
కోటి ఆశలతో కొంగ్రొత్త వత్సరానికి స్వాగత సుమాంజలితో...
చిగురాకుల పైనుంచి రాలిపడే మంచు ముత్యాల దండలతో...
హరివిల్లు అందాలతో...ధనుర్మాసపు హరిదాసుల వేకువ మేలుకోలుపులతో....
పచ్చని పేడకళ్ళాపులతో...తీర్చిదిద్దిన రంగుల రంగవల్లులతో...
ముగ్గుల్లో గొబ్బెమ్మలు..చుట్టూ కావ్యకన్నెల్ని తలపించే అందాల అతివలతో...
సరదాల సరాగాల పాటలతో...చలి మంటలతో...పసిడి రాశులకు ధీటైన ధాన్యపు రాసులతో..
గంగిరెద్దుల నాట్యాలతో....బుడబుక్కల వాని దీవెనలతో...కళలాడే పల్లెలు, పట్టణాలు....
సంకురాతిరి ముందు వచ్చే నూతన సంవత్సరం
సంక్రాంతి శోభతో.... దేదీప్యమానంగా అందరి ఇళ్ళలో కొత్త కాంతులతో...
ధగ ధగా మెరవాలని...శుభాలు కొలువు తీరాలని.....
ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.....
నా జ్ఞాపకాలు కొన్ని....మీ కోసం!!
నాకు గుర్తు వున్నంత వరకు అప్పట్లో నూతన సంవత్సరం వస్తోందంటే ఎవరికి ఏ సినిమా హిరో / హిరోయిన్ ఇష్టమో ఆ గ్రీటింగ్ కార్డులు కొని ఇవ్వడమో లేదా పోస్టు చేయడమో, నాకు గుర్తు ఉన్నంత వరకు మా చిన్నప్పటి స్కూలులో ఆ రోజు మా హెడ్ మాస్టర్ గారు ప్రయివేట్ క్లాసు పెట్టి యాపిల్ / బోకే ఇవ్వని వాళ్ళని కొద్దిగా కోపం గా ఏదోఒక వంకతో కొట్టడం, తిట్టడం. తర్వాత అది చెప్పుకుని మేము నవ్వుకోవడం...ఇక ఇంటిదగ్గర ముందు రోజు రాత్రి అమ్మతో, అక్కతో..ముగ్గులు వేయమని పోట్లాట. పొద్దున్నే అమ్మ ముగ్గుతో రాస్తే దానిలో రంగులు వేయడం అప్పటికి విచ్చుకున్న బంతిపూలు తుంపి అలంకారాలు చేయడం, అమ్మమ్మ చెప్పింది కదా ఈ ఒక్క రోజు చదివితే సంవత్సరం అంతా బాగా చదువుతామని బుద్దిగా ఇష్టమైన పుస్తకం oతీసి చదవడం, తొమ్మిది లో అనుకుంటా జనవరి ఒకటినే తిరుమలతిరుపతి దేవస్థానం వారు పెట్టిన పరిఖ్స రాయడం స్కూల్లో మూడో స్థానంలో రావడం ఆ ప్రసంసాపత్రంపై జూనియర్ సుముద్రాల గారి సంతకం, వీలైతే సినిమాకి చెక్కేయడం.....ఇక తర్వాత వచ్చిన గ్రీటింగ్ కార్డులు ఎవరివి ఎక్కువ అని లెక్కలు చూసుకోవడం.....నిజంగా ఎంతో సరదాగా సంతోషంగా గడిచిపోయేది ఆ కొత్త సంవత్సరం వచ్చిన రోజు. అప్పట్లో శుభాకాంక్షలు చెప్పుకున్నా మనసులో నుంచి ఆప్యాయంగా వచ్చినట్లు అనిపించేది, కాని ఇప్పుడు మొహమాటానికో, మొక్కుబడికో చెప్పుకుంటునట్లుగా అనిపిస్తోంది.....ఏదైనా కానివ్వండి రాబోయే కొత్త సంవత్సరం నుంచైనా అందరూ సంతోషంగా వుండాలని...ఆశలు, ఆశయాలు,కలలు,కోరికలు అన్ని ఈడేరి ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం వెల్లివిరియాలని కోరుకుంటూ మరొక్కమారు అందరికి ఇవే నా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.....
8 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
హాయ్ మంజు గారూ,
మీకు హ్యాపీ న్యూ ఇయర్,
అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా
చాలా రోజులనుండీ మీరు కనపడడం లేదు,విషెస్ చెపుదామంటే
మీ జ్ఞాపకాలు బాగున్నాయి.మీకు కూడ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.
అవును లతా నాన్నకి కాలు కి దెబ్బ తగిలి హాస్పటల్ లో వున్నారు ఇంకా ఇంటికి రాలేదు మీకు కుడా న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు
మీకు కుడా న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు అశోక్
hi
endukano ee year evariki nenu happy new year cheppa ledu.incoming calls teeskunnanu.na new year bhayamga start ayindi.enduko telidu...
భయపడకండి అంతా బావుంటుంది......
Hey i am late but my heartily wishes for the new year and sankranthi
మీకు కుడా.....థాంక్యు థాంక్యు రమేష్ గారు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి