11, నవంబర్ 2010, గురువారం

చల్ల చల్లని ...కూల్ కూల్ గా...చలిలో....

అబ్బో అప్పుడే చలి చంపేస్తోంది ఇక్కడ. అదేనండి బాబూ ఇంట్లోను, ఆఫీసులోను. అదేంటి ఆఫీసులో కూడానా అనుకుంటున్నారా!! ఆ విషయానికే వస్తున్నా, ఆగండి మరీ అంత తొందరైతే ఎలా!! మాది అదేనండి ఆఫీసు బానే పెద్దగా వుంటుంది. కాబిన్లో మూడు ఏ.సి లు వుంటాయి, కాని అక్కడే ఇబ్బంది వచ్చి పడింది. మద్యలో వాళ్లకు బాగా చల్లగా కావాలి అంటే అందరికి కాదు ఒక్కళ్ళకి మాత్రమే బాగా చల్లగా కావాలి. మళ్ళి .సి కి దగ్గర గా కూర్చోరు వారు. వాళ్ళది మాత్రం 23/24 పెట్టి మిగిలినవి అన్ని 16 /20 మద్యలో పెడితే ఎలా వుంటుంది చెప్పండి!!
నిజంగానే కొంత మందికి ఎక్కువ గా చల్లదనం కావాలి, కాని కొంత మంది అస్సలు భలే చేస్తారు చల్లదనం పడదు అంటారు కాని తెలివిగా అటు ఇటు వెళ్ళినట్లు వెళ్లి ఏ.సి ఆన్ చేసి ఏమి తెలియనట్లు యాక్షన్ చేస్తారు. చల్లగా వుండాలి కాని అందరిని ఇబ్బంది పెట్టేటట్లు ఉండకూడదు కదా!! మరి ఈ నటనాగ్రేసరులు ఇంటికి వెళ్లి ఏం చేస్తారో తెలియదు అంటే ఇంట్లో ఏ.సి వుండదు కదా!! అసలే చలి కాలం మళ్ళి ఈ ఏ.సి గొడవొకటి మా ప్రాణాలకు...ఏంటో ఈ ఏ.సి గోల..... !!-:)

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అశోక్ పాపాయి చెప్పారు...

అయ్యబాబోయ్ ఈ గొడవ మాకే అనుకున్న మీకు కూడనా దాదాపుగా ఆఫీస్లో వర్క్ చేసె ప్రతి ఒక్కరికి ఇదే గొడవలు కావచ్చు ఏమోనండీ.

చెప్పాలంటే...... చెప్పారు...

అయ్యి ఉండొచ్చు నేనేనేమో అనుకున్నా చాలామంది బాదితులున్నట్లున్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner