9, నవంబర్ 2010, మంగళవారం

ప్రియతమా నా హృదయమా

అజరామరమైన గీతాలలో బాలు చిత్ర ల గాన మాధుర్యానికి ఇది ఒక మచ్చు తునక. వేటూరి కలం నుంచి జాలువారిన అద్భుతమైన మధుర గీతాలలో మరపు రాని ఆణిముత్యం. ఇళయరాజా స్వర కల్పనలో అద్భుత సృష్టి.
తన ప్రాణంలో ప్రాణమైన ప్రియురాలు చనిపోతుందని తెలిసి తనని గొప్ప వ్యక్తి గా చూడాలనుకుంటోందని తన మనసునే కానుకగా చేసి ఆ ప్రేమికుడిచ్చిన వెల కట్టలేని ప్రేమ కానుక ఇదిగో....మీకోసం....!!!
*******
ప్రియతమా నా హృదయమా
ప్రియతమా నా హృదయమా
ప్రేమకే ప్రతి రూపమా
ప్రేమకే ప్రతి రూపమా
నా గుండెలో నిండినా గానమా
నను మనిషిగా చేసిన త్యాగమా ...... [ప్రియతమా]

శిలలాంటి నాకు జీవాన్ని పోసి
కల లాంటి బ్రతుకు కలతోటి నింపి
వలపన్న తీపి తోలి సారి చూపి
ఎద లోని సెగలు అడుగంట మాపి
నులివేచ్చనైన ఓదార్పు నీవై
శృతి లయ లాగా జత చేరినావు
నువులేని నన్ను ఊహించలేను నా వేదనంతా నివేదిన్చలేను
అమరం......అఖిలం.....మన ప్రేమా ...... [ప్రియతమా]

లా లాల లా ల ల ..
ల లా ల ల ల ల లా ల లా...
లా ల లా ల..
ల ల ల లా లా....

నీ పెదవి పైనా వెలుగారనీకు,
నీ కనులలోనా తడి చేరనీకు...
నీ కన్నీటి చుక్కే,మున్నీరు నాకు
అది వెల్లువల్లే నను ముంచనీకు...
ఏ కారు మబ్బు ఎటు కమ్ముకున్నా,
మహా సాగరాలే నిను మింగుతున్నా,
ఈ జన్మ లోనా ఎడబాటులేదు...
పది జన్మలైనా ముడేవీడిపోదు..
అమరం......అఖిలం.....మన ప్రేమా ...... [ప్రియతమా]

4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

శిశిర చెప్పారు...

"నువులేని నన్నూ ఊహించలేను, నా వేదనంతా నివేదించలేను"
ఎంత అద్భుతంగా రాశారో కదా. బాలూ గారు తన గళంతో ఆ మాటలకి జీవం పోశారు.

మనసు పలికే చెప్పారు...

వావ్.. చాలా మంచి పాటని గుర్తు చేశారు..:) ధన్యవాదాలు. నాకు చాలా ఇష్టమైన పాట ఇది..:)

అశోక్ పాపాయి చెప్పారు...

అవునండి మంచి పాటని గుర్తు చేశారు. చాల సంతోషమండి...))

చెప్పాలంటే...... చెప్పారు...

అశోక్, శిశిర, మనసుపలికే అందరికి నాకు నచ్చిన పాట మీకు నచ్చినందుకు చాలా సంతోషం. నా పోస్టులు చూస్తున్నందుకు కృతజ్ఞతలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner