21, మే 2014, బుధవారం

ఇష్టమైన జ్ఞాపకం చాలదూ.... !!

నిన్ను నువ్వే అడిగిచూడు
జ్ఞాపకాల పుటలను ఒక్కసారి
స్పృశించు మనసును తట్టి
మరచిపోయిన మరపు నీకు
కనిపిస్తుందేమో  చూద్దాం...!!
చల్లనయ్యతో సరాగాల మురిపాలు
చుక్కలతో సయ్యాటలాడిన
మసక చీకటి మాటున దాగిన
ముచ్చటైన ముచ్చట్ల గురుతులు
ఒక్కటైనా కానరాలేదా నీకు...!!
ఒద్దికగా పుస్తకాల పేజీల్లోకి తొంగి చూస్తూ
మది గుండెలో దాచిన ఆ ఒక్క
అమాయకమైన ఆత్మీయ
ఇష్టమైన జ్ఞాపకం చాలదూ....
నీలో నేను ఉన్నానని చెప్పడానికి....!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

vemulachandra చెప్పారు...


మది గది లో ఒదిగుండి పలుకరిస్తున్న ఆ ఒక్క అమాయక .... ఆత్మీయ .... ఇష్టం, జ్ఞాపకం చాలదూ ....

చాలదూ ఆ ఒక్క నిర్మల ఎద రాగ భావన .... కవిత గా
అభినందనలు మంజు గారు!

చెప్పాలంటే...... చెప్పారు...

dhanyuraalini chandra garu mi atmiya spandanaku

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner