24, నవంబర్ 2010, బుధవారం
అంధకారం లో ఆంధ్ర దేశం
మన మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు చని పోయిన తరువాత జరిగిన జరుగుతున్న ఆధిపత్యపు పోరు చూస్తూ వుంటే ముఖ్యమంత్రి గా వున్న రోశయ్యగారే సమర్ధవంతమైన నాయకుడు అనిపించింది నాకు ఇప్పటికి. మొత్తానికి అన్ని వైపుల నుంచి ఒత్తిడితో రోశయ్యగారి రాజీనామా కార్యక్రమం ఈ రోజుతో ముగిసింది. ఇష్టం లేక పోయినా కష్టంగానే ముఖ్యమంత్రి పదవిని త్యజించిన త్యాగశీలి. ఇప్పటి వరకు అధిష్టానం ఎలా చెప్తే అలా తల ఆడించిన రోశయ్యగారు వయోభారంతో అలసి, సంవత్సరం నుంచి...ఇంటా బయటా సమస్యలతో సహవాసం చేసి "మింగమంటే కప్పకు కోపం వదలమంటే పాముకు కోపం" చందాన అందరితో వేగ లేక చేతులెత్తేశారు. ఇంకేముంది ఎప్పటినుంచో దీనికోసమే ఎదురు చూస్తున్న ఎందరో మహానాయకులం అనుకునే వారు అందరూ నేనంటే నేనని...ముఖ్యమంత్రి పదవి నాదంటే నాదని సామ, దాన, బేధ, దండోపాద్యాయాలను అలుపెరుగని పోరాట పటిమను వారి వారి రీతులలో ప్రదర్శిస్తూ అమ్మగారి సేవలో తలమునకలు అవుతున్నారు.
"వారసత్వ,కుల,వర్గ,ప్రాంత,ధన రాజకియాల తో విసిగి రోషం తో రాజీనామా సమర్పించిన రోశయ్య
రోషంలేని రోశయ్య అని వ్యంగ్యం చేసిన ప్రతి ఒక్కరికి రానున్న ఆర్ధిక మాంథ్యాన్నే గుణపాఠం గా వదిలి వెళ్తున్న ఆర్ధిక మేధావి"
మరి అధిష్టానం దేవత ఎవరి పై కరుణ చూపుతారో పట్టం ఎవరికీ కడతారో....మళ్ళి ఏ పేరు ఎలా మారిపోతుందో చూడాలంటే కొంత కాలం...కొంత కాలం ఎదురు చూడాల్సిందే....అప్పటి వరకు తెలుగు ప్రజానీకం అమ్మగారి ఆజ్ఞా ఏంటా అని బిత్తర చూపులు చూస్తూ అంధకారంలో మగ్గాల్సిందే!!
"వారసత్వ,కుల,వర్గ,ప్రాంత,ధన రాజకియాల తో విసిగి రోషం తో రాజీనామా సమర్పించిన రోశయ్య
రోషంలేని రోశయ్య అని వ్యంగ్యం చేసిన ప్రతి ఒక్కరికి రానున్న ఆర్ధిక మాంథ్యాన్నే గుణపాఠం గా వదిలి వెళ్తున్న ఆర్ధిక మేధావి"
మరి అధిష్టానం దేవత ఎవరి పై కరుణ చూపుతారో పట్టం ఎవరికీ కడతారో....మళ్ళి ఏ పేరు ఎలా మారిపోతుందో చూడాలంటే కొంత కాలం...కొంత కాలం ఎదురు చూడాల్సిందే....అప్పటి వరకు తెలుగు ప్రజానీకం అమ్మగారి ఆజ్ఞా ఏంటా అని బిత్తర చూపులు చూస్తూ అంధకారంలో మగ్గాల్సిందే!!
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
16 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
అంధకారం అవ్వదులెండి..కాని చాల భాద అన్పించింది .అంత వయస్సులో అనారోగ్యం కొంత వున్నా పద్నాలుగు నెలలు వరకు నడుపుకొచ్చారు .ఈ పరిస్థితులో విశ్రాంతి తీసుకోవడమే ఉత్తమం
http://vivaadavanam.blogspot.com/2010/11/blog-post_24.html
అవును ఈ వయస్సులో కుడా బాగా కష్టపడ్డారు
అవునండీ తను విశ్రాంతి తీసుకోవడమే ఉత్తమం అనిపిస్తూంది.
అందుకే మరి ఇష్టం లేక పోయినా వదిలేసారుగా!!
"అంధకారంలో మగ్గాల్సిందే".
ఎందుకు? ఇది తెలుగు ప్రజలు పండుగ చెసుకొ వలసిన సమయము. జాతి విద్రొహులు మరియు most corrupt party (Congress) is in trouble.
This is good for people of AP in particular and Indians in general.
Lets have a party!.
రోషంలేని రోశయ్య అని వ్యంగ్యం చేసిన ప్రతి ఒక్కరికి రానున్న ఆర్ధిక మాంథ్యాన్నే గుణపాఠం గా వదిలి వెళ్తున్న ఆర్ధిక మేధావి"
వచ్చే-సిమ్.ఆయనది అయన పీక్కోవాల్సిందే మరి.
దేశం సోనియా అమ్మగారి చేతిలో ఉన్నంత వరకు మనకు అంధకారం తప్పదు అని నా ఉద్దేశ్యం అజ్ఞాతగారు.
astrojoyd gaaru ,
....మరి అంతే కదండీ....-:)
మీరు మరీనూ! ఇంతకు ముందు వెలుతురులో ఉన్నట్లూ.
రోశయ్య గారు,
ఒక మంచి నాయకుడు. ఇక నుంచి మనకు అర్థమౌతుంది రాజకీయాలలో ఆయన లేని లోటు. తెలుగు వారికి ఉన్న తల పొగరు, అజ్ణానం తో కూడిన అహంకారం, మితిమీరిన కుల పిచ్చి, రాక్షసత్వం (చిన్నా పెద్దా లేకుండా) నేను ఎక్కడ చూడలేదు. ఊరు కదల కుండా వారిని వారు గొప్ప అని అనుకొంట్టుంటారు. లేక పోతే నిన్న పుట్టపర్థి సంఘటనే తీసుకోండి. ఆయన ప్రధాని వచ్చాడన్న కారణం గా ఉన్న నిబంధనల వలన కార్యకర్తలను విమానాశ్రయం లో కలవటానికి వీలు పడలేదు. ఇంతలో అక్కడికి చేరిన జనం రోశయ్య గారిని డౌన్ డౌన్ అని నినాదాలు చేశారని పేపర్ లో వచ్చింది. ఆయన బయటకు వచ్చి శాంతింప చేయబోతే నువ్వు సి.యం. ఐ ఉండి మమ్మల్ని కలవవా అని అన్నారని చదివాము. ఆయన నేను రాజీనామా చేస్తాను ఎవరి తో చెప్పు కుంటారో చెప్పుకోండి అని అన్నాడాని రాశారు. అది ఈ రోజు నిజమైంది. ఆయనకి అది ముందే తెలుసు కనుక అప్రయత్నం గా నోటినుంచి వచ్చింది.
----------------------------------------------------------------------
ఇక్కడ కార్య కర్తలు అంటె ఒక మూక. వారికి ఏ రూల్ తెలియదు. ఇందులో చదువుకున్న వారు ఉన్నా కూడా ఇష్టారాజ్యం గా ప్రవర్తిస్తారు. వారికి ఆమాత్రం తెలియదా పి.యం. వచ్చినప్పుడు ఎక్కువ భద్రత ఉంట్టుందని? తెలిసినా నాయకుడు రూల్ బ్రేక్ చేసి వీరిని చూడటానికి వస్తే వారు అదొక విజయం లా భావిస్తారు. అసలికి అవసరం లేక పోయినా నాయకుడు ఎందుకు రూల్ బ్రేక్ చేయాలని వీరు అనుకుంట్టారు? ఇది తెలుగు వారికి ఉన్న పెద్ద తెగులు. వీరికి నిజం గా రోశయ్య మీద గౌరవమే ఉంటే అలా నినాదాలు చేస్తారా? ఎందుకు చేసారు అంటె ఆయనని వీరు పరీక్షించటానికి.
-------------------------------------------------------------------
ఉన్న ఒక మంచి వృద్ద తరం నాయకుడు మిగలటం లేదు.రాబోయే రోజుల్లో తెలుగు వారికి ముందుంది ముసళ్ళ పండగ.
SRI
@ Sri, I agree with you except with the following stmt.
"ఉన్న ఒక మంచి వృద్ద తరం నాయకుడు మిగలటం లేదు"
ఆయన వృద్ద తరం అవటం నిజమే కాని, మంచి నాయకుడు అన్నది మాత్రం నిజం కాదు!! ఆయన్ను ఆదరించిన చీరాల తీర ప్రాంతం అంతా దాదాపు 30 వేల ఎకరాలు వానపిక్ పేరుతో బలవంతంగా లాక్కొని దోచిపెట్టినందుకా, పొలాలు ఇవ్వని వాళ్ల మీద నక్సలైటులని కేసులు పెట్టించినందుకా? దాదాపు 20 ఏళ్లగా నియోజకవర్గానికి ప్రాతినిద్యం వహించినా తన పేరు వ్రాసి మరీ చేనేత కార్మికులు ఆత్మహత్యలు పాలప్డినా వాళ్లకు ఉపయోగపడే పనెమీ చేయకపోగా, కాస్తో కూస్తో ఉపయోగపడే సహకార నూలు మిల్లును అమ్ముతూ ఉంటే ప్రైవేటు వాళ్లకు చూస్తూ ఊర్కొన్నందుకా?
అన్నిటికంటే తన వారసుడుగా ఓ రౌడీ దగ్గర 2 కోట్లు తీసుకొని టికెట్స్ ఇప్పించి, గత ఏడాదిగా తన మీద కాని తన అనుచరులమీదకాని ఒక్క కేసు కూడా పెట్టకుండా కాపలా కాసినందుకా, ఆ రౌడీని front man గా పెట్తుకొని గత ఏడాది గా వందల కోట్ల రూపాయల సెట్లిమెంట్స్ కు పచ్చ జెండాలు ఊపినందుకా? ఆయనను మంచివాడు అంటున్నది!!
సరే నేను మీరు చెప్పినవాటితో విభేదించను. నేను ఆయన ప్రాంతానికి చెందినవాడిని కాను. మీరు గమనించండి మీరు రాసీన లక్షణాలు ఇతని కన్నా ఎక్కువ దాదాపు ప్రతి కాంగ్రెస్ యం.యల్.ఎ. లో ఉంటాయి. అదీ ముఖ్యంగా వారసత్వం గా/కుటుంబ పరంగా యం.యల్.ఏ. గా గెలిచిన వారికి. మీరు చెప్పే దానిని బట్టి చూస్తే ఆయన లో ఈ మధ్య మార్పు వచ్చిందని అర్థమౌతున్నాది. అది పక్కన పేడితే.
ఆయన ఆర్ధిక మంత్రిగా ఆయన అప్రోచ్,శాసన సభలో మాట్లాడటం , ఇలాంటివి ఆయనని ఒక సబ్జేక్ట్ మీద బాగా గ్రిప్ ఉన్న ప్రొఫెసర్ ని చూస్తే ఎలా ఫీలౌతామో రోశయ్య గారిని చూస్తే ఆభావన వస్తుంది. మీరు చెప్పండి మన మంత్రులలో ఒక నలుగురి పేర్లు విషయాలను గుర్తుంచుకొన్, అందరికీ అర్థమయ్యే లా డీటైల్డ్ గా వాగ్దాటితో మాట్లాడగలిగిన వారు. ప్రస్తుత తెలుగు రాజకీయ నాయకులు చాలా వెనుక బడి ఉన్నారు. కనుకనే ఎవ్వరు కేంద్ర రాజకీయాలలో వీరిని లెక్క చేయటం లేదు. ఎంత సేపటికి డిల్లికి వెళ్లి ఒక పత్రం పి.యం.కి ఇచ్చి వెనుదిరిగి వస్తారు. మరీ ఈ మధ్యన మన రాష్ట్ర నాయకులంటే కేంద్రంలో వారికి లెక్కే లేదు.
SRI
@ Sri
"అందరికీ అర్థమయ్యే లా డీటైల్డ్ గా వాగ్దాటితో మాట్లాడగలిగి" న వాడని (అవసరం అయితే బూతులు కూడా మాట్లాడుతూ) మాత్రం ఒప్పుకొంతాను, అందులో ఎటువంటి అనుమానం లేదు.
కాకపోతే రోశయ్య అవనీతిని అందరి MLA లతో పోల్చకండి. ఎంతమంది MLA లు సెజ్ ల కు పొలాలు ఇవ్వని రైతుల మీద ఏకంగా నక్సలైటులు అని కేసులు పెట్టించారు? పెట్టించగలరు? TV-9 వాళ్ల స్టింగ్ ఆపరేషన్‌లో రెడ్ హ్యాండ్ గా పట్టుబడిన DSP, CI ల మీద చర్యలే లేకుండా, కనీసం ట్రాన్స్ఫర్ కూదా లెకుండా ఎంతమంది అడ్డుపడగలరు? అదీ ముఖ్యమంత్రి గాఉంటూ :)) మన రాజకీయనాయకులు సిగ్గు వదిలేసిన వాళ్లయితే , అందులో మంచి experience తో సిగ్గు తో పాటు లజ్జా వదిలేసిన వాడని మాత్రం రోశయ్య గురించి చెప్పవచ్చు.
మొన్నీమధ్యన రాష్ట్రమంతా పోటా పోటీగా అన్ని పార్టీల రాజకీయనాయకులు అండతో సారాయి(లిక్కర్) షాపులు కోసం పాటలు పాడి, ఖజానా నింపారు కదా, రాష్ట్రమంతా పాటలు పాడినా, రాష్ట్రమంతటి లో కేవలం ఓ అయిదో, తొమ్మిదో షాపులు మాత్రం కనీస ధరకు పోటీ లేకుండా ఏకగ్రీవంగా పాట్డటం జరిగింది, అది ఎక్కడో, ఎవరి అండతో, ఎవరి దౌర్జన్యంతో జరిగిందో మీ ఊహకో వదిలేస్తున్నా!!
అనంతపురం సూరి దగ్గరనుండి, విశాఖ బొత్స వరకూ ఎవరూ ఏకగ్రీవం గా పాడలేని వాటిని, పాడించగలిగిన రోశయ్య అనుభవంతో కూడిన అవనీతి స్థాయికి చేరుకోవటానికి మిగతా వాళ్లకు చాలా టైము పడుతుంది అని మాత్రం చెప్పగలను :))
ఇది కూడా కేవలం బయటకు తెలిసీన రోశయ్య తో పాటు, ఆయనలోని కాశయ్య (ప్రతిఘటన సినెమాలో కోట రోలు)గురించి కూడా పెద్దగా తెలియని కోణాన్ని చెప్పటం కోసం తప్ప, మీతో విభేదించాలని మాత్రం కాదు.
మీ అందరి అభిప్రాయాలకు చాలా కృతజ్ఞతలండి. పదవి ఇవ్వగానే సరిపోదండీ....పదవితో పాటు అధికారం కుడా ఇవ్వాలి. అమ్మగారు చెప్పినదానికి తలూపితే ఇలానే వుంటుంది.ఉత్సవిగ్రహం దండగ కదా!! రోశయ్యగారైనా, కిరణ్‌కుమార్ గారైనా, ఇంకెవరైనా పదవి తో పాటు నిర్ణయాలు తీసుకోగలిగిన అధికారం ఉంటేనే పదవి.....లేక పొతే గంగిరెద్దుని కుడా గద్దెపై కూర్చోబెట్టి పరిపాలన డిల్లి నుంచి అమ్మగారు నడిపిస్తారు
ఆ ఏదోలెండి కొద్దిగా వున్నట్లు ఊహించుకున్నాలెండి. గుడ్డిలో మెల్లలా అనుకోండి -:) చిలమకూరు విజయమోహన్ గారు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి