హడావిడి నేతలకు రాజధాని నిర్ణయాలు నుంచి డబ్బులు రాబట్టుకోవడం... కాస్త పెద్దవారు ఎక్కడి ఆస్థులు అక్కడ జాగ్రత్త చేసుకోవడానికి వారి వారి అవసరాలకు వారినే పొగడడం... అంతే కాని గెలిపించిన జనాలను ఒక్కరు ఉంచుకోరు...అదేమంటే ఓట్ల కోసం పిలవకుండా వద్దకు వచ్చిన నేతలు ఇప్పుడు మనం వెళ్ళి మా ఊరు రండి అని పిలిస్తే వారికి సమయం కాస్తయినా మనకోసం ఉంటే అది కూడా వారికి ఉపయోగం అనుకుంటేనే వస్తారు...రాబోయే పదవుల కోసం ఆరాటమే తప్ప గెలిపించిన జనాలను గుర్తు ఉంచుకుని కాస్తయినా తమ గెలుపుకు కారణం అయిన ప్రజల కోసం ఏం చేద్దామా అని ఆలోచించే నాయకులు ఎవరు ఉన్నారు...?? ప్రధానమంత్రి ముఖ్య మంత్రి ఎవరు అవుతారో వారికి అభినందనలు అందిస్తూ బడా బాబులు...కేంద్ర మంత్రి పదవులు ఎలా పంచుకోవాలో రాష్ట్ర పదవులు నాకంటే నాకని ఆశలతో కనీసం గెలిపించిన జనాలకు కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోయిన నాయకులెందరో....!! శాశ్వత మిత్రత్వము శాశ్వత శత్రుత్వం లేదని మరోసారి నిరూపించిన రాజకీయ నాయకులందరికీ.... తమ అవసరాల కోసం ఏదైనా చేయగల పెద్ద బాబులకు మరోసారి మా అందరి వందనాలు...!!
గెలిపించిన ప్రజలు నాయకుల తప్పును నిలదీసే రోజు మన ప్రజాస్వామ్యం ప్రజల చేతిలో ఉన్నట్లు...!! ఆ రోజులు చూసే అదృష్టం మనకు రావాలని నా కోరిక....!! గాంధీ గారు కలలు కన్న స్వాతంత్ర్యం ఎలానూ రాలేదు రాబోదు కూడాను...ప్రపంచం ఎంత ముందుకు వెళ్ళినా మనం మాత్రం అందరికి అన్ని చేస్తూ మన జీవితాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడి చందానే అన్నట్టు మార్పు కోసం ఆశగా చూస్తూ ఇలానే మన జీవితాలను వెళ్ళదీద్దాం...రేపటి రోజున ఎవరో ఒకరు రాకపోతారా...మన జీవితాలు మారి అందలాలు మనం ఎక్కలేక పోతామా అన్న ఆశతో బతికేద్దాం...!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి