2, ఏప్రిల్ 2012, సోమవారం
రక్షక భటులా..!! ధన భక్షకులా..!!
మన పోలీసు అధికారుల హవా, డబ్బుల కోసం పడే తపన చూస్తుంటే మానవతా విలువలు ఎటు పోతున్నాయో అని భయంగా వుంది. రాజకీయ హత్యలు, కొట్లాటల హత్యలు, ప్రైవేట్ హత్యలు, సెటిల్మెంట్లు ....ఇవి మన పోలీసు అధికారుల ఉద్యోగం. ఎక్కడో ఎవరో చచ్చిపోతే సంబంధం లేని వ్యక్తులను ముసలి ముతకా ఆడవాళ్ళు అని కూడా చూడకుండా అర్ధరాత్రి ఇళ్ళ మీదకి వెళ్లి స్టేషనుకి రమ్మని భయపెట్టి, నయానో భయానో వీలైనంత వరకు డబ్బులు దండుకునే రక్షకభట అధికారులను అడ్డుకోవడానికి ముందుకు వచ్చే వ్యక్తో...వ్యవస్థో ...రావాలి...!!
మనకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే మనకో సమస్యగా మారుతుంటే ఇక ఎవరితో మొరపెట్టుకోవాలో తెలియని పరిస్థితి ఈనాటి సామాన్యునిది. కేసులు రాయకుండా మధ్యవర్తిత్వానికి ఇంత... జైల్లో కొట్టకుండా ఉండటానికి ఇంత...ఇలా ప్రతి పనికి రేటు పెట్టిన ఘనత మన పోలీసుబాబులదే.... !!
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
వ్యవస్థ మారాలి. ఫ్రతి ఒక్కరిలో మార్పు రావాలి. ముఖ్యంగా లంచగొండితన్నాని అరికట్టాల్సిన బడా బాబులే ( రాజకీయ నాయకులు, మనం ఎన్నుకునే మంత్రులు) ఎన్ని రకాలుగా అవినీతి చెయ్యొచ్చో ప్రత్యక్షంగా చూపిస్తుంటే ఏమి చెయ్యలేకపోతున్నరు కదా సామాన్య జనం. ఇంక పోలీసులు ధన భక్షకులే కదా? పోలీసు బాబులు కూడా బడా బాబుల అదుగుజాడల్లోనే walking కదండి...
మీరు చెప్పింది నిజమే అండి వ్యవస్థలో మార్పు రావాలంటే ముందు మనమే మారాలి. మనం ఎన్నుకునే నాయకులను మార్చాలి...వాళ్ళు మారరు కనుక మనమే ఎన్నికా విధానాన్ని మార్చాలి....లేదా ఎన్నికలనే బహిష్కరించాలి.
మీ స్పందనకు ధన్యవాదాలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి