించే వారు కొద్దిమంది ఉంటే బావుండు అనిపిస్తోంది ఒక్కోసారి...!!
పాత తరం అందిచిన అనుబంధాలను కొత్త తరానికి అర్ధం అయ్యేలా చెప్పడానికి తపన పడుతున్నా ఎన్నో తెలివితేటలు ఏదైనా సాధించగలమన్న నమ్మకం ఉన్న ఈనాటి యువత ఈ ఆప్యాయతలకు దూరమై పోతూ ప్రగతి పధంలో మేధస్సులో ముందుకు దూసుకుపోతూ అందని ఆకాశాన్ని దానిలోని వింతలను విశేషాలను చేదిస్తున్నామన్న అతి సంతోషంలో అసలైన ఆత్మీయతను అనుబంధాలను కోల్పోతున్న సంగతినే మర్చిపోతూ పబ్బులు పార్టీలు తెలిసి తెలియని ఈ అంతర్జాలపు ముసుగులో సమయాన్ని జీవితాలను కోల్పోతున్నా.... అదే అసలైన ఆనందమని భ్రమలో బతికేస్తున్న కొందరు....అసలైన మేధస్సుకు అర్ధాలను చెప్పే మరికొందరు...చూస్తూ మనం...!! బావుంది కదూ....!!

4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Chandra Vemula చెప్పారు...

బంధాలు భాద్యతలు ప్రతి ఒక్కరికి ఉంటాయి....కష్టాలు సుఖాలు మనతో కలసి కాపురం చేస్తూ ఉంటాయి...అన్నిటిని ఒకేలా అనుభవించి....ఎదుటివాటి బాధను పంచుకుని కాస్త ఓదార్పును ఇవ్వగలిగే మానవత్వం కొందరిలోనే ఉంటుంది...??
సమాజం లో మార్పును ఆకాంక్షిస్తూ ఒక చక్కని మనోసంఘర్షణ
అభినందనలు మంజు గారు! శుభోదయం!!

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు చంద్ర గారు

Hima bindu చెప్పారు...

Nice

చెప్పాలంటే...... చెప్పారు...


thank u Hima garu

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner