29, డిసెంబర్ 2012, శనివారం

నువ్వేమిటో....!!

పంచుకోవడానికి పెంచుకున్న అనుబంధం ఎక్కడో...!!
నీకు తెలిసిన చుట్టరికమే...కాని ఒప్పుకోవు...!!
మమకారం మాటలు కరువై మూగబోయింది...!!
నువ్వు అలిగి నాతొ మాటాడనట్లే.!!
వేదన వర్షమై కన్నీరు ధారలా జారుతోంది...!!
నువ్వు కూడా జారిపోతున్నావు దొరకుండా...!!
నా అనుకున్న బంధమే నాది కానంటోంది...!!
నువ్వు నన్ను కాదనుకున్నట్లే.!!
జ్ఞాపకాల్లో బతికేద్దామంటే...
బతుకే జ్ఞాపకంలా అయిపొయింది...!!




28, డిసెంబర్ 2012, శుక్రవారం

అసలెందుకి విభజన వాదాలు...!!

అసలెందుకి విభజన వాదాలు...పని లేని వారు స్వార్ధ రాజకీయం చేస్తే అందరు కొట్టుకు చస్తున్నారు..ఇప్పుడు...!! తెలంగాణా వాదమైనా...సమైఖ్యాంద్ర వాదమైనా...ఇలా చాలా విభజన వాదాలు బరిలోకి వస్తున్నాయి...!! ఈ విభజన వాదాలతో....పొరుగు రాష్ట్రాలను అభివృద్ధి చేస్తూ మనం ఎంత వెనుక బడి పొయామో....!!
అది ఎవ్వరు ఆలోచించరేంటి ....?? ఏ వాదమైనా రాజకీయ నాయకులకు ఉపయోగం కాని మనకు ఏదైనా ఒకటే..!! మన పని మనకు తప్పదు....ఏ ధరలు దిగి రావు...!!
ఆ చార్జీలు...ఈ చార్జీలు...అంటూ మనకు బిల్లుల మోతా తప్పదు...మనం కట్టకా తప్పదు...ఒక్క సారి కాస్త ఆలోచించండి...మన పక్క రాష్ట్రమైన గుజరాత్ ఎందుకు అభివృద్ధి పధం లో ముందుకెళుతోందో....!! మనమెంత వెనుకకు వెళ్లిపోయామో చూస్తూ కూడా ఇంకా ఈ విభజనల కోసం...పదవుల కోసం పాకులాడే రాజకీయ నాయకులకు...డబ్బుల కోసం పార్టీలు మార్చే నాయకులకు వత్తాసు పలుకుతారా..!!
రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకు వెళ్ళాలా....వద్దా...!! అన్న నిర్ణయం మన చేతి లోనే ఉంది...కనీసం ఇప్పటికయినా కళ్ళు తెరచి నిజాన్ని చూడాలి....ఓటే....మన ఆయుధం....మంచి నిర్ణయం తీసుకొండ్...!!

27, డిసెంబర్ 2012, గురువారం

మనం ఎలా ఉంటున్నాం...!!

సినిమాలు చూస్తాము...పుస్తకాలు చదువుతాము...టి వి లో అన్ని చూస్తాము...కనపడిన వాళ్ళతో కబుర్లు చెప్తాము...వాళ్ళు అలా ఉన్నారు...వీళ్ళు ఇలా ఉన్నారు...అని మనకు నోటికి వచ్చిన మాటలు చెప్తాము....నీతులు బోలెడు చెప్తాము వినే వాళ్ళు ఉండాలి కాని....కాకపొతే మనం ఎక్కడ ఉన్నామో చూసుకోము...ఎందుకంటే మన మీద మనకంత నమ్మకం..మనం మాత్రమే మంచి వాళ్ళమని....!!
వంద నీతులు చెప్తే కనీసం ఒక్కదాన్ని కూడా మనం పాటించాలనుకోము...మరి ఇదెక్కడి న్యాయమో...!! ఎవరో అన్నట్లు నీతులు పక్కవాడికి చెప్పడానికే అని...!! ఒక వేలు ఎదుటి వాడికి చూపిస్తే మన నాలుగు వేళ్ళు మన వేపే చూపిస్తాయి..కాకపొతే మనకు అర్ధమయి చావదు..!!
కోపాలతో....ద్వేషాలతో..మోసాలతో...అసూయతొ...నిండి పోయింది ఇప్పటి ప్రపంచం.....ఏ బంధమూ...బందుత్వము అక్కరలేదు...మనం బాగున్నామని అనుకోవడానికి ఏం చేయాలా...ఎవరిని బోల్తా కొట్టించాలా...!! అన్న ఆలోచన లోనే మూడువంతుల జీవితాన్ని కానిచ్చేస్తున్నాము...నటనలో మనం అందరి కన్నా ముందే ఉంటున్నాము...మనతో కూడా మనం నటిస్తున్నాం కదా..!! నటనలో మాత్రం పరిపూర్ణంగా జీవిస్తున్నాము....ఈ జీవితంలో...!!
గుండెల మీద చేయి వేసుకుని చెప్పగలుగుతున్నామా...!! కనీసం ఒక్క నిమిషం అయినా శాంతిగా సంతోషంగా ఉండగలుగుతున్నామా...!! అలా లేనప్పుడు ఈ సంపాదనలెందుకో...!! ఈ నటనలెందుకో....!! కాకిలా కలకాలం బతికే కంటే...హంసలా అర నిమిషం బతికినా....చాలు...!! క్షణికావేశం లో అరిషడ్వర్గాలు మన మీద పెత్తనం చెలాయిస్తాయి...వాటికి మనం బానిసలం...అందుకే కొందరు మాత్రమే మహనీయులు....మనం మామూలు మనుష్యులం.....!!

26, డిసెంబర్ 2012, బుధవారం

డిలీట్ ఆప్షన్ ఉంటే.....!!

ఎప్పుడూ అందరూ వినే మాట పారవేయడం...మనకు నచ్చని వాటినో...ఇష్టం లేని వాటినో పారవేయడం ఓ సహజ ప్రక్రియగా తీసుకుంటాం...కాని ఆ..పారవేయడం అన్న మాట ఎదుటి వారిని ఎంత ఇబ్బంది పెడుతుందో ఆలోచించం...!! మన అవసరం తీరిన తరువాత వస్తువునైనా....వ్యక్తినైనా మరిచిపోయినట్లు నటించడమో...లేదా పక్కన పెట్టేయడమో చేస్తున్న రోజులివి....!! జ్ఞాపకాల్లో బతికేద్దామనుకునే వాళ్ళు కొందరైతే....జ్ఞాపకాలే లేని వాళ్ళు మరికొందరు....కొన్ని జ్ఞాపకాలు జీవితాలని చైతన్యవంతం చేస్తే...మరి కొన్ని జీవశ్చవాల్ని చేస్తున్నాయి..!!
వస్తువునైతే నచ్చక పోతేనో..లేదా ఇష్టం లేక పోతేనో పారవేసినట్లు మన జీవితంలో అలా నచ్చని వ్యక్తులను, జ్ఞాపకాలను  పారవేయగలమా...!! అలా చేయగలిగితే...!! ఎంత బావుంటుంది కదూ....!! ఇప్పటి పరుగులెత్తే కాలంలో కంప్యూటర్లలో డిలీట్ బటన్ ఉన్నట్లు జీవితంలో కూడా డిలీట్ ఆప్షన్ ఉంటే.....!! ఆ ఊహ చాలా బావుంది నాకైతే...!! మరి మీకో....!!

24, డిసెంబర్ 2012, సోమవారం

చంద్రునిలో మచ్చలా...!!

మనసెరిగిన మనసుతో ఆహ్లాదం
పంచుకునే పలుకులు
పెంచుకునే అనుబంధానికి ప్రతీకలు....!!
పగిలిన హృదయం నుంచి 
విరిగిన ముక్కలు ఏరుకుంటుంటే...
లెక్కలేనన్ని ముక్కల చుక్కల్లో...
కన్నీటి జ్ఞాపకాలు ఎన్నెన్నో....!!
అతుకులేసిన ఎదలో....
వెతల చారలు అలానే ఉండిపోయాయి...
నిరీక్షణలో నీరసించిన...
చంద్రునిలో మచ్చలా...!!

23, డిసెంబర్ 2012, ఆదివారం

ఎంత బావుండు....!!

దొరక్క దొరక్క దొరికిన పెన్నిధి
జారిపోతున్నానంటోంది జాలిగా చూస్తూ....
ఏమి చేయలేని నిస్సహాయతను చూసి..
పగలబడి నవ్వుతోంది కాలపాశం...
నేనెవరి కోసం ఎదురు చూడను
నా పని నాదే అంటూ...!!
చూస్తూ చూస్తూనే తరిగి పోతోంది
మబ్బుల చాటుగా నింగి లోని జాబిలి
జరుగుతున్న సంఘర్షణ యుద్దానికి  
మూగ సాక్షిగా ఉండలేక....!!
మరణ శాసనాన్ని మార్చి రాయడానికి
అపర బ్రహ్మను కానే కాను...!!
విధిరాతను మార్చి రాసే వింత...
జరిగితే.....!! ఎంత బావుండు....!! 

20, డిసెంబర్ 2012, గురువారం

కానరాని నీ కోసం....!!

అటు ఇటు ఎటు వెళ్ళినా...
తడబడే అడుగులు....
అదో ఇదో ఏదో అనుకున్నా...
నీ స్వరమే అనిపిస్తుంటే...
పక్కన కదలాడే కదలికలో కూడా...
నీ రూపమే కనిపిస్తుంటే...
జాడ లేని నీ ఉనికిని కాదని 
ఎలా ఊరుకొను...!!
ఎక్కడా...కానరాని నీ కోసం
ఏ తావినని వెదకను...!!





19, డిసెంబర్ 2012, బుధవారం

సంతోషంగానే ఉన్నా...!!




అన్నట్టు నా బ్లాగ్ కూడా ఏభై వేల వీక్షణలను దాటేసిందోచ్....మూడు వందల ఏభై టపాలను...ఏభై వేల వీక్షణలను కూడా దాటేసి మొత్తానికి నేను కూడా సంతోషంగానే ఉన్నా...!!

18, డిసెంబర్ 2012, మంగళవారం

నిర్లక్ష్యానికి మూల్యం.....!!

బంధాలను బంది చేసి
బాధ్యతలను గాలికి వదలి
టింగు రంగా అంటూ...
పైలా పచ్చీసు గా తిరిగే
ఓ ఘరానా పెద్దమనీషి...!!
తెల్ల చొక్కాలో అంతా తెలుపే....
అని నువ్వనుకుంటే సరిపోదోయి...!!
ఊసరవెల్లి రంగులు పదుగురికెరుకోయి...!!
పని పాటా లేక నువ్వు చెప్పే 
గాలి కబుర్లు వినే వాళ్ళు కూడా...
నిన్ను చూసి చాటుగా నవ్వుకుంటున్నారు...!!
కోట్లకు అధిపతిని అని నువ్వు గొప్పలు చెప్పుకున్నా....
పైసాకు గతిలేని వాడివని తెలియనిదెవ్వరికి...??
మోసాలు వేషాలు అన్ని మానవోయి...
బంధాలను బాధ్యతలను విడనాడక
అభిమానానికి అందిచవోయి నీ చేయి...!!
అవసరానికి నీకడ్డు పడే అనుబంధమదేనోయి...!!
ఎండమావులే ఒయాసిశ్శులని వెంపర్లాడకోయి..!!
నిర్లక్ష్యానికి మూల్యం వెలకట్టలేనిదోయి...!!
చేజార్చుకుంటే...బ్రతుకే...చీకటోయి..!!
బతుకు విలువ తెలియకపోతే....

జీవితమే చేజారిపోతుంది జాగ్రత్తోయి....!!

17, డిసెంబర్ 2012, సోమవారం

ఇప్పటి స్నేహాలు ఎన్నాళ్ళో...!!

కొత్త పరిచయాలు ఒక్కోసారి భయంగా అనిపిస్తూ ఉంటాయి....!!
అలా అని అన్ని ఒకేలా ఉండవు...ఒకప్పుడు పరిచయాలకు అనుబంధాలకు ఉత్తరాలే వారధిగా ఉండేవి....ఎంత దూరంలో ఉన్నా...ఆలోచనల్ని, ఆనందాన్ని...
ఇలా ఏ అనుభూతినైనా పంచుకోవడానికి
ఉత్తరాలే బావుండేవి...!!
ఇప్పట్లా ఫేస్ బుక్ లు...చాట్ లు లేకపోవటమే..అప్పట్లో....!!
ఉత్తరాల జ్ఞాపకాలు ఇప్పటికి...ఎప్పటికి మధురంగా బావుంటాయి...నాకైతే...!!

ఇప్పట్లో ఫేస్ బుక్ ఎకౌంట్ లో కాని మరే ఇతర చాట్ ఎకౌంట్ లో కాని ఎంత మంది ఫ్రెండ్స్ ఉంటె అంత గొప్ప...మనకు తెలిసిన వాళ్ళే కానక్కరలేదు..ఎవరైనా పర్లేదు అని ఓ కే అంటే ...అన్ని బావుంటే పర్లేదు...కాని ఏ చిన్న తేడా వచ్చినా జీవితమే మారిపోయే అవకాశం ఎక్కువ..!!
ప్రతి ఒక్కరికి వాళ్ళకంటూ ఉన్న సమయాన్ని మనకోసం వాడుకోవాలనుకోవడం మాత్రం సరియైన పద్దతి కాదు..అలా కాకుండా ఎవరికీ ఇబ్బంది లేకుండా మన పరిధిలో మనం ఉంటే ఏ పరిచయమైనా పది కాలాలు ఉంటుంది....!! మన మూలం గా ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడకూడదు అది గుర్తు ఉంటె చాలు...!!
నాకేదో కష్టం ఉందని ఎదుటి వాళ్ళు జాలి చూపించాలి...సాయం చేయాలి...ఇలా ఏవేవో అనుకుని స్నేహం చేయడం తప్పు...కష్టం, సంతోషం పంచుకోవడం తప్పు కాదు...ఎదుటి వాళ్ళ జీవితంలోకి మనం చొరబడాలనుకోవడం తప్పు...!! వాళ్ళకంటూ ఉన్న సమయాన్ని వాళ్లకు వదిలేయండి....పలకరించినప్పుడు మాట్లాడండి...!! ఎప్పుడూ....మాట్లాడాలనుకోవద్దు..అది ఇద్దరికి మంచిది కాదు....ఆ స్నేహం ఎక్కువ కాలం నిలువదు...!!
ఉత్తరాల్లో ఉన్న నిజాయితీ ఇప్పటి స్నేహాల్లో ఉందని అనుకోవడం కూడా పొరబాటే....!!
చాలా తక్కువ స్నేహాలు ఏ కల్మషం లేనివి ఈ రోజుల్లో....!!
ఎనిమిది ఏళ్ళు ఒకరిని ఒకరు చూసుకోకుండా రాసుకున్న ఉత్తరాల స్నేహం
ఇప్పటికి అప్పటి పరిమళాలతో అలానే ఉంది....!!
మరి ఇప్పటి స్నేహాలు ఎన్నాళ్ళో...!!

16, డిసెంబర్ 2012, ఆదివారం

దేవుడు - లంచం - మనిషి....!!

మనకు తెలివి చాలా ఎక్కువ...!! ఎలా అంటారా....!! మనని సృష్టించిన దేవుడికే లంచం ఇస్తూ ఉంటాము కదా...!! మన పని చేయించుకోవడానికి...!! నిజంగా మనిషి ఎంత గొప్పవాడు...!! తనని సృష్టించిన దేవునికే లంచం ఇవ్వచూపి తన పని చేయించుకుంటున్నాడు..!! ఆ దేవుడే తన సృష్టి గొప్పతనానికి కి తలవంచుతున్నాడు..!!
అందుకే...ఓ మనిషీ....నీకు జోహార్లు....!!
దేవునితో మొదలు పెట్టిన లంచం అలా అలా పయనించి అందరిని అల్లుకు పోయింది విడదీయరాని లతలా...!!
అందులోను మన భారతీయులకు సనాతన సాంప్రదాయాలు చాలా ఎక్కువ కదా....!! ఒక్కరేంటి అందరు పాటిస్తారు...అందుకే...మనం లంచాల్లో మొదటి స్థానంలోనే వుండి వుంటాం..!!
అయినా దేవుడే మొక్కులకు లొంగి పోతాడు కదా...!! మనము అంతే లెండి తప్పేమీ లేదు..అని సరి పెట్టుకుంటే పోలా...!!

15, డిసెంబర్ 2012, శనివారం

సంఘర్షణ...!!

ఎందుకలా వదిలేసి వెళ్ళిపోయావు...??
నచ్చలేదనా...!! అర్ధం కాలేదనా...!!
చెప్పాపెట్టకుండా అలా వెళిపోతే....ఎలా..!!
ఆద్రత తో దగ్గరకు తీసుకుంటావనుకుంటే...!!
అక్కరలేదని పోతున్నావు...!!
పక్కనే ఉన్నా దూరం బోలెడు....!!
అంతరమో...!! అహమో..!!
అడ్డుగోడగా ఉంది మధ్యలో..!!
మారని నేను..మారిన విలువలతో....నువ్వు..!!

నీ సాన్నిహిత్యం లో సన్నిహితం దూరమైంది నాకు...!!
అందుకే ఈ తెలియని అంతరంగపు సంఘర్షణ...!!

14, డిసెంబర్ 2012, శుక్రవారం

జీవిత పుస్తకం...!!

నాకు నేనే ఒక అర్ధం కాని వింత పుస్తకాన్ని...!! అలాంటప్పుడు ఎదుటి వారు నాకెలా అర్ధం అవుతారు..??
నేను వాళ్ళకెలా తెలుస్తాను...!! తెలియాలని అనుకోవడం కూడా పొరపాటే అవుతుంది..!!
నాలోనూ ఆవేశం..కోపం..ద్వేషం..బాధ..సంతోషం....ఇలా అన్ని భావావేశాలు ఉన్నాయి. ముఖచిత్రం బావుందని పుస్తకం తెరిస్తే ముందుగా ముందు మాటల్లో సంక్షిప్తంగా కాస్త తెలుస్తుంది మనసు తెలిసిన వాళ్లకి...!! ముందు మాటల్లో గొప్పగానే పొగడ్తలుంటాయి కాక పొతే అన్నీ నిజాలు కాదేమో...!! అలా అనిపించడానికి కారణం మన గురించిన నిజాలు మనకి తెలుసు కదా..!!
ఎంత మంచి పుస్తకమైనా అందరికి నచ్చాలని లేదు....అలానే పొగడ్తలకు చోటున్నట్టే విమర్శలకు స్థానముంటుంది...!! పుస్తకంలో మొదలు పెట్టిన ప్రతి పేజి బావుండాలనే అందరికి నచ్చాలనే అనుకుంటాము...కాకపొతే దేవుడే అందరికి మంచివాడు కాదు కదా....ఇక మనమెంత...!!
కొన్ని పేజీలు ఖాళీగా వదిలేద్దామని అనుకుంటే కుప్పలు తెప్పలుగా ఎన్నో ఎన్నెన్నో జ్ఞాపకాల పుటలు దొంతర్లుగా వచ్చి చేరతాయి....మరి కొన్నేమో మనం ఎంత అందంగా నింపుదామన్నా అలా ఖాళీగానే ఉండి పోతాయి ఎప్పటికి...!!
పుస్తకంలో మొదటి చివరి పేజీలు అందరికి ఒక్కటే.....మధ్య పేజీలు ఎలా....అన్నది మన ఇష్టం....!!
ఎంతో అందంగా మొదలైన  పుస్తకం లోని మొదటి పేజి అలా అలా పేజీలు పెరుగుతున్న కొద్ది జీవిత సత్యాలు తెలుసుకుంటూ....కలల్ని...ఆలోచనల్ని..కాలంతో పాటుగా మోసుకుంటూ...మర్చిపోలేని పేజీలను దాచుకుంటూ...అక్కరలేని పేజీలను వదిలేస్తూ...అలా పయనిస్తూ చివరికి చివరి పేజీలోకి వస్తే.....!!
ఏముంది కధ సుఖాంతం...!! 

13, డిసెంబర్ 2012, గురువారం

గమనిక....!!



నిన్న నేను నా బ్లాగ్ లో పోస్ట్ చేసిన కవిత అపురూపం 12-12-12 12:12:12 కి.....
ఒక్కరు గమనించారు...సంతోషం...!!
అన్నట్టు ఆ టపా నా 350 వ టపా అండి...అబ్బో చాలా రాసేశాను కదూ....!!
ఆదరిస్తున్న అందరికి కృతజ్ఞతలు....!!

12, డిసెంబర్ 2012, బుధవారం

అపురూపం...!!

ఏమైందో ఏమో తెలియడం లేదు కాని...
నీతోనే ఉన్న నా మనసు నాతొ మాటాడనంది...!!
నాతొ అలుకో మరి..నేనంటే అ ఇష్టమో...!!
సరే అని నీతో పంచుకుందామంటే....
నీ మనసు నీ మాట వినదాయే....!!
అది నాదగ్గరుంది...!!
ఏమిటో...నేను నీ దగ్గర...!!
నువ్వు నా దగ్గరా....!!
మరి ఇద్దరం కలిసేదెన్నడో...!!

11, డిసెంబర్ 2012, మంగళవారం

ఇదీ బావుంది....!!

చుట్టూ అందరున్నా నాకెవ్వరూ లేనట్టుగా
అన్ని బందాలున్నా ఏ బంధమూ నాది కానట్టుగా
నిస్పృహో....
నిట్టూర్పో..
నిస్సహాయతో...
ఏదో తెలియని...
నిశ్శబ్ద శూన్యం ..!!
ఒంటరితనంతో ఏకాంతమో....!!
ఏకాంతంతో సహవాసమో....!!
ఎలా ఉన్నా అన్నింటా నువ్వే...!!
వడి వడిగా పరుగులెత్తే  కాలం
ఎవరి కోసం దేని కోసం ఆగనట్లే.....
మెల్లగా తడిమి వదలి పోయింది....
నీ జ్ఞాపకాలతో నన్నుండమని....!!

ఎలా చెప్పినా....!!

చుక్కల్లో ముగ్గులేసి
మేఘాల్లో రంగులద్ది
మెరుపుల్లో మాయతో
హరివిల్లు సృష్టించినా....
నీ పెదవి పై జాలువారే...
చిరునవ్వు కి సరిపోవు....!!
ఇంకెందుకు నీకు అలుక..??
విరి పువ్వుల కుసుమాలతో....
ఇదిగో....అక్షరాంజలి...అందుకో...!!





10, డిసెంబర్ 2012, సోమవారం

మౌనమైన మనసు.....!!

మాటలు రాక మూగబోయింది మనసు
మనసు తెలుపలేక అలసిపోయింది మౌనం
మౌనం మనసు మాటలకు సాక్ష్యమా....!!
మాటలేని మౌనంలో మనసు రాగాలెన్నో...!!
మాటలాడే వేళ మనసు తెలిసినా....
మౌనమైన మదిలో మాట తెలిసినా...
మాట మౌనమైనా...మనసు మాటాడుతుంది....!!

9, డిసెంబర్ 2012, ఆదివారం

గాయం....!!

గాయం చేసేది మనిషి
గాయపడేది మనసు
మనిషి గాయం మానుతుంది
మనసు గాయం మానదు
మనిషి మాయలో మనసు
ఆ మత్తులో మనసు చిత్తు
చిత్తైన మనసుకు చివరికి
మిగిలేది మనసు ముక్కలే....!!

8, డిసెంబర్ 2012, శనివారం

వెదుకులాటలో......!!

అందని హద్దు ఆకాశం అయినా అందుకోమంటూ
దగ్గరగా రా రమ్మంటూ ఆహ్వానం పలుకుతూ
మురిపిస్తూ మెరిపిస్తూ దగ్గరైనట్లే అనిపిస్తూ
దూరం దూరం పోతూనే ఉంటుంది...అచ్చం నీ లానే...!!

ఇదిగో ఇక్కడే ఉంది ఆవలి తీరం అంటూ...
అంతే లేని తీరం తెలియని సంద్రంలా...ఉన్న నీ మదిలో....
వెదుకుతూనే ఉంటుంది కనపడని తీరాన్ని
చేరాలనే తపనతో....అర్ధం కాని నీ మనసు
కలశంలో ఓ చిన్ని బిందువులా నా జ్ఞాపకం...
దాగుందేమో అని చిరు ఆశతో...!!
ఆనవాలు ఏమైనా దొరుకుతుందని తపనతో...!!
మరి దొరుకుతుందో....!! లేదో....!!

4, డిసెంబర్ 2012, మంగళవారం

ఈ మాటని చెప్పారేమో....!!

పెరటి చెట్టు ఇంటి వైద్యానికి పనికిరాదని అందరికి తెలిసిన పెద్దలు చెప్పిన సామెత కదా....!! ఇది నిజం అంటాను నేను....కాదనే వాళ్ళు చేతులెత్తండి...ఎంత మంది నాకు ఓటేస్తారో చూసి...దానిని బట్టి నేను రాజకీయాల్లోకి వెళ్లి... పార్టి పెట్టి కాస్త సొమ్ము సంపాదిన్చుకుందామని ప్లాను....ఎవరికీ చెప్పకండేం...!! మళ్ళి నాకు పోటి ఎక్కువైపోతుంది...!!
సరే మరి...చేతులెత్తితే నాకు కనపడి ఛావదు కదా అందుకే కామెంట్లు పెట్టేయండి.....!!
ఎంత గొప్ప  వైద్యుని వైద్యమైనా ఇంట్లో పనికిరానట్లే..!!
ఎంత గొప్పవారైనా పదిమందికి మంచి చేసినా ఇంట్లో పనికిరానివారే....!!
అందరికి నచ్చినా ఇంట్లోవాళ్ళకి నచ్చని వారే....!!
ఇలాంటివి అన్ని చూసే మన పెద్దలు ఈ మాటని చెప్పారేమో....!!
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner