ఎక్కడైనా ఓ చిన్న అనుబంధం మిగిలిందేమో అని....
ఎక్కడా కనపడని భావాలను ఎక్కడనుంచి తేను...
కరడు కట్టిన రాతిలా మారిన ఈ రంగు రాళ్ళ మాయలో
స్వచ్చమైన స్పటికంలా మెరిసే ఆ వెలుగులు చిమ్మే
కాంతిని తట్టుకునే శక్తిని సాధించాలని దరిచేరలేని
శిదిలపు శిలలో చితికిపోయిన శకలాల శూలాలు
అనుక్షణం గుండెను చీల్చే జ్ఞాపకాలే కాని...
అందమైన శిల్పపు రూపు కనిపించదని తెలియక
ఎక్కడా దొరకక వెదికి వెదికి వేసారిన జీవితపు
ఆఖరి క్షణం వరకు ఎదురుచూపుల నిరాశల
నిట్టూర్పులే తప్ప మలయ సమీరపు జాడలే
దరిదాపుల తాకుతున్న గురుతులు అగుపించక
ఔనన్నా కాదన్నా నీతోనే బంధాన్ని పెనవేసుకున్న
నా ఊహల ఊసులు ఈ జన్మకు మరొకరికి సొంతం
కాలేవని నీకర్ధమయ్యే వేళకు ఈ శ్వాస ఆగిపోతుందేమో.....
ఓ జీవిత కాలపు నిరీక్షణకు సాక్ష్యంగా నీకు ఈ నా వేదన
తెలియక పోయినా దేనికోసమో ఆరాటపడుతూ
పరుగిడుతున్నఈ మమతల పోరాటం ఓ క్షణం
మనకోసం మనం అనుకుంటే ఎలా ఉంటుందో....!!
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
నీతోనే బంధం పెనవేసుకున్న .... ఈ ఊహల ఊసులు ఈ జన్మకు మరొకరికి సొంతం కావని నీకర్ధమయ్యే వేళకు ఈ శ్వాస ఆగిపోతుందేమో.....
ఎంత లోతైన ఆర్ద్రత తో కూడిన భావన .... చాలా బాగుంది కవిత
అభినందనలు మంజు గారు!
dhanyavaadaalu chandra gaaru
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి