31, మే 2011, మంగళవారం

ఓ చేదు నిజం!!

స్నేహితులైనా చుట్టాలైనా ఎవరైనా కానివ్వండి మనని నమ్మిన వారిని మోసం చేయడం, అన్యాయం చేయడం మాత్రం సమంజసం కాదు. మన స్వార్ధం కోసం ఎదుటివాళ్ళకు ఏదో ఒక మాట చెప్పి మన పబ్బం గడుపుకోవడం, మన అవసరాల కోసం ఎదుటి వాళ్ళను వాడుకోవడం సరియైన పద్దతి కాదు. మనమీద పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. మాటలు చెప్పడం కాదు నిలబెట్టుకోవడం కూడా తెలియాలి. స్నేహితుడు సన్నిహితుడు అని నమ్మి తన వాళ్ళను కాదని తన పరువు, ప్రతిష్ఠని స్నేహితునికి అప్పచెప్తే ఇప్పుడు ఏమి చెయ్యాలో తెలియని స్థితిలో పడవేసిన ఆ స్నేహితుని ఏ పేరుతొ పిలవాలి? పై పై మెరుగులుకానివ్వండి, వేరే ఏదైనా కానివ్వండి..నమ్మక ద్రోహం చేసిన ఆ స్వార్ధం మానవ విలువల మీద నమ్మకాన్ని కోల్పోయేటట్లు చేస్తోంది. తళుకు బెళుకులకు మోసపోయి మత్తు కమ్మిన మాయలో పడి మంచి చెడు లేకుండా ప్రాణ హితుడిని వంచన చేసిన పాపం ఊరికినే పోదు. నమ్మకంగా నమ్మినందుకు ఇంత విలువైన బహుమతిని కానుకగా ఇచ్చిన ఆ పెద్ద మనిషి అంటుంటాడు నేను చాలా చేసాను కాని... నన్ను పక్కన పెట్టారు అని ఇంకా చాలా చాలా రకరకాల అబద్దాలతో ఆ నమ్మిన స్నేహితుని ఇంట్లో కూడా చిచ్చు పెట్టడంలో సఫలీకృతుడు అయ్యాడేమో మరి?? నిజానిజాలు తెలిసి కూడా గొర్రె కసాయి వాడిని నమ్ముతుంది అన్న సామెత నిజం ఐంది కూడా!! ఓ వయ్యారిభామ కూడా తన వంతుగా చేతనైన సాయం చేసింది.....!! తన అకుంఠిత దీక్షతో తను అనుకున్నది సాధించింది. మొత్తానికి మరో పలనాటి చరిత్ర పునరావృతమైంది. నిజం కూడా మౌనంగానే ఉండిపోయింది ఏమి చేయలేక!!

3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

లత చెప్పారు...

మీరు చెప్పింది నిజమండి
కానీ ఏమీచెయ్యలేము కద, బాధపడకండి

మాలా కుమార్ చెప్పారు...

లోకం అంతే నండి .

చెప్పాలంటే...... చెప్పారు...

బాధ ఏమి లేదండి కానీ మోసాన్నే అందరూ నమ్ముతున్నందుకు కోపంగా వుంది ఏమి చేయలేక
లత గారు....
ఒక్కోసారైనా లోకం పోకడ మారుతుందేమో అని ఓ చిన్న ఆశ మాలా గారు.ఆశ పడటంలో తప్పు లేదు గా....
మీ ఇద్దరికి చాలా థాంక్స్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner