28, ఏప్రిల్ 2012, శనివారం

ఎదురుగా నీవుంటే....!!

మంచు ముత్యాల మేలిముసుగు పరదాల చాటునుంచి
దోబూచులాడుతూ తొంగిచూసే తొలిపొద్దు.....
కనిపించి కనిపించని సయ్యాటలాడే వేళ...
రేయి అందాలను సూరీడుకప్పగించి...
జాబిలమ్మ సెలవు తీసుకునే సమయాన...
ఎందరున్నా ఎవరూలేని ఏకాంతంలో...
నీ సాన్నిహిత్యపు అనుభూతిలో
ఓలలాడే వేళ...సుదూర తీరాలలో....
నీ పిలుపు వినిపించిన తన్మయ తాదాత్మ్యంలో...
ఒక్కసారిగా...ఉలికి పడి కనులు తెరిచి
చుస్తే ఎదురుగా నీ రూపం సాక్షాత్కారమే..!!

3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

బాలకృష్ణా రెడ్డి చెప్పారు...

అందమైన భావన ..
ఎదురైనా వేళ అది
ఎంత మధురమైన దీవన
అభినందనలు
తాదాత్మ్యంలో ..ఈ పదం ఒకసారి సరి చూడండి

anrd చెప్పారు...

మీ కవిత చాలా బావుందండి.

చెప్పాలంటే...... చెప్పారు...

తప్పునకు మన్నించండి బాలకృష్ణారెడ్డి గారు...ధన్యవాదాలు

anrd గారు థాంక్యు అండి కవిత నచ్చినందుకు...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner